Asian Games 2026: పాకిస్తాన్‌కు భారీ షాక్‌ | Pakistans Key Player Ruled Out Of Asian Games 2026 | Sakshi
Sakshi News home page

Asian Games 2026: పాకిస్తాన్‌కు భారీ షాక్‌

Sep 21 2026 12:43 PM | Updated on Sep 21 2026 12:58 PM

Pakistans Key Player Ruled Out Of Asian Games 2026

PC: Pak cricket

ఏషియన్ గేమ్స్‌-2026 మెన్స్‌ క్రికెట్ పోటీల ఆరంభానికి ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ సల్మాన్ మీర్జా గాయం కారణంగా ఈ టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. 32 ఏళ్ల సల్మాన్ ప్రస్తుతం చేతి వేలి గాయంతో బాధపడుతున్నాడు.

అతడు కోలుకోవడానికి మూడు నుంచి నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆసియా గేమ్స్ స్క్వాడ్ నుంచి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తప్పించింది. అతడి స్దానాన్ని పేసర్ మహ్మద్ వసీం జూనియర్‌తో పీసీబీ భర్తీ చేసింది. సల్మాన్ మీర్జా ఏషియన్ గేమ్స్‌కు దూరం కావడంతో పాక్‌కు గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పాలి. 

అతడు గత కొంత కాలంగా పాక్ టీ20 జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. పవర్‌ప్లేతో పాటు డెత్ ఓవర్లలో పరుగులు కట్టడి చేయడం అతడి స్పెషాలిటి. ఇప్పటివరకు పాక్ తరపున 17 టీ20లు ఆడిన సల్మాన్‌..  6.43 ఎకానమీ రేటుతో 23 వికెట్లు పడగొట్టాడు. 

ఓవరాల్‌గా మీర్జా 49 T20 మ్యాచ్‌లలో 68 వికెట్లు తీశాడు. ఇక అతడి స్ధానంలో జట్టులోకి వచ్చిన వసీం కూడా టీ20ల్లో ఫర్వాలేదనిపించాడు. పాక్ తరపున 34 టీ20లు ఆడి 42 వికెట్లు పడగొట్టాడు. అయితే లోయార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి మెరుపులు మెరిపించే సత్తా అతడికి ఉంది. ఈ ఏషియన్ గేమ్స్‌లో పాక్ జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది.

పాక్ జ‌ట్టు
సాహిబ్జాదా ఫర్హాన్ (కెప్టెన్‌), అబ్దుల్ సమద్ (వైస్ కెప్టెన్‌), అబ్రార్ అహ్మద్, అహ్మద్ డానియాల్, అకిఫ్ జావేద్, అలీ రజా, అరాఫత్ మిన్హాస్, హైదర్ అలీ, హసన్ నవాజ్, మాజ్ సదాకత్, వసీం జూనియర్, సాద్ మసూద్, సైమ్ అయూబ్, సుఫ్యాన్ మొకిమ్, ఉస్మాన్ ఖాన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement