source: X
యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL) తొలి ఎడిషన్ (2026) విజేతగా మిచెల్ సాంట్నర్ నేతృత్వంలోని ఎడిన్‌బర్గ్ కాసిల్ రాకర్స్ జట్టు అవతరించింది. నిన్న జరిగిన ఫైనల్లో ఈ జట్టు బెల్‌ఫాస్ట్ వోల్వ్స్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి ఛాంపియన్‌గా అవతరించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వోల్వ్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేయగా.. రాకర్స్ జట్టు మరో 8 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వన్‌డౌన్ బ్యాటర్ ఆండ్రియస్ గౌస్ (90 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి రాకర్స్‌ను విజయతీరాలకు చేర్చాడు.
అంతకుముందు టిమ్ టెక్టర్ (84) రాణించడంతో వోల్వ్స్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. వోల్వ్స్ తరఫున టెక్టర్‌కు ఎవరూ సహకరించలేదు. డెవాన్ కాన్వే (29), హ్యారీ మనెంటి (16 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. స్టార్ ప్లేయర్, ఆ జట్టు కెప్టెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ 3 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. రాకర్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ (4-0-21-2) అద్భుతంగా బౌల్ చేశాడు. టామ్ కర్రన్, మార్క్ వాట్, జె జె స్మట్స్ కూడా తలో వికెట్ తీసి వోల్వ్స్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు.
అనంతరం గౌస్ ఒంటిచేత్తో రాకర్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. అతడికి రాస్ అదైర్ (23), స్మట్స్ (15), మెక్‌ముల్లెన్ (17) సహకరించారు. వోల్వ్స్ బౌలర్లలో అదైర్, హంఫ్రేస్, గావిన్ హోయ్ తలో వికెట్ తీశారు. అద్భుత ఇన్నింగ్స్‌తో రాకర్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టిన గౌస్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కగా.. టోర్నీ ఆధ్యాంతం సత్తా చాటిన రొట్టర్‌డామ్ డాకర్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌కు (449 పరుగులు) ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది.
ఇదీ చదవండి: ఆస్ట్రేలియాను వణికించిన జింబాబ్వే.. ఒక్క వికెట్ తేడాతో


