నిప్పులు చెరిగిన ఇంగ్లండ్‌ పేసర్లు | ENG VS PAK 3rd Test: Pakistan All out for 131 runs in first innings | Sakshi
Sakshi News home page

నిప్పులు చెరిగిన ఇంగ్లండ్‌ పేసర్లు

Sep 9 2026 7:34 PM | Updated on Sep 9 2026 8:24 PM

ENG VS PAK 3rd Test: Pakistan All out for 131 runs in first innings

source: X

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న నామమాత్రపు మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ పేసర్లు​ చెలరేగిపోయారు. ఇవాళే ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌, పాక్‌ ఆటగాళ్ల భరతం పట్టింది. పేసర్లు ఓలీ రాబిన్సన్‌ (3-15), జోఫ్రా ఆర్చర్‌ (3-25), జోష్‌ టంగ్‌ (4-42) నిప్పులు చెరిగే బంతులతో పాక్‌ ఇన్నింగ్స్‌ను పేకమేడలా కూల్చారు. వీరి దెబ్బకు ఆ జట్టు 133 పరుగులకే కుప్పకూలింది.

పాక్‌ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురు (సౌద్‌ షకీల్‌ (43), మొహమ్మద్‌ అబ్బాస్‌ (21), రజావుల్లా (11)) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆ జట్టు స్టార్‌ బ్యాటర్‌గా చెప్పుకునే బాబర్‌ ఆజం 7 పరుగులు మాత్రమే చేసి జోష​్‌ టంగ్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. మిగతా ప్లేయర్లలో సైమ్‌ అయూబ్‌ 0, అజాన్‌ అవైస్‌ 9, అబ్దుల్లా షఫీక్‌ 3, షాన్‌ మసూద్‌ 5, ఘాజీ ఘోరి 4, మొహమ్మద్‌ ఇమ్రాన్‌ 5 పరుగులు మాత్రమే చేశారు.

కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం పాకిస్తాన్‌ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి ఇంగ్లండ్‌ ఇదివరకే సిరీస్‌ను కైవసం​ చేసుకుంది.

ఇదిలా ఉంటే, పాకిస్తాన్ క్రికెట్‌లో ప్రస్తుతం గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది. ఇంగ్లండ్‌ సిరీస్ మధ్యలోనే ఏడుగురు ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లిపోయారు. ఆటగాళ్ల క్రమశిక్షణ, ప్రవర్తనపై పీసీబీ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు ఆటగాళ్ల ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుని డేటాను పరిశీలించినట్లు నివేదికలు వచ్చాయి.

మరోవైపు సిరీస్‌ మధ్యలో జరిగిన మార్పుల గురించి తనను ముందుగా సంప్రదించలేదని ఆ జట్టు కెప్టెన్‌ బాబర్‌ ఆజం పేర్కొనడం మరిన్ని అనుమానాలకు తావిస్తుంది. 

చదవండి: ఓలీ రాబిన్సన్‌ 'సెంచరీ'.. 100 ఏళ్లలో అత్యుత్తమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement