వివాహేతర సంబంధం.. మహిళ శరీరంపై కారం, జీడిరసం | Atrocity against a woman in Jagtial district | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం.. మహిళ శరీరంపై కారం, జీడిరసం

Sep 15 2026 4:33 PM | Updated on Sep 15 2026 5:03 PM

Atrocity against a woman in Jagtial district

సాక్షి, జగిత్యాల: జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకుందని ఓ మహిళపై కులపెద్దలు అమానుషంగా ప్రవర్తించారు. కోరుట్ల మండలం అయిలాపూర్‌లోని ఊరి పొలిమేరల్లో వివాహేతర సంబంధానికి సంబంధించిన పంచాయితీ పెట్టారు. ఈ నేపథ్యంలోనే మహిళను వివస్త్రను చేసి ఆమెపై దాడి చేశారు. శరీరంపై కారం, జీడిరసం పూసి వికృతానందం పొందారు.

అయితే తీవ్రమైన బాధతో బాధితురాలు కేకలు వేస్తున్న కనికరించకుండా పైశాచిక ఆనందం పొందారు. సాటి మహిళలతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఈ అమానుష ఘటనపై పోలీసులు సుమోటో కింద కేసు నమోదు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement