రాజకీయాల్లోకి షమీ..? | Mohammed Shami in politics, Jayant Chaudhary meeting triggers fresh speculation | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లోకి షమీ..?

Sep 21 2026 12:27 PM | Updated on Sep 21 2026 12:56 PM

Mohammed Shami in politics, Jayant Chaudhary meeting triggers fresh speculation

source: BCCI X

టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నాడనే సంకేతం అందుతోంది. షమీ తాజాగా రాష్ట్రీయ లోక్‌దళ్‌ (RLD) అధినేత జయంత్‌ చౌధరితో భేటీ కావడం ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. షమీ రాబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నాడనే ప్రచారం జరుగుతోంది.

షమీ ఆదివారం ఢిల్లీలో జయంత్‌ చౌధరిని కలిశాడు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోను జయంత్‌ చౌధరి సోషల్‌ మీడియాలో పంచుకోవడంతో రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి. 2027 ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు మొదలైన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

షమీ అమ్రోహా జిల్లాకు చెందినవాడు కావడంతో.. అమ్రోహా అసెంబ్లీ స్థానం నుంచి రాజకీయ అరంగేట్రం చేయవచ్చన్న ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఈ అంశంపై RLD నుంచి కానీ, షమీ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

ప్రస్తుతం షమీ టీమిండియాలోకి రీఎంట్రీ కోసం​ ఎదురుచూస్తున్నాడు. ఇటీవల అతడు ఆడిన ప్రతి దేశవాలీ మ్యాచ్‌లోనూ సత్తా చాటి సెలెక్టర్లకు సవాల్‌ విసిరాడు. దీంతో షమీని భారత టెస్ట్‌ జట్టులోకి తీసుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి. త్వరలో జరుగబోయే న్యూజిలాండ్‌ పర్యటన కోసం భారత సెలెక్టర్లు షమీ పేరును పరిశీలించవచ్చని తెలుస్తోంది. 

ఇదీ చదవండి: Asian Games 2026: షూటింగ్‌లో డబుల్‌ ధమాకా.. మొత్తం 6 పతకాలు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement