అఫ్గాన్‌కు దబిడిదిబిడే.. టీమిండియా పేస్‌ గుర్రం వచ్చేస్తున్నాడు! | Jasprit Bumrah Fit To Play India vs Afghanistan T20Is After Nitish Reddy | Sakshi
Sakshi News home page

అఫ్గాన్‌కు దబిడిదిబిడే.. టీమిండియా పేస్‌ గుర్రం వచ్చేస్తున్నాడు!

Sep 10 2026 1:52 PM | Updated on Sep 10 2026 2:02 PM

Jasprit Bumrah Fit To Play India vs Afghanistan T20Is After Nitish Reddy

PC: bcci

అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ శుభ‌వార్త అందింది. పేస్ గుర్రం, స్టార్ ఫాస్ట్ బౌల‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా పూర్తి ఫిట్‌నెస్ సాధించి తిరిగి జ‌ట్టులో చేరేందుకు సిద్ద‌మ‌య్యాడు. తాజాగా బెంగ‌ళూరులోని బీసీసీఐ ఎక్స‌లెన్స్‌లో నిర్వ‌హించిన ఫిట్‌నెస్ ప‌రీక్ష‌ల్లో అత‌డి ఉత్తీర్ణత సాధించిన‌ట్లు దైనిక్ జాగరణ్ త‌మ క‌థ‌నంలో పేర్కొంది. 

కాగా ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో బుమ్రా మోకాలి గాయానికి గుర‌య్యాడు. దీంతో అత‌డు ఇంగ్లండ్ నుంచి వ‌చ్చాక బీసీసీఐ సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్‌లో చేరాడు. ఈ క్ర‌మంలో శ్రీలంకతో జ‌రిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ స‌మ‌యానికి అతడు కోలుకుంటాడ‌ని సెల‌క్ట‌ర్లు భావించారు. 

కానీ బుమ్రా పూర్తి ఫిట్‌నెస్ సాధించ‌క‌పోవ‌డంతో లంక టూర్‌కు దూర‌మ‌య్యాడు. ఆ త‌ర్వాత అఫ్గానిస్తాన్ సిరీస్‌తో పాటు ఆసియా క్రీడ‌ల‌కు ఎంపిక చేసిన జ‌ట్టులో కూడా చోటు ద‌క్కింది. కానీ బుమ్రా త‌న ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటానే మైదానంలోకి అడుగుపెడతాడని సెలక్లర్లు స్పష్టత చేశారు. 

ఇప్పుడు బుమ్రా ఫిట్‌నెస్ టెస్టుల్లో పాస్ కావడంతో బీసీసీఐ వైద్య బృందం నుంచి అతడికి గ్రీన్ సిగ్నల్ లభించింది. అదేవిధంగా ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్‌, నితీశ్ కుమార్ రెడ్డిలు సైతం ఫిట్‌నెస్ క్లియరెన్స్‌లు పొందారు. అయితే ఫిట్‌నెస్ టెస్టులో విఫలమైన పేసర్ హర్షిత్ రాణా.. అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌తో పాటు ఆసియాక్రీడలకు దూరమయ్యాడు. అతడి స్ధానంలో యువ పేసర్ యశ్ ఠాకూర్‌కు సెలక్టర్లు అవకాశమిచ్చారు.

అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు (అప్‌డేటెడ్‌)
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), ఇషాన్ కిషన్  (వికెట్‌ కీపర్‌), తిలక్ వర్మ (వైస్‌ కెప్టెన్‌), శివమ్ దూబే, నితీశ్‌ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సింగ్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, యశ్‌ ఠాకూర్‌.

ఆసియా క్రీడలు-2026 టోర్నీకి భారత జట్టు (అప్‌డేటెడ్‌)
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), ఇషాన్ కిషన్  (వికెట్‌ కీపర్‌), తిలక్ వర్మ (వైస్‌ కెప్టెన్‌), శివమ్ దూబే, నితీశ్‌ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సింగ్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, యశ్‌ ఠాకూర్‌.
చదవండి: గంభీర్‌ ఫేవరెట్‌ ప్లేయర్‌ అవుట్‌.. రీప్లేస్‌మెంట్‌ ప్రకటించిన బీసీసీఐ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement