breaking news
Teqball
-
త్రుటిలో పతకాలు చేజారె...
నగోయా: ఆసియా క్రీడల్లో తొలిసారి నిర్వహిస్తున్న టెక్బాల్ క్రీడాంశంలో ఒకేరోజు భారత్‌కు రెండు కాంస్య పతకాలు త్రుటిలో చేజారాయి. మహిళల వ్యక్తిగత కాంస్య పతక మ్యాచ్‌లో భారత ప్లేయర్ క్విమ్సీ డిసౌజా 11–12, 11–12తో యునా సాకామోటో (జపాన్) చేతిలో ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్ కాంస్య పతక మ్యాచ్‌లో క్విమ్సీ డిసౌజా–అనస్ బేగ్ (భారత్) జోడీ 9–12, 6–12తో హోంగ్ మిన్ టాన్ నుగుయెన్–గియా ట్రిన్ (వియత్నాం) జంట చేతిలో పరాజయం పాలైంది. భారత టీటీ జట్లకు మిశ్రమ ఫలితాలుటేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ ఈవెంట్లో భారత మహిళల జట్టు తొలి మ్యాచ్‌లో 3–0తో ఇండోనేసియాపై, రెండో మ్యాచ్‌లో 3–2తో సింగపూర్‌పై గెలిచింది. ఇండోనేసియాతో జరిగిన గ్రూప్ ‘ఎఫ్’ తొలి లీగ్ మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 3–0తో గెలిచి...ఇరాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 0–3తో ఓటమి చవిచూసింది. వుషులో నిరాశ: మార్షల్ ఆర్ట్స్‌లో భాగమైన వుషు క్రీడాంశంలో భారత్‌కు నిరాశ ఎదురైంది. పురుషుల చాంగ్‌క్వాన్ ఈవెంట్లో భారత ప్లేయర్ సూరజ్ సింగ్ 11వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. సాండా ఈవెంట్లో భారత ప్లేయర్లు అపర్ణ దహియా (52 కేజీలు)... విక్రాంత్ (75 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగారు. స్విమ్మర్ రిషభ్‌కు ఆరో స్థానం పురుషుల స్విమ్మింగ్‌లో తొలిరోజు భారత్ ఆశించిన ఫలితం లభించలేదు. 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో భారత స్విమ్మర్ రిషభ్ దాస్ ఫైనల్ చేరినా పతకానికి సుదూరంలో నిలిచాడు. ఫైనల్లో రిషభ్ 54.77 సెకన్లలో గమ్యానికి చేరి ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. -
టెక్బాల్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు తొలి పతకం
టెక్బాల్ వరల్డ్ ఛాంపియన్షిప్స్-2024లో భారత్‌కు తొలి పతకం లభించింది. పురుషుల డబుల్స్ విభాగంలో అనాస్ బేగ్, డెక్లన్ గొంజాల్వెస్ జోడీ కాంస్య పతకం కైవసం చేసుకుంది. టెక్బాల్ క్రీడలోకి ఇటీవలే ప్రవేశించిన బేగ్-గొంజాల్వెస్ జోడీ అంచనాలకు మించి రాణించి అభిమానులను ఆకట్టుకుంది. తృటిలో స్వర్ణం రేసు నుంచి తప్పుకున్న భారత జోడీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. బేగ్-గొంజాల్వెస్ జోడీ సెమీఫైనల్లో పటిష్టమైన థాయ్‌లాండ్ జోడీ చేతిలో ఓటమిపాలైంది. టెక్బాల్లో పతకం సాధించిన 11వ దేశంగా భారత్ రికార్డుల్లోకెక్కింది.On our photo of the day none other than team India! The duo who achieved a historical bronze medal!•#Teqball #WTCH24 #WorldChampionships #Vietnam pic.twitter.com/AGzzVv8sRI— TEQBALL (@Teqball) December 8, 2024టెక్బాల్ అంటే.. టెక్బాల్ అనేది సెపక్ తక్రా మరియు టేబుల్ టెన్నిస్ అంశాలతో కూడిన క్రీడ. ఈ క్రీడను కర్వ్డ్ (వంగిన) టేబుల్‌పై ఆడతారు. ఈ క్రీడలో ఆటగాళ్ళు చేతులు మినహా మిగతా అన్ని శరీర భాగాలను వాడతారు. ఈ క్రీడలో ఫుట్‌బాల్ తరహా బంతిని వాడతారు. టెక్‌బాల్‌ను సింగిల్స్ లేదా డబుల్స్ గేమ్‌గా ఆడవచ్చు. ఈ క్రీడ 2014లో పరిచయం చేయబడింది. ఈ క్రీడ అంతర్జాతీయ టెక్బాల్ ఫెడరేషన్ (FITEQ) ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించబడుతుంది. ప్రపంచ స్థాయి ఫుట్‌బాల్ ఆటగాళ్లు ఈ క్రీడ పట్ల ఆకర్షితులవుతున్నారు.


