source: X
టీమిండియా మాజీ పేసర్ లక్ష్మీపతి బాలాజీకి కీలక బాధ్యతలు దక్కాయని తెలుస్తోంది. ఆస్ట్రేలియా-ఏతో జరగనున్న సిరీస్ కోసం ఆయనను ఇండియా-ఏ జట్టు హెడ్ కోచ్‌గా నియమించినట్లు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది.
సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 11 వరకు పుదుచ్చేరిలో జరిగే ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్‌లో రెండు అనధికారిక టెస్టులు, మూడు వన్డేలు ఉన్నాయి. బాలాజీ దేశానికి ప్రాతినిథ్యం వహించే జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి అవుతుంది.
2017 ఐపీఎల్ సీజన్‌లో అతడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు. 2018 నుంచి 2022 వరకు చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్‌గా సేవలందించాడు.
బాలాజీ భారత్ తరఫున 2002-2012 మధ్యలో 8 టెస్ట్‌లు, 30 వన్డేలు, 5 టీ20 ఆడి 71 వికెట్లు తీశాడు. అతడికి ఐపీఎల్‌లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. 73 మ్యాచ్‌ల్లో 76 వికెట్లు పడగొట్టి, రెండు సార్లు ఛాంపియన్ జట్లలో భాగస్వామిగా ఉన్నాడు. 2010లో చెన్నై సూపర్ కింగ్స్ , 2012లో కోల్‌కతా నైట్‌రైడర్స్ టైటిళ్లు సాధించిన జట్లలో సభ్యుడిగా ఉన్నాడు.
ఆసీస్-ఏతో సిరీస్ విషయానికొస్తే.. ఈ సిరీస్‌లో మల్టీ డే మ్యాచ్‌లకు దేవదత్ పడిక్కల్, వన్డేలకు రుతురాజ్ గైక్వాడ్ భారత జట్ల కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. మల్టీ డే మ్యాచ్‌లకు ఎంపిక చేసిన జట్టులో సాయి సుదర్శన్, అన్షుల్ కంబోజ్, తనుష్ కోటియన్, ఎన్ జగదీశన్, విజయ్ కుమార్ వైశాక్ లాంటి గుర్తింపు పొందిన ఆటగాళ్లు ఉన్నారు.
వన్డే జట్టులో కెప్టెన్ రుతురాజ్‌తో పాటు పడిక్కల్, ప్రియాంశ్ ఆర్య, సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, హార్దిక్ పాండ్యా లాంటి సార్లు ఉన్నారు.
ఇదీ చదవండి: టీమిండియా క్రికెటర్ సంచలన నిర్ణయం.. 18 ఏళ్ల తర్వాత వేరే జట్టుకు?


