breaking news
Vipraj Nigam
-
SRH Vs DC: ‘హే.. వెళ్లు.. వెళ్లు.. నువ్వు అవుట్’!.. కావ్యా మారన్ రియాక్షన్ వైరల్
చాలా రోజుల తర్వాత సొంతగడ్డపై మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సత్తా చాటింది. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ (SRH vs DC)తో సోమవారం నాటి మ్యాచ్‌లో రైజర్స్ బౌలర్లు అదరగొట్టారు. ముఖ్యంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) పవర్ ప్లేలో అద్భుతమే చేశాడు.ఐపీఎల్ చరిత్రలోనేఉప్పల్ వేదికగా సాగిన ఈ మ్యాచ్‌లో ప్రమాదకర ఓపెనర్లు కరుణ్ నాయర్ (0), ఫాఫ్ డుప్లెసిస్ (3)లతో పాటు.. వన్‌డౌన్ బ్యాటర్ అభిషేక్ పోరెల్ (8)ను కూడా వచ్చీరాగానే పెవిలియన్‌కు పంపాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన కెప్టెన్‌గా కమిన్స్ నిలిచాడు.Wickets ✅Catch ✅Captaincy ✅Pat Cummins is producing a perfect performance for #SRH in an important clash against #DC 🔥Updates ▶ https://t.co/1MkIwk4VNE#TATAIPL | #SRHvDC | @SunRisers | @patcummins30 pic.twitter.com/SbACH0yVcJ— IndianPremierLeague (@IPL) May 5, 2025 స్టబ్స్ దంచేశాడుఇక మిగతా వాళ్లలో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (10) వికెట్‌ను జయదేవ్ ఉనాద్కట్ దక్కించుకోగా.. కెప్టెన్ అక్షర్ పటేల్ (6) హర్షల్ పటేల్ బౌలింగ్‌లో కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ఈ క్రమంలో ట్రిస్టన్ స్టబ్స్ (36 బంతుల్లో 41) జట్టును ఆదుకునే ప్రయత్నం చేయగా.. విప్రాజ్ నిగమ్ అతడికి సహకరించాడు. అయితే, ఢిల్లీ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో బంతితో రంగంలోకి దిగిన రైజర్స్ స్పిన్నర్ జీషన్ అన్సారీ సంధించిన బంతిని ఆడిన స్టబ్స్.. విప్రాజ్తో కలిసి సింగిల్ పూర్తి చేశాడు.అయితే, మరో పరుగుకు కూడా ఆస్కారం ఉందని భావించి అందుకు ఉపక్రమించగా... విప్రాజ్ మాత్రం బ్యాటర్ ఎండ్‌లోనే ఉండిపోయాడు. ఇంతలో స్టబ్స్ అతడి వైపుగా పరుగు తీయగా.. బంతిని అందుకున్న ఫీల్డర్ అనికేత్ వర్మ జీషన్ వైపు విసిరాడు.హే.. వెళ్లు.. వెళ్లు.. నువ్వు అవుట్దీంతో వేగంగా స్పందించిన జీషన్ బౌలర్ ఎండ్ నుంచి వికెట్లను గిరాటేశాడు. అప్పటికి స్టబ్స్ బ్యాటర్ ఎండ్ వైపు వెళ్లగా.. విప్రాజ్ మాత్రం మరో ఎండ్‌కు చేరలేకపోయాడు. ఈ క్రమంలో ఎవరు పరుగు పూర్తి చేశారని థర్డ్ అంపైర్ పరిశీలించగా స్టబ్స్ విప్రాజ్‌ను దాటినట్లు తేలింది. దీంతో విప్రాజ్ మూల్యం చెల్లించకతప్పలేదు. 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్‌గా అతడు వెనుదిరిగాడు.ఈ సందర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యా మారన్ ఇచ్చిన రియాక్షన్ వైరల్‌గా మారింది. విప్రాజ్ రనౌట్ కాగానే.. లేచి నిలబడిన ఆమె.. ‘‘హే.. వెళ్లు.. వెళ్లు.. నువ్వు అవుట్’’ అన్నట్లుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. అంతేకాదు చప్పట్లతో తమ ఆటగాళ్లను అభినందించారు.Stubbs செஞ்ச Mistake-க்கு Vipraj Wicket போய்டுச்சு😫 📺 தொடர்ந்து காணுங்கள் | Tata IPL 2025 | SRH vs DC | JioHotstar & Star Sports தமிழில் #IPLOnJioStar #IPL2025 #TATAIPL #SRHvDC pic.twitter.com/YUmHK0745k— Star Sports Tamil (@StarSportsTamil) May 5, 2025ఆశలు ఆవిరికానీ ఢిల్లీని నిర్ణీత 20 ఓవర్లలో 133 పరుగులకే పరిమితం చేశామన్న సన్‌రైజర్స్ ఆనందాన్ని వర్షం ఆవిరి చేసింది. ఢిల్లీ ఇన్నింగ్స్ ముగియగానే మొదలైన వాన.. ఉధృతం కావడంతో రైజర్స్ బ్యాటింగ్ మొదలుపెట్టకుండానే మ్యాచ్ రద్దైపోయింది. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ రాగా.. సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది.ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే.. కమిన్స్ బృందానికి ఇంకా ఆశలు సజీవంగా ఉండేవి. ఇక ఈ మ్యాచ్‌లో స్టబ్స్ (41 నాటౌట్)తో పాటు అశుతోష్ శర్మ (26 బంతుల్లో 41) రాణించడంతో ఢిల్లీ ఏడు వికెట్ల నష్టానికి ఈ మాత్రం స్కోరు చేయగలిగింది. రైజర్స్ బౌలర్లలో కమిన్స్ మూడు, జయదేవ్ ఉనాద్కట్, హర్షల్ పటేల్, ఇషాన్ మలింగ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.చదవండి: IPL 2025 Playoffs Scenarios: లెక్క తేల్చిన వరుణుడు!.. సన్‌రైజర్స్ అవుట్.. మరి ఢిల్లీ రేసులోనే ఉందా? -
అశుతోష్ కాదు.. అతడు కూడా హీరోనే! ఎవరీ విప్రాజ్ నిగమ్?
ఐపీఎల్-2025లో సోమవారం వైజాగ్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఉత్కంఠ భరిత పోరు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్‌లో ఒకే ఒక్క వికెట్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఈ విజయంలో ఢిల్లీ ఆటగాడు అశుతోష్ శర్మది కీలక పాత్రం. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన అశుతోష్ తన ఫైటింగ్ నాక్‌తో ఢిల్లీకి సంచలన విజయాన్ని అందించాడు.ఓటమి తప్పదనుకున్న చోటు అశుతోష్ శర్మ అజేయ ఇన్నింగ్స్‌తో అసాధ్యాన్ని సాధ్యం చేశాడు. అశుతోష్ 31 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 66 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక ఢిల్లీ ఈ సంచలన విజయం సాధించడంలో అశుతోష్ పాత్ర ఎంత కీలకమైందో మరో ఆటగాడు విప్రాజ్ నిగమ్ పాత్ర కూడా అంతే వెల కట్టలేనిది. ఢిల్లీ విజయానికి 45 బంతుల్లో 97 పరుగులు కావాల్సిన సమయంలో విప్రజ్ క్రీజులోకి వచ్చాడు. అప్పటివరకు దూకుడుగా ఆడుతున్న ట్రిస్టన్ స్టబ్స్ ఔట్ కావడంతో ఢిల్లీ ఓటమి లాంఛనమే అంతా అనుకున్నారు. కానీ క్రీజులోకి వచ్చిన వచ్చిన విప్రాజ్తన దూకుడైన బ్యాటింగ్‌తో గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడుతున్నాన్న భయం కానీ బెరుకు కానీ అతడిలో కన్పించలేదు. ప్రత్యర్ధి బౌలర్లను విప్రాజ్ ఊచకోత కోశాడు. విప్రాజ్ కేవలం 15 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39 పరుగులు చేశాడు. విప్రాజ్ బౌలింగ్‌లోనూ ఓ కీలక వికెట్ పడగొట్టాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ సత్తాచాటాడు. ఈ క్రమంలో ఎవరీ విప్రాజ్ నిగమ్ అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.ఎవరీ విప్రాజ్ నిగమ్?20 ఏళ్ల విప్రాజ్ నిగమ్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఉత్తరప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గతేడాది రంజీ సీజన్‌తో అతడు ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. విప్రజ్ బ్యాటింగ్‌లో కంటే బౌలింగ్‌లో ఎక్కువగా అద్భుతాలు చేశాడు. 3 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో 13 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. సయ్యద్ ముష్తాక్ అలీ 2024-25 ట్రోఫీలోనూ విప్రాజ్ నిగమ్ అదరగొట్టాడు. ఈ టోర్నీలో అతడు ఏడు మ్యాచ్‌ల్లో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. ఆంధ్రప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం ఎనిమిది బంతుల్లో 27 పరుగులు పరుగులు చేసి యూపీకి సంచలన విజయాన్ని అందించాడు.దీంతో ఒక్కసారిగా అతడు వెలుగులోకి వచ్చాడు. యూపీటీ20 2024 సీజన్లో కూడా విప్రాజ్ దుమ్ములేపాడు. ఈ టోర్నీలో యూపీ ఫాల్కన్స్ తరఫున 12 మ్యాచ్‌లు ఆడిన ఈ స్పిన్నర్ 20 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఐపీఎల్ 2025 వేలంలో విప్రాజ్ నిగమ్‌ను రూ.50లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇంట్రా-స్క్వాడ్ ప్రాక్టీస్ గేమ్‌లో నిగమ్ తన బ్యాటింగ్ స్కిల్స్‌ను ప్రదర్శించాడు. 29 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. ఈ ఏడాది సీజన్లో ఢిల్లీకి మంచి ఆల్‌రౌండర్ దొరికినట్లే.ఐపీఎల్-2025: లక్నో వర్సెస్ ఢిల్లీ స్కోర్లు👉లక్నో- 209/8 (20)👉ఢిల్లీ- 211/9 (16.2)👉ఫలితం- ఒక్క వికెట్ తేడాతో లక్నోపై ఢిల్లీ గెలుపుచదవండి: అస్సలు జీర్ణించుకోలేకపోయా.. అయినా భాయ్‌కు అంతా తెలుసు: సిరాజ్