హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నెం 10లోని ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ కల్చరల్ సెంటర్(ఎంఎంసీసీసీ)లో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభం అయ్యాయి. క్లబ్ అధ్యక్షుడు ఎనుగాల పెద్దిరెడ్డి, సెక్రటరీ రాగిడి లక్షా్మరెడ్డి, ఫౌండర్ ప్రెసిడెంట్ భూపాల్‌రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రతి పండుగను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా కార్యదర్శి లక్షా్మరెడ్డి తెలిపారు. కాలనీవాసులు పెద్ద సంఖ్యలో ఈ పూజల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో చిన్నారులు అలరించారు.


