దంచికొట్టిన డుప్లెసిస్‌.. లేటు వయసులోనూ ఇరగదీస్తున్నాడు..! | Du Plessis becomes the First batter in ETPL to cross 300 runs | Sakshi
Sakshi News home page

దంచికొట్టిన డుప్లెసిస్‌.. లేటు వయసులోనూ ఇరగదీస్తున్నాడు..!

Sep 10 2026 6:00 PM | Updated on Sep 10 2026 6:13 PM

Du Plessis becomes the First batter in ETPL to cross 300 runs

source: X

యూరపియన్‌ టీ20 ప్రీమియర్‌ లీగ్‌ ఆరంభ ఎడిషన్‌లో (2026) సౌతాఫ్రికా మాజీ ఆటగాడు ఫాఫ్‌ డుప్లెసిస్‌ (42) చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో రోట్టర్‌డామ్‌ డాకర్స్‌కు సారథ్యం వహిస్తున్న అతడు.. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 4  అర్ద సెంచరీల సాయంతో 300కు పైగా పరుగులు చేశాడు. తద్వారా ఈ టోర్నీలో 300 పరుగుల మార్కును దాటిన తొలి ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు.

గ్లాస్గో కాస్మిక్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో డుప్లెసిస్‌ మరోసారి రెచ్చిపోయాడు. కేవలం 42 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 71 పరుగులు చేశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన అతడి జట్టు 19 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. 

డుప్లెసిస్‌తో పాటు ఓపెనింగ్‌ చేసిన రస్సీ వాన్‌ డర్‌ డస్సెన్‌ డకౌట్‌ కాగా.. మైఖేల్‌ లెవిట్‌ 19, విక్రమ్‌జిత్‌ సింగ్‌ 33, హెన్రిచ్‌ క్లాసెన్‌ 30 (నాటౌట్‌), డేవిడ్‌ వీస్‌ 8 (నాటౌట్‌) పరుగులు చేశారు. ఆఖర్లో క్లాసెన్‌ బ్యాట్‌ ఝులిపించాడు (3 సిక్సర్లు). కాస్మిక్‌ బౌలర్లలో తైమాల్‌ మిల్స్‌ 2, డేవిడ్‌సన్‌, లివింగ్‌స్టోన్‌ తలో వికెట్‌ తీశారు. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను తలో 19 ఓవర్లకు కుదించారు.

కాగా, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రోట్టర్‌డామ్‌ డాకర్స్‌ నాలుగు, గ్లాస్గో కాస్మిక్‌ చివరి స్థానంలో ఉన్నాయి. ఎడిన్‌బర్గ్‌ కాసిల్‌ రాకర్స్‌ టాప్‌ ప్లేస్‌లో ఉండగా.. ఆమ్‌స్టర్‌డామ్‌ ఫ్లేమ్స్‌, బెల్‌ఫాస్ట్‌ వోల్వ్స్‌, డబ్లిన్‌ గార్డియన్స్‌ రెండు, మూడు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. 

చదవండి: ఫిన్‌ అలెన్‌కు జాక్‌పాట్‌.. అత్యంత ఖరీదైన ఆటగాడు



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement