పాక్‌ ప్లేయర్‌ హ్యాట్రిక్‌ | Shadab Khan Hat-Trick Powers Antigua And Barbuda Falcons Into CPL 2026 Final After Dominant Win | Sakshi
Sakshi News home page

పాక్‌ ప్లేయర్‌ హ్యాట్రిక్‌

Sep 19 2026 8:12 AM | Updated on Sep 19 2026 9:23 AM

Shadab Khan hat trick takes Falcons to CPL 2026 final

source: X

కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో పాకిస్తాన్‌ స్పిన్నర్‌ షాదాబ్‌ ఖాన్‌ హ్యాట్రిక్‌తో చెలరేగాడు. ఈ టోర్నీలో ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. గయానా అమెజాన్ వారియర్స్‌తో జరిగిన క్వాలిఫయర్‌-1 పోటీలో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఫాల్కన్స్‌ వారియర్స్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వారియర్స్‌, షాదాబ్‌ ఖాన్‌ (4-0-16-4), సుఫ్యాన్‌ మొఖీమ్‌ (4-0-13-4) ధాటికి 15 ఓవర్లలో 76 పరుగులకే కుప్పకూలింది.వారియర్స్‌ ఇన్నింగ్స్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌ (16), మవేంద్ర దిండ్యాల్‌ (11), షాయ్‌ హోప్‌ (16), రొమారియో షెపర్డ్‌ (14 నాటౌట్‌) రెండంకెల స్కోర్లు చేయడంతో వారియర్స్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.

అనంతరం ఫాల్కన్స్‌ స్వల్ప లక్ష్యాన్ని కేవలం 5.2 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్‌ రఖీమ్‌ కార్న్‌వాల్‌ 16 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 49 పరుగులు చేసి ఫాల్కన్స్‌ను గెలిపించాడు. మరో ఓపెనర్‌ ఎవిన్‌ లెవిస్‌ (13 బంతుల్లో 23 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి ఫాల్కన్స్‌ను విజయతీరాలకు చేర్చాడు.

ఈ మ్యాచ్‌లో ఓడినా వారియర్స్‌కు ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉంది. శుక్రవారం క్వాలిఫయర్-2లో కింగ్స్‌మెన్‌పై గెలిస్తే ఫైనల్‌కు చేరుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లో ఫాల్కన్స్‌ను ఎదుర్కొంటుంది.

ఇదీ చదవండి: ఆడమ్‌ జంపా 'డబుల్ సెంచరీ'.. జింబాబ్వేను చిత్తు చేసిన ఆసీస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement