షూటింగ్‌లో మరొకటి.. 25కు చేరిన భారత్‌ పతకాల సంఖ్య | Asian Games 2026: India win silver in the Womens 50m Rifle 3 Positions Team event | Sakshi
Sakshi News home page

Asian Games 2026: షూటింగ్‌లో మరొకటి.. 25కు చేరిన భారత్‌ పతకాల సంఖ్య

Sep 26 2026 8:40 AM | Updated on Sep 26 2026 8:40 AM

Asian Games 2026: India win silver in the Womens 50m Rifle 3 Positions Team event

source: X

ఏషియన్‌ గేమ్స్‌ 2026లో ఏడో రోజు భారత్‌కు శుభారంభం లభించింది. ఒకే రోజు రెండు ఖాతాలో రజత పతకాలు చేరాయి. తొలుత పురుషుల మారథాన్‌లో సావన్‌ బర్వాల్‌ రజతం సాధించగా.. ఆతర్వాత మహిళల షూటింగ్‌ జట్టు కూడా సిల్వర్‌ మెడల్‌ గెలుచుకుంది.

మారథాన్‌లో సావన్‌ బర్వాల్‌ చరిత్ర
పురుషుల మారథాన్‌లో సావన్‌ బర్వాల్‌ వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్‌ 2:11:37తో రజత పతకం సాధించాడు. దీంతో ఏషియన్‌ గేమ్స్‌ పురుషుల మారథాన్‌లో భారత్‌కు 44 ఏళ్ల తర్వాత పతకం లభించింది.

షూటింగ్‌లో మహిళల జట్టుకు రజతం
మహిళల 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌ టీమ్‌ ఈవెంట్‌లో తిలోత్తమ సేన్‌, విదర్సా వినోద్‌, ఆశి చౌక్సేతో కూడిన భారత జట్టు రజత పతకం సాధించింది. ఇదే ఈవెంట్‌లో తిలోత్తమ సేన్‌, విదర్సా వినోద్‌ వ్యక్తిగత ఫైనల్‌కు కూడా అర్హత సాధించారు.

25కు చేరిన భారత్‌ పతకాల సంఖ్య
ఏడో రోజు రెండు రజతాలు రావడంతో ప్రస్తుత ఏషియన్‌ గేమ్స్‌లో భారత్‌ పతకాల సంఖ్య 25కు చేరింది.

ఇదీ చదవండి: భారత ఫుట్‌బాల్‌ జట్టు అద్భుత ప్రదర్శన


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement