దుమ్మురేపిన యశ్‌.. ఆస్ట్రేలియాపై భారత్‌ ఘన విజయం | Yashbardhan All-Round Show-India-U19 Beat Aus-U19-2nd Unofficial ODI | Sakshi
Sakshi News home page

IND U-19 Vs AUS U-19: దుమ్మురేపిన యశ్‌.. ఆస్ట్రేలియాపై భారత్‌ ఘన విజయం

Sep 21 2026 4:34 PM | Updated on Sep 21 2026 4:54 PM

Yashbardhan All-Round Show-India-U19 Beat Aus-U19-2nd Unofficial ODI

Photo Credit: Twitter

రాజ్‌కోట్‌ వేదికగా సోమవారం ఆస్ట్రేలియా అండర్‌-19 జట్టుతో జరిగిన అనధికారిక వన్డేలో భారత అండర్‌-19 జట్టు 103 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 342 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు 41.1 ఓవ‌ర్ల‌లో 238 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ జాక్‌ జోస్నెక్‌ (81), బ్లేక్‌ కాటిల్‌ (44), జెడ్‌ హొలిక్‌ (33) పర్వాలేదనిపించారు. 

భారత బౌలర్లలో చిగురుపాటి వెంకట 3 వికెట్లు తీయగా, కావ్యా పటేల్‌, యశ్‌బర్ధన్‌ చౌహాన్‌లు చెరో 2 వికెట్లు పడగొట్టారు. అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత అండర్‌-19 జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 341 పరుగుల భారీ స్కోరు చేసింది. యశ్‌బర్దన్‌ చౌహాన్‌ (122) సెంచరీతో చెలరేగగా.. వినీత్‌ (87), ఆర్యవీర్‌ (47) రాణించారు.

ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో థామ‌స్ వాసో 3 వికెట్లు తీయ‌గా, పాట్రిక్ సుల్లివ‌న్ 2 వికెట్లు ప‌డ‌గొట్టాడు. సెంచరీ సహా రెండు వికెట్లతో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచిన యశ్‌బర్ధన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు సొంతం చేసుకున్నాడు. కాగా మూడు మ్యాచ్‌ల అన‌ధికారిక వ‌న్డే సిరీస్‌లో భాగంగా ఇప్ప‌టికే తొలి రెండు వ‌న్డేల్లో గెలిచిన భార‌త్ మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే సిరీస్‌ను 2-0తో కైవ‌సం చేసుకుంది. ఇరుజ‌ట్ల మ‌ధ్య మూడో వ‌న్డే మ్యాచ్ ఇదే స్టేడియం వేదిక‌గా బుధ‌వారం జ‌ర‌గ‌నుంది. 

ఇదీ చదవండి: జపాన్‌ చేరుకున్న టీమిండియా; ఆతిథ్యంపై శ్రేయస్‌ ఏమన్నాడంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement