IND vs JPN T20I: జట్లు, టైమింగ్‌, ప్రత్యక్ష ప్రసారం.. వివరాలు ఇవే | India Vs Japan Only T20I Date, Time, Venue, Squads Live Streaming Details | Sakshi
Sakshi News home page

IND vs JPN: ఏకైక టీ20.. జట్లు, టైమింగ్‌, ప్రత్యక్ష ప్రసారం.. వివరాలు ఇవే

Sep 21 2026 2:10 PM | Updated on Sep 21 2026 2:24 PM

India Vs Japan Only T20I Date, Time, Venue, Squads Live Streaming Details

PC: JCA X

ఆసియా క్రీడలు-2026 టోర్నమెంట్‌ ఆరంభానికి ముందు టీమిండియా జపాన్‌తో ఏకైక టీ20 మ్యాచ్‌కు సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య మంగళవారం (సెప్టెంబరు 22) జరిగే ఈ మ్యాచ్‌కు సనో అంతర్జాతీయ క్రికెట్‌ మైదానం వేదిక. కాగా భారత్‌- జపాన్‌ అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లో తలపడటం ఇదే మొదటిసారి కావడం విశేషం.

క్రీడల అభివృద్ధికి సహకారాన్ని ఆశిస్తూ
భారత్‌- జపాన్‌ మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఇరుదేశాల పురుష క్రికెట్‌ జట్ల మధ్య ఈ మేరకు ఏకైక టీ20 మ్యాచ్‌ నిర్వహణకు సన్నాహకాలు చేశారు. ‘స్పోర్ట్‌-75’ పేరుతో రూపొందుతున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఇరుదేశాల మధ్య క్రీడల అభివృద్ధికి సహకారాన్ని ఆశిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇక జపాన్‌తో జరిగే ఏకైక టీ20కి శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే సిద్ధమైంది. మరోవైపు జపాన్‌ సైతం ప్రపంచ చాంపియన్‌ టీమిండియాతో పోటీ పడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరి ఈ మ్యాచ్‌కు సంబంధించిన జట్లు, ఆరంభ సమయం, ప్రత్యక్ష ప్రసారం తదితర వివరాలు తెలుసుకుందామా?!

టీమిండియా వర్సెస్‌ జపాన్‌.. ఏకైక టీ20 మ్యాచ్‌
వేదిక: సనో అంతర్జాతీయ క్రికెట్‌ మైదానం
టైమింగ్‌
భారత కాలమానం ప్రకారం మంగళవారం (సెప్టెంబరు 22) ఉదయం 9.30 నిమిషాలకు మ్యాచ్‌ ఆరంభం

ఎక్కడ చూడాలంటే..
స్టార్‌ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ (టీవీ), ఫ్యాన్‌కోడ్‌ యాప్‌, వెబ్‌సైట్‌ (డిజిటల్‌).

జట్లు ఇవే
భారత్‌
శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), శివం దూబే, తిలక్‌ వర్మ (వైస్‌ కెప్టెన్‌), అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రవి బిష్ణోయి, రవి బిష్ణోయి, జస్‌ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌, వైభవ్‌ సూర్యవంశీ, యశ్‌ ఠాకూర్‌, విప్రాజ్‌ నిగమ్‌.

జపాన్‌
కెండెల్‌ కడోవాకీ ఫ్లెమింగ్‌ (కెప్టెన్‌), చార్లీ హరా హింజే, బెంజమిన్‌ ఇటో-డేవిస్‌, కొయి కుబోటా, వటారు మియాచి, రియో సకురనో-థామస్‌, అలెక్స్‌ శిరాయి-పాట్‌మోర్‌, షోమా సుగయా-స్లేటర్‌, డెక్లాన్‌ సుజుకి, ఇబ్రహీం తకహషి, మకొటో తానియమా, లచ్లాన్‌ యమామొటో, అలెస్టెర్‌ కడోవాకీ-ఫ్లెమింగ్‌, జేక్‌ కుసుడ-నైర్‌, సుయోషి తకడా.

చదవండి: ఆసీస్‌పై వీరేందర్‌ సెహ్వాగ్‌ కుమారుడు ఆర్యవీర్‌ విధ్వంసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement