సాక్షి, అనంతపురం: ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మైలారంపల్లి గ్రామంలో ఓ మహిళకు సంబంధించిన విషయంపై ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ఏడుగురు గాయపడినట్లు సమాచారం.
ఘర్షణలో గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని చికిత్స కోసం ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకున్న తర్వాత కూడా ఇరువర్గాల మధ్య వివాదం సద్దుమణగలేదు.
దీంతో ఆసుపత్రి ప్రాంగణంలోనే ఇరువర్గాలు మరోసారి గొడవకు దిగాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణంగా మారడంతో.. ఆసుపత్రి సిబ్బంది, రోగులు ఆందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అక్కడ భద్రత ఏర్పాటు చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి..


