Asian Games 2026: షూటింగ్‌లో డబుల్‌ ధమాకా.. మొత్తం 6 పతకాలు | Asian Games 2026: Indian Shooters Rudrankksh Patil, Himanshu Dhillon Win Bronze and Silver in men's 10m air rifle individual final | Sakshi
Sakshi News home page

Asian Games 2026: షూటింగ్‌లో డబుల్‌ ధమాకా.. మొత్తం 6 పతకాలు

Sep 21 2026 11:55 AM | Updated on Sep 21 2026 12:07 PM

Asian Games 2026: Indian Shooters Rudrankksh Patil, Himanshu Dhillon Win Bronze and Silver in men's 10m air rifle individual final

source: X

ఏషియన్‌ గేమ్స్‌ 2026లో రెండో రోజు భారత్‌కు పతకాల పంట పండింది. షూటింగ్‌లో భారత షూటర్లు సత్తా చాటారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత విభాగంలో హిమాంశు ధిల్లాన్‌ రజతం, రుద్రాంక్ష్‌ పాటిల్‌ కాంస్యం సాధించారు.

ఇదే ఈవెంట్‌లో అంతకుముందు వీరిద్దరూ పార్త్‌ మానే‌తో కలిసి టీమ్‌ విభాగంలో రజతం గెలుచుకున్నారు. దీంతో రెండో రోజు భారత్‌ ఖాతాలో మూడు షూటింగ్‌ పతకాలు చేరాయి.

తొలి రోజు కూడా భారత్‌ ఖాతాలో రెండు షూటింగ్‌ పతకాలు చేరాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత విభాగంలో ఎలావెనిల్‌ వలరివన్‌.. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ విభాగంలో సోనమ్‌ మస్కర్‌, విదర్సా వినోద్‌, ఎలావెనిల్‌ వలరివన్‌ రజత పతకాలు సాధించారు. 

ఇప్పటివరకు భారత్‌ ఖాతాలో కేవలం షూటింగ్‌లోనే ఐదు పతకాలు చేరాయి. ఇప్పటివరకు భారత్‌ మొత్తం 6 పతకాలు గెలిచింది.

ఇవాళే మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ మహిళల సంప్రదాయ 60 కేజీల విభాగంలో సుచికా తరియాల్‌ కాంస్య పతకం సాధించింది.  ఏషియన్‌ గేమ్స్‌ చరిత్రలో ఎంఎంఏలో భారత్‌కు ఇదే తొలి పతకం.

మరోవైపు ఇవాళ జరిగిన మహిళల టేబుల్‌ టెన్నిస్‌లో భారత జట్టు  పాకిస్తాన్‌ను 3-0తో చిత్తు చేసి, క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది.

ఇదీ చదవండి: Asian Games 2026: మహిళల ఎంఎంఏలో భారత్‌కు తొలి పతకం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement