Photo Credit: BCCI Twitter
టీమిండియా వికెట్ కీపర్, ఈస్ట్‌జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. సౌత్‌జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇప్పటికే డబుల్ సెంచరీతో బీభత్సం సృష్టించిన ఇషాన్ కిషన్ రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే జోరును ప్రదర్శిస్తున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో వన్డే తరహా బ్యాటింగ్‌తో అలరించిన ఇషాన్ 98 బంతుల్లో 80 పరుగులు చేసి ఔటయ్యాడు.
అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అతడికి తోడు శిఖర్ మోహన్ (52) అర్థసెంచరీతో చెలరేగాడు. 41 ఓవర్లు ముగిసేసరికి ఈస్ట్‌జోన్ 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఈస్ట్‌జోన్ ఇప్పటికే 533 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది.
త్రిపురానాను దంచికొట్టాడు..
ఫిఫ్టీ మార్క్ సాధించిన తర్వాత త్రిపురానా వేసిన ఇన్నింగ్స్ 25వ ఓవర్‌లో ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. ఆ ఓవర్‌లో వరుసగా 4,6,6, 4 బాదడంతో పాటు సింగిల్ సహా మొత్తం 17 పరుగులు పిండుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ బాదే క్రమంలో ఏ బౌలర్‌ను విడిచిపెట్టని ఇషాన్ రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే జోరును కనబరుస్తూ ప్రతీ బౌలర్‌ను చితక్కొడుతూ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగులకు ఆలౌటైన ఈస్ట్‌జోన్, ఆ తర్వాత సౌత్‌జోన్‌ను 336 పరుగులకే కట్టడి చేసి తొలి ఇన్నింగ్స్‌లో 372 పరుగుల ఆధిక్యం సాధించింది. మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉండడంతో నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన ఈస్ట్‌జోన్ దులీప్ ట్రోఫీ టైటిల్ అందుకోనుంది.
4,6,6,4 BY ISHAN KISHAN - He smashing everyone in Duleep Trophy final 🥶 pic.twitter.com/lKPAA2awOY
— Johns. (@CricCrazyJohns) September 9, 2026


