PC: CA Twitter
దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ కోసం ఎంపిక చేసిన ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. సీనియర్ ఫాస్ట్ బౌలర్ బిల్లీ స్టాన్లేక్ పక్కటెముకల కండరాల గాయం కారణంగా ప్రోటీస్ సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో అతడి స్దానాన్ని ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్‌తో క్రికెట్ ఆస్ట్రేలియా భర్తీ చేసింది.
ఈ ఆల్‌రౌండర్ ప్రస్తుతం ఇండియా-ఎతో అనాధికారిక వన్డే సిరీస్‌కు సన్నద్దమవుతున్నాడు. ఇప్పటికే ఎంపిక చేసిన ఆస్ట్రేలియా-ఎ జట్టులో అతడు సభ్యునిగా ఉన్నాడు. ఇప్పుడు జాతీయ జట్టు నుంచి పిలుపు రావడంతో సౌతాఫ్రికాకు పయనం కానున్నాడు.
కాగా ఎడ్వర్డ్స్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. మీడియం పేస్ బౌలింగ్‌తో పాటు లోయార్డర్‌లో దూకుడుగా ఆడడం అతడి ప్రత్యేకత. అతడు ఇంకా వన్డేల్లో అరంగేట్రం చేయలేదు. సౌతాఫ్రికాతో జరిగే తొలి వన్డేలో ఎడ్వర్డ్స్ డెబ్యూ చేసే ఛాన్స్ ఉంది.
మరోవైపు జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో భాగమైన పేసర్ స్పెన్సర్ జాన్సన్‌ను ప్రోటీస్ సిరీస్‌కు ముందు జట్టు నుంచి రిలీజ్ చేశారు. అతడు వచ్చే నెలలో ఇండియా-ఎతో జరగనున్న వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా-ఎ జట్టులో చేరనున్నాడు. 18 నెలల విరామం తర్వాత వన్డే క్రికెట్‌లోకి తిరిగి వచ్చిన జాన్సన్.. ఆదివారం జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో ఆసీస్ విజయం సాధించడంలో అతడు కీలక పాత్ర పోషించాడు.
అతడు బౌలింగ్‌లో రెండు వికెట్లు పడగొట్టి.. బ్యాటింగ్‌లో చివరి వికెట్‌కు 27 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇక జింబాబ్వేతో వన్డేలకు దూరమైన సీనియర్ ప్లేయర్లు పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్‌లు డర్బన్‌లో ఆస్ట్రేలియా జట్టుతో కలవనున్నారు. ఈ మూడు వన్డేల సిరీస్ సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానుంది.
ఆస్ట్రేలియా వన్డే జట్టు: మిచెల్ మార్ష్, పాట్ కమిన్స్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ క్యారీ, కూపర్ కానలీ, జోయెల్ డేవిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, జాక్ ఎడ్వర్డ్స్, ఆలివర్ పీక్, మాథ్యూ రెన్‌షా, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా
చదవండి: టీమిండియా వైపు దూసుకొస్తున్న యువ సంచలనం.. ఎవరీ యశ్?


