తొలి స్వర్ణం జపాన్‌దే...  | Takumi Hojo wins mens triathlon as Japan take first gold at Asian Games 2026 | Sakshi
Sakshi News home page

తొలి స్వర్ణం జపాన్‌దే... 

Sep 21 2026 6:23 AM | Updated on Sep 21 2026 6:23 AM

Takumi Hojo wins mens triathlon as Japan take first gold at Asian Games 2026

ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణ పతకం ఆతిథ్య జపాన్‌కే లభించింది. మూడు క్రీడాంశాల సమాహారమైన పురుషుల ట్రయాథ్లాన్‌ (స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్‌)లో జపాన్‌ ట్రయాథ్లెట్‌ టకుమి హోజో పసిడి పతకం సాధించాడు. టకుమి హోజో (750 మీటర్లు స్విమ్మింగ్, 20 కిలోమీటర్ల సైక్లింగ్, 5 కిలోమీటర్ల రన్నింగ్‌) మూడు ఈవెంట్స్‌ను 
52 నిమిషాల 56 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. బంగారు పతకం సాధించిన టకుమి హోజో 2028 లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌ బెర్త్‌ను కూడా సంపాదించాడు. జిరుయ్‌ జాంగ్‌ (చైనా; 53ని:05 సెకన్లు) రజతం, అర్లాన్‌  (కజకిస్తాన్‌; 53ని:11 సెకన్లు) కాంస్యం సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement