కొండా సురేఖ వ్యవహారం.. ప్రభుత్వం కీలక నిర్ణయం | Officials locked Konda Surekha chamber | Sakshi
Sakshi News home page

కొండా సురేఖ వ్యవహారం.. ప్రభుత్వం కీలక నిర్ణయం

Sep 15 2026 3:09 PM | Updated on Sep 15 2026 3:15 PM

Officials locked Konda Surekha chamber

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి కొండాసురేఖ అంశంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సచివాలయంలోని కొండా సురేఖ ఛాంబర్‌కు అధికారులు ఈ రోజు (మంగళవారం) తాళం వేశారు. ఛాంబర్‌లోని మూడు పేషీలకు తాళం వేశారు. అదే విధంగా కొండా సురేఖ పేషీలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించి  పలువురిని వారి  సొంతశాఖలకు పంపారు.

కాగా కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్‌ అధిష్ఠానం కొండా సురేఖను క్రమశిక్షణ చర్యల పేరుతో మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆమె ఛాంబర్‌కు సైతం అధికారులు తాళం వేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement