యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో తొలి హ్యాట్రిక్ నమోదైంది. బుధవారం వూర్‌బర్గ్ వేదికగా బెల్‌ఫాస్ట్ వోల్వ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎడిన్‌బర్గ్ క్యాజిల్ రాకర్స్ పేసర్, ఇంగ్లండ్ స్టార్ టామ్ కర్రాన్ హ్యాట్రిక్ వికెట్లతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎడిన్‌బర్గ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ జేజే స్మట్స్ (60 బంతుల్లో 98 పరుగులు) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు బ్రెండన్ మెక్‌ముల్లన్(30) రాణించాడు.
టామ్ మ్యాజిక్
అనంతరం 190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెల్‌ఫాస్ట్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే ట్రెంట్ బౌల్ట్ వరుసగా రెండు వికెట్లు పడగొట్టి బెల్‌ఫాస్ట్‌ను దెబ్బతీశాడు. ఆ తర్వాత ఐదో ఓవర్‌లో సెటిల్ బ్యాటర్ పాల్ స్టిర్లింగ్(25)ను కూడా బౌల్ట్ క్లీన్ బౌల్డ్ చేశాడు.
అయితే బెల్‌ఫాస్ట్ స్కోర్ 129/7 వద్ద ఉండగా.. టామ్ కర్రాన్ బంతితో మ్యాజిక్ చేశాడు. 16వ ఓవర్ వేసిన కర్రాన్.. ఐదో బంతికి ఫ్రెడ్ క్లాసెన్, మాథ్యూ హంఫ్రీస్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత 17వ ఓవర్ వేసేందుకు వచ్చిన టామ్ కర్రాన్ తొలి బంతికి అదైర్‌ను ఔట్ చేసి హ్యాట్రిక్‌ను పూర్తి చేశాడు. అతడి బౌలింగ్ ధాటికి బెల్‌ఫాస్ట్ 130 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా 59 పరుగుల తేడాతో ఎడిన్‌బర్గ్ క్యాజిల్ ఘన విజయాన్ని అందుకుంది.


