source: X
భారత క్రికెట్‌కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. టీమిండియా వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇందుకు చహల్ తాజాగా సోషల్‌మీడియాలో చేసిన ఓ పోస్ట్ కారణం.
The Last Dance 🤙 pic.twitter.com/Z27l4tZQQf
— Yuzvendra Chahal (@yuzi_chahal) September 23, 2026
లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానం నుంచి సెప్టెంబర్ 23న కొన్ని ఫొటోలను షేర్ చేసిన చహల్.. వాటికి 'ది లాస్ట్ డ్యాన్స్' (ఆఖరి రాగం) అనే క్యాప్షన్ జోడించాడు. దీంతో చహల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకబోతున్నాడంటూ అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.
అయితే, ఈ విషయమై చహల్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అతడి పోస్ట్ వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్నది కూడా స్పష్టం కాలేదు.
అయితే చహల్ చేసిన 'ది లాస్ట్ డ్యాన్స్' పోస్ట్‌పై మాత్రం అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడని అనుమానం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు కౌంటీ క్రికెట్ నుంచి మాత్రమే తప్పుకోబోతున్నాడని అనుకుంటున్నారు.
చహల్ ప్రస్తుతం నార్తాంప్టన్‌షైర్ తరఫున కౌంటీ క్రికెట్ ఆడుతున్నాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్ సీజన్ ముగింపు దశకు చేరుకోవడంతో చహల్ ఈ పోస్ట్ చేసి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, చహల్ టీమిండియా తరఫున చివరిసారిగా 2023 జనవరి 24న న్యూజిలాండ్‌తో వన్డే మ్యాచ్ ఆడాడు. అదే ఏడాది ఆగస్టు 13న వెస్టిండీస్‌తో టీ20 మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి చహల్ వివిధ వేదికలపై రాణిస్తున్నా టీమిండియాలో చోటు దక్కడం లేదు.
ప్రస్తుతం టీమిండియాలో స్పిన్నర్ల బెర్త్‌ల కోసం తీవ్రమైన పోటీ ఉంది. ఒక్కో బెర్త్ కోసం పదుల సంఖ్యలో పోటీపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో 35 ఏళ్ల చహల్ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రికార్డు బ్రేకింగ్ ప్రదర్శన


