ఐదేళ్ల తర్వాత 'స్పెషల్‌ ఫీట్' సాధించిన వివాదాస్పద బౌలర్‌ | After Nightclub Controversy, Brydon Carse Ends 5 Year Wait To Achieve Special Feat | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల తర్వాత 'స్పెషల్‌ ఫీట్' సాధించిన వివాదాస్పద బౌలర్‌

Sep 10 2026 2:59 PM | Updated on Sep 10 2026 3:05 PM

After Nightclub Controversy, Brydon Carse Ends 5 Year Wait To Achieve Special Feat

ఇంగ్లండ్‌ వివాదాస్పద బౌలర్‌ బ్రైడన్‌ కార్స్‌ ఐదేళ్ల తర్వాత ఓ స్పెషల్‌ ఫీట్‌ సాధించాడు. తన కౌంటీ జట్టు డర్హమ్‌ తరఫున ఐదు వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటాడు. కార్స్‌ 2021లో చివరిగా డర్హమ్ తరఫున రెడ్‌బాల్ క్రికెట్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.

తాజా మ్యాచ్‌లో కార్స్‌ 72 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. కార్స్‌ ధాటికి మిడిల్‌సెక్స్ తొలి ఇన్నింగ్స్‌లో 203 పరుగులకే ఆలౌటైంది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకు 65 మ్యాచ్‌లు ఆడిన కార్స్.. మొత్తం ఆరు ఐదు వికెట్ల హాల్స్‌ సహా 196 వికెట్లు పడగొట్టాడు.

నైట్‌క్లబ్ వివాదంతో ఇంగ్లండ్‌ జట్టుకు దూరం
ఇటీవల ఓ నైట్‌క్లబ్‌లో జరిగిన ఘటనతో కార్స్ వార్తల్లో నిలిచాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని వీడియోల్లో కార్స్ చేతులకు బేడీలు ఉన్న దృశ్యాలు కనిపించాయి. అతడి వెంట డర్హమ్ సహచరులు మాథ్యూ పాట్స్, బెన్ స్టోక్స్ కూడా ఉన్నట్లు వీడియోల్లో కనిపించింది.

ఈ ఘటనపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) దర్యాప్తు చేస్తుంది. అనంతరం పాకిస్తాన్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు ఎంపికైన కార్స్‌పై చర్యలు తీసుకుని, జట్టు నుంచి తప్పించింది.

కార్స్‌ను తప్పించినప్పటికీ.. స్వదేశంలో పాక్‌తో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌ జట్టు అద్భుత ప్రదర్శనలు చేస్తుంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి రెండు టెస్ట్‌లను గెలిచి, ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ‍ప్రస్తుతం ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా మూడో టెస్ట్‌ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లోనూ పాక్‌ పేలవ ప్రదర్శన చేస్తూ, క్లీన్‌ స్వీప్‌ పరాభవం అంచున ఉంది. 

చదవండి: దుమ్ములేపిన ఇషాన్‌ కిషన్‌.. 13 ఏళ్ల తర్వాత మరో టైటిల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement