త్రుటిలో పతకాలు చేజారె...  | India teqball campaign at the Asian Games 2026 ended without a medal | Sakshi
Sakshi News home page

త్రుటిలో పతకాలు చేజారె... 

Sep 21 2026 6:12 AM | Updated on Sep 21 2026 6:12 AM

India teqball campaign at the Asian Games 2026 ended without a medal

నగోయా: ఆసియా క్రీడల్లో తొలిసారి నిర్వహిస్తున్న టెక్‌బాల్‌ క్రీడాంశంలో ఒకేరోజు భారత్‌కు రెండు కాంస్య పతకాలు త్రుటిలో చేజారాయి. మహిళల వ్యక్తిగత కాంస్య పతక మ్యాచ్‌లో భారత ప్లేయర్‌ క్విమ్సీ డిసౌజా 11–12, 11–12తో యునా సాకామోటో (జపాన్‌) చేతిలో ఓడిపోయింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ కాంస్య పతక మ్యాచ్‌లో క్విమ్సీ డిసౌజా–అనస్‌ బేగ్‌ (భారత్‌) జోడీ 9–12, 6–12తో హోంగ్‌ మిన్‌ టాన్‌ నుగుయెన్‌–గియా ట్రిన్‌ (వియత్నాం) జంట చేతిలో పరాజయం పాలైంది. 

భారత టీటీ జట్లకు మిశ్రమ ఫలితాలు
టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) టీమ్‌ ఈవెంట్‌లో భారత మహిళల జట్టు తొలి మ్యాచ్‌లో 3–0తో ఇండోనేసియాపై, రెండో మ్యాచ్‌లో 3–2తో సింగపూర్‌పై గెలిచింది. ఇండోనేసియాతో జరిగిన గ్రూప్‌ ‘ఎఫ్‌’ తొలి లీగ్‌ మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 3–0తో గెలిచి...ఇరాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 0–3తో ఓటమి చవిచూసింది.    

వుషులో నిరాశ: మార్షల్‌ ఆర్ట్స్‌లో భాగమైన వుషు క్రీడాంశంలో భారత్‌కు నిరాశ ఎదురైంది. పురుషుల చాంగ్‌క్వాన్‌ ఈవెంట్‌లో భారత ప్లేయర్‌ సూరజ్‌ సింగ్‌ 11వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. సాండా ఈవెంట్‌లో భారత ప్లేయర్లు అపర్ణ దహియా (52 కేజీలు)... విక్రాంత్‌ (75 కేజీలు) ప్రిక్వార్టర్‌ ఫైనల్లో వెనుదిరిగారు.   

స్విమ్మర్‌ రిషభ్‌కు ఆరో స్థానం 
పురుషుల స్విమ్మింగ్‌లో తొలిరోజు భారత్‌ ఆశించిన ఫలితం లభించలేదు. 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో భారత స్విమ్మర్‌ రిషభ్‌ దాస్‌ ఫైనల్‌ చేరినా పతకానికి సుదూరంలో నిలిచాడు. ఫైనల్లో రిషభ్‌ 54.77 సెకన్లలో గమ్యానికి చేరి ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement