రోహిత్ శర్మ (PC: BCCI/Rohit Sharma X)
వన్డే ప్రపంచకప్-2027 టోర్నీలో టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ ఆడతాడా? లేదా?... ఇప్పటికీ ఈ విషయంపై స్పష్టత రాలేదు. భారత జట్టును 2023లో వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేర్చిన ఈ లెజెండరీ బ్యాటర్.. 2025లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచాడు.
అయితే, అనూహ్య రీతిలో చాంపియన్స్ ట్రోఫీలో జట్టును విజేతగా నిలిపిన తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించింది. అతడి స్థానంలో శుబ్‌మన్ గిల్‌కు వన్డే పగ్గాలు అప్పగించింది. ఇక ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్.. వన్డే జట్టులో ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
కానీ గత కొంతకాలంగా రోహిత్ వన్డే రిటైర్మెంట్‌పై కూడా ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. హిట్‌మ్యాన్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించినప్పుడు.. అతడు 2027 వరల్డ్‌కప్ ఆడతాడని తమకు కచ్చితంగా చెప్పలేదంటూ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ షోలో రోహిత్ శర్మ.. ‘non-committal?’ (నిబద్ధత లేదా అన్న అర్థంలో) అనే అక్షరాలు రాసి ఉన్న టీ-షర్టు ధరించడం వైరల్‌గా మారింది. జట్టు తరఫున ఆడేందుకు తాను పూర్తి నిబద్ధతో ఉన్నానని హిట్‌మ్యాన్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఇటీవల ఇంగ్లండ్‌లో జరిగిన లార్డ్స్ వన్డే రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో చివరి మ్యాచ్ అనే ప్రచారం జరుగగా.. బ్యాట్‌తోనే హిట్‌మ్యాన్ ఇందుకు సమాధానం ఇచ్చాడు. ప్రఖ్యాత లార్డ్స్‌లో శతక్కొట్టి మరీ.. విమర్శకుల నోళ్లు మూయించాడు. అయితే, సెలక్టర్లే లీకులు ఇచ్చి మరీ ఈ వదంతులు వ్యాప్తి చేయించారన్న వార్తలు వచ్చాయి.
ఇలాంటి తరుణంలో రోహిత్ ఇలాంటి టీ షర్టు ధరించడం విశేషం. ఇదిలా ఉంటే.. గురువారం నాటి ఈవెంట్లో ఓ ప్రేక్షకుడు.. ‘మీరు వన్డే వరల్డ్‌కప్-2027 ఆడతారా?’ అన్న ప్రశ్న అడుగగా.. ‘‘అక్టోబరు 2027కు ఇంకా చాలా సమయం ఉంది. అప్పుడు దాని గురించి ఆలోచిద్దాం’’ అని 39 ఏళ్ల రోహిత్ శర్మ బదులిచ్చాడు. కాగా సౌతాఫ్రికా-జింబాబ్వే- నమీబియా వన్డే వరల్డ్‌కప్ తాజా ఎడిషన్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి.
Aa raha hai Hitman! 🤩
Family Full House With Rohit Sharma!
Shuru ho raha hai 19th September se raat 9:30 baje, sirf #SonyEntertainmentTelevision aur Sony LIV par.@ImRo45 #RohitSharma #FamilyFullHouse #ComingSoon #SonyTV pic.twitter.com/HIaw43il3d— sonytv (@SonyTV) September 8, 2026


