ఆసీస్‌పై కుషాగ్ర సెంచ‌రీ.. ఇండియా-ఏ 334 ఆలౌట్‌ | Kushagra-Ton-Tanush-Fifty-India-A 334-All-Out Vs AUS-A 1st Unofficial Test | Sakshi
Sakshi News home page

ఆసీస్‌పై కుషాగ్ర సెంచ‌రీ.. ఇండియా-ఏ 334 ఆలౌట్‌

Sep 23 2026 12:05 PM | Updated on Sep 23 2026 12:16 PM

Kushagra-Ton-Tanush-Fifty-India-A 334-All-Out Vs AUS-A 1st Unofficial Test

Photo Credit: Twitter

పుదుచ్చేరి వేదిక‌గా ఆస్ట్రేలియా-ఎతో జ‌రుగుతున్న అన‌ధికారిక టెస్టులో ఇండియా-ఎ జ‌ట్టు తొలి ఇన్నింగ్స్‌లో 334 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఇండియా-ఎ బ్యాట‌ర్ల‌లో కుమార్ కుషాగ్ర (240 బంతుల్లో 113) సెంచ‌రీతో క‌దం తొక్క‌గా, త‌నుశ్ కొటియ‌న్ (69), సాయి సుద‌ర్శ‌న్ (57) అర్థ‌సెంచ‌రీలు సాధించారు. 

ఆస్ట్రేలియా-ఎ బౌల‌ర్ల‌లో కోరీ రోచిచియోలి 4 వికెట్లు తీయ‌గా, టాడ్ ముర్ఫీ 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. కాగా 97 ప‌రుగుల‌కే ఐదు కీల‌క వికెట్లు కోల్పోయిన ద‌శ‌లో క్రీజులోకి వ‌చ్చిన త‌నుశ్ కొటియ‌న్, కుమార్ కుషాగ్ర‌లు ఆరో వికెట్‌కు 138 ప‌రుగులు జోడించ‌డంతో ఇండియా-ఎ ఇన్నింగ్స్ కుదుటప‌డింది. 

ఈ ఇద్ద‌రు ఆచితూచి ఆడుతూనే వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా బంతుల‌ను బౌండ‌రీల‌కు త‌ర‌లించ‌డంతో భార‌త్ స్కోరుబోర్డు ప‌రుగులు పెట్టింది. అర్థ‌సెంచ‌రీ చేసిన త‌ర్వాత త‌నుశ్ వెనుదిరిగిన‌ప్ప‌టికీ, కుమార్ కుషాగ్ర టెయిలెండ‌ర్ల‌తో క‌లిసి ఇన్నింగ్స్‌ను ముందుకు న‌డిపించాడు. చివ‌ర్లో అన్షుల్ కంబోజ్ (23) ఆక‌ట్టుకోవ‌డంతో ఇండియా-ఎ జ‌ట్టు 300 ప‌రుగుల మార్క్‌ను దాటగ‌లిగింది.

ఇదీ చదవండి: క్రికెట్‌ చరిత్రలో వింత ఘటన.. ఆసీస్‌ బ్యాటర్‌కు చేదు అనుభవం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement