Asian Games 2026: పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్‌ | Asian Games 2026: Indian Women's Table Tennis Team Blanks Pakistan, Reaches Quarterfinals | Sakshi
Sakshi News home page

Asian Games 2026: పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్‌

Sep 21 2026 8:34 AM | Updated on Sep 21 2026 8:43 AM

Asian Games 2026: Indian Women's Table Tennis Team Blanks Pakistan, Reaches Quarterfinals

source: X

ఆసియా క్రీడల్లో భారత మహిళల టేబుల్‌ టెన్నిస్‌ జట్టు సత్తా చాటింది. గ్రూప్‌-ఎఫ్‌ రెండో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను 3-0తో చిత్తు చేసింది. వరుసగా రెండు విజయాలతో క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. ఆదివారం సింగపూర్‌పై హోరాహోరీ పోరులో 3-2తో గెలిచిన భారత్‌.. తాజాగా పాక్‌పై ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది.

పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత్‌ తమ బెంచ్‌ బలాన్ని పరీక్షించుకుంది. స్టార్‌ ప్లేయర్లు దియా చితాలే, యశస్విని ఘోర్పడేలకు విశ్రాంతినిచ్చి సుతీర్థ ముఖర్జీ, సిండ్రెలా దాస్‌లకు అవకాశం కల్పించింది.

తొలి మ్యాచ్‌లో సుతీర్థ ముఖర్జీ 11-3, 11-3, 11-4తో అలీనా ఖాన్‌ను చిత్తు చేసి భారత్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించింది. రెండో మ్యాచ్‌లో సిండ్రెలా దాస్‌ 11-6, 11-7, 11-5తో కల్సూమ్‌ ఖాన్‌పై విజయం సాధించింది. దీంతో భారత్‌ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

ఇక మూడో మ్యాచ్‌లో ఆకుల శ్రీజ 11-4, 11-4, 11-5తో ఫాతిమా ఖాన్‌ను ఓడించి భారత విజయాన్ని ఖరారు చేసింది. దీంతో భారత్‌ 3-0తో పాక్‌ను ఓడించి క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది.

సింగపూర్‌పై ఉత్కంఠ విజయం
ఆదివారం సింగపూర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత ప్లేయర్లు అద్భుతంగా పోరాడారు. ఒక దశలో 1-2తో వెనుకబడిన భారత్‌.. ఓటమి అంచు నుంచి తిరిగి వచ్చింది. ఆకుల శ్రీజ, యశస్విని ఘోర్పడే కీలక మ్యాచ్‌ల్లో విజయాలు సాధించడంతో భారత్‌ 3-2తో గెలుపొందింది.

ఇదీ చదవండి: ఏషియన్‌ గేమ్స్‌లో భారత్‌కు మూడో పతకం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement