భారత్‌తో సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు బిగ్‌ షాక్‌ | Ravindra dislocates shoulder during shoot, doubtful for India T20Is | Sakshi
Sakshi News home page

భారత్‌తో సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు బిగ్‌ షాక్‌

Sep 19 2026 10:07 AM | Updated on Sep 19 2026 10:07 AM

Ravindra dislocates shoulder during shoot, doubtful for India T20Is

source: X

త్వరలో భారత్‌తో జరుగబోయే టీ20 సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌ జట్టుకు భారీ షాక్‌ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర గాయంతో ఈ సిరీస్‌కు దూరమయ్యే ప్రమాదం ఏర్పడింది. ఆక్లాండ్‌లో సెప్టెంబర్ 16న స్కై సంస్థ నిర్వహించిన ప్రమోషనల్ షూట్‌లో డైవింగ్ క్యాచ్ అందుకునే ప్రయత్నంలో రచిన్‌ కుడి భుజం డిస్‌లోకేషన్‌కు గురైంది. 

దీంతో అక్టోబర్ 22 నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అతడు ఆడట​ం అనుమానంగా మారింది. ఈ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టును వచ్చే వారం ప్రకటించనున్నారు. కాగా, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో పాటు ఐదు వన్డేలు, 2 టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ కోసం అక్టోబర్‌ 22 నుంచి భారత జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించనుంది.

షెడ్యూల్‌
అక్టోబర్ 22, 2026    తొలి టీ20    క్రైస్ట్‌చర్చ్    మధ్యాహ్నం 12:30 (భారతకాలమానం ప్రకారం)
అక్టోబర్ 24, 2026    రెండో టీ20    క్రైస్ట్‌చర్చ్    మధ్యాహ్నం 12:30
అక్టోబర్ 27, 2026 మూడో టీ20    వెల్లింగ్టన్    మధ్యాహ్నం 12:30
అక్టోబర్ 30, 2026    నాలుగో టీ20    ఆక్లాండ్    మధ్యాహ్నం 12:30
నవంబర్ 1, 2026    ఐదో టీ20    హామిల్టన్    మధ్యాహ్నం 12:30
నవంబర్ 4, 2026    తొలి వన్డే    ఆక్లాండ్    ఉదయం 6:30
నవంబర్ 7, 2026    రెండో వన్డే    వెల్లింగ్టన్    ఉదయం 6:30
నవంబర్ 10, 2026 మూడో వన్డే    హామిల్టన్    ఉదయం 6:30
నవంబర్ 13, 2026 నాలుగో వన్డే    టౌరంగ    ఉదయం 6:30
నవంబర్ 15, 2026 ఐదో వన్డే    టౌరంగ    ఉదయం 6:30
నవంబర్ 19–23, 2026    తొలి టెస్టు    వెల్లింగ్టన్    ఉదయం 3:30
నవంబర్ 27–డిసెంబర్ 1, 2026    రెండో టెస్టు    క్రైస్ట్‌చర్చ్    ఉదయం 3:30

ఇదీ చదవండి: పాక్‌ ప్లేయర్‌ హ్యాట్రిక్‌


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement