breaking news
Kendel Kadowaki-Fleming
-
IND vs JPN T20I: జట్లు, టైమింగ్, ప్రత్యక్ష ప్రసారం.. వివరాలు ఇవే
ఆసియా క్రీడలు-2026 టోర్నమెంట్ ఆరంభానికి ముందు టీమిండియా జపాన్‌తో ఏకైక టీ20 మ్యాచ్‌కు సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య మంగళవారం (సెప్టెంబరు 22) జరిగే ఈ మ్యాచ్‌కు సనో అంతర్జాతీయ క్రికెట్ మైదానం వేదిక. కాగా భారత్- జపాన్ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో తలపడటం ఇదే మొదటిసారి కావడం విశేషం.క్రీడల అభివృద్ధికి సహకారాన్ని ఆశిస్తూభారత్- జపాన్ మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఇరుదేశాల పురుష క్రికెట్ జట్ల మధ్య ఈ మేరకు ఏకైక టీ20 మ్యాచ్ నిర్వహణకు సన్నాహకాలు చేశారు. ‘స్పోర్ట్-75’ పేరుతో రూపొందుతున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఇరుదేశాల మధ్య క్రీడల అభివృద్ధికి సహకారాన్ని ఆశిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.ఇక జపాన్‌తో జరిగే ఏకైక టీ20కి శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే సిద్ధమైంది. మరోవైపు జపాన్ సైతం ప్రపంచ చాంపియన్ టీమిండియాతో పోటీ పడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరి ఈ మ్యాచ్‌కు సంబంధించిన జట్లు, ఆరంభ సమయం, ప్రత్యక్ష ప్రసారం తదితర వివరాలు తెలుసుకుందామా?!టీమిండియా వర్సెస్ జపాన్.. ఏకైక టీ20 మ్యాచ్వేదిక: సనో అంతర్జాతీయ క్రికెట్ మైదానంటైమింగ్భారత కాలమానం ప్రకారం మంగళవారం (సెప్టెంబరు 22) ఉదయం 9.30 నిమిషాలకు మ్యాచ్ ఆరంభంఎక్కడ చూడాలంటే..స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ (టీవీ), ఫ్యాన్‌కోడ్ యాప్, వెబ్సైట్ (డిజిటల్).జట్లు ఇవేభారత్శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివం దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయి, రవి బిష్ణోయి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, యశ్ ఠాకూర్, విప్రాజ్ నిగమ్.జపాన్కెండెల్ కడోవాకీ ఫ్లెమింగ్ (కెప్టెన్), చార్లీ హరా హింజే, బెంజమిన్ ఇటో-డేవిస్, కొయి కుబోటా, వటారు మియాచి, రియో సకురనో-థామస్, అలెక్స్ శిరాయి-పాట్మోర్, షోమా సుగయా-స్లేటర్, డెక్లాన్ సుజుకి, ఇబ్రహీం తకహషి, మకొటో తానియమా, లచ్లాన్ యమామొటో, అలెస్టెర్ కడోవాకీ-ఫ్లెమింగ్, జేక్ కుసుడ-నైర్, సుయోషి తకడా.చదవండి: ఆసీస్‌పై వీరేందర్ సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ విధ్వంసం -
మావాడు వైభవ్ పనిపట్టాడు.. ఇంకేం భయం?: జపాన్ కెప్టెన్
టీమిండియాతో చారిత్రక మ్యాచ్ ఆడేందుకు జపాన్ క్రికెట్ జట్టు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో జపాన్ కెప్టెన్ కెండెల్ కడోవాకీ ఫ్లెమింగ్.. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ విధ్వంసకర ఓపెనర్ దూకుడుకు కళ్లెం వేసేందుకు తమ దగ్గర అస్త్రం సిద్ధంగా ఉందని పేర్కొన్నాడు.భారత్- జపాన్ మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఇరుదేశాల పురుషుల క్రికెట్ జట్ల మధ్య తొలిసారి మ్యాచ్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. సెప్టెంబరు 22న ఇరుజట్ల మధ్య ఏకైక టీ20 మ్యాచ్ జరుగనుంది. జపాన్‌లోని సానో అంతర్జాతీయ మైదానం ఇందుకు వేదిక.ఇప్పటికే వైభవ్‌ను ఓసారి అవుట్ చేశాడుఈ నేపథ్యంలో జపాన్ కెప్టెన్ కెండెల్ ‘విజ్డెన్’ షోలో మాట్లాడుతూ.. ‘‘వైభవ్ సూర్యవంశీని ఎదుర్కొనే విషయంలో మాకు ఎలాంటి ఆందోళనా లేదు. ఎందుకంటే.. మా జట్టులో ఉన్న పదిహేడేళ్ల లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆసియా కప్ అండర్-19 టోర్నీలో ఇప్పటికే వైభవ్‌ను అవుట్ చేశాడు. దూకుడుకు కళ్లెం వేసి అతడి పనిపట్టాడు. కాబట్టి ఇంకేం భయం?’’ అని పేర్కొన్నాడు.చార్లీ హరా బౌలింగ్లోకాగా అండర్-19 ఆసియా కప్-2024 టోర్నీలో భాగంగా జపాన్‌తో మ్యాచ్ సందర్భంగా పరుగులు రాబట్టేందుకు వైభవ్ సూర్యవంశీ ఇబ్బంది పడ్డాడు. మొత్తంగా 23 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 23 పరుగులే చేయగలిగాడు. భారత ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో జపాన్ యువ స్పిన్నర్ చార్లీ హరా-హింజే వైభవ్‌ను అవుట్ చేశాడు.అంత ఈజీ కాదు.. కథ వేరుగా ఉందిఅయితే, జపాన్ కెప్టెన్ కెండెల్ చెప్పినట్లు వైభవ్ సూర్యవంశీని తమ యువ స్పిన్నర్‌తో కట్టడి చేయడం అంత తేలికేమీ కాదు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ స్సిన్నర్ల బౌలింగ్‌లో 17 ఇన్నింగ్స్‌లో కలిపి 146 బంతుల్లో 336 పరుగులు సాధించాడు. సగటు 37 కాగా.. స్ట్రైక్‌రేటు 228.08. ఇందులో 20 ఫోర్లు, 34 సిక్సర్లు ఉండటం విశేషం.ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో మొత్తం ఆరు టీ20 మ్యాచ్‌లు ఆడిన పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీ.. 193 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున 23 మ్యాచ్‌లు ఆడిన వైభవ్.. 1028 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌తో బిజీగా ఉన్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. సంజూ శాంసన్ రాక వల్ల తొలి టీ20 సందర్భంగా తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.చదవండి: వైభవ్‌ను కాదని నీకు ఛాన్స్ ఇస్తే ఏం చేశావు? -
టీమిండియాతో టీ20.. జట్టును ప్రకటించిన జపాన్
టీమిండియాతో చారిత్రక మ్యాచ్‌కు జపాన్ క్రికెట్ అసోసియేషన్ (జేసీఏ) తమ జట్టును ప్రకటించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు కెండెల్ కడోవాకీ ఫ్లెమింగ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు తెలిపింది. భారత్‌తో ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పాటు యువ క్రికెటర్లతో కూడిన సమతూకమైన జట్టును సెలక్ట్ చేసినట్లు జేసీఏ వెల్లడించింది.‘స్పోర్ట్ 75’ పేరుతోకాగా భారత్- జపాన్ మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తొలిసారి ఇరుదేశాల పురుషుల క్రికెట్ జట్ల మధ్య ఈ మ్యాచ్‌ను ఏర్పాటు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాన మంత్రి సానే టకై చీ మధ్య ఇటీవలే ఒక సమావేశం జరిగింది. ఈ క్రమంలో ‘స్పోర్ట్ 75’ పేరుతో రూపొందుతున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా భారత్- జపాన్ మధ్య క్రీడల అభివృద్ధికి సహకారాన్ని ఆశిస్తూ ఈ టీ20 మ్యాచ్‌ను ఏర్పాటు చేశారు.జపాన్‌లోని సానో అంతర్జాతీయ మైదానంలో ఇరుజట్ల మధ్య సెప్టెంబరు 22న ఏకైక టీ20 మ్యాచ్ జరుగనుంది. టీమిండియా- భారత్ మధ్య జరిగే తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఇదే కావడం విశేషం. ఇదిలా ఉంటే.. తమ టీ20 చరిత్రలో టీమిండియా ఇప్పటి వరకు 19 జట్లతో తలపడగా.. జపాన్ 20వ జట్టు కానుంది.టీమిండియాతో ఏకైక టీ20 మ్యాచ్‌కు జపాన్ జట్టు ఇదేకెండెల్ కడోవాకీ ఫ్లెమింగ్ (కెప్టెన్), చార్లీ హరా హింజే, బెంజమిన్ ఇటో-డేవిస్, కొయి కుబోటా, వటారు మియాచి, రియో సకురనో-థామస్, అలెక్స్ శిరాయి-పాట్మోర్, షోమా సుగయా-స్లేటర్, డెక్లాన్ సుజుకి, ఇబ్రహీం తకహషి, మకొటో తానియమా, లచ్లాన్ యమామొటో, అలెస్టెర్ కడోవాకీ-ఫ్లెమింగ్, జేక్ కుసుడ-నైర్, సుయోషి తకడా.కీలక ఆటగాళ్లుకాగా కెప్టెన్, 30 ఏళ్ల కెండెల్ టాపార్డర్‌లో బ్యాటింగ్ చేస్తాడు. గతేడాది నుంచి ఇప్పటిదాకా జపాన్ తరఫున 451 పరుగులు చేసిన అతడు.. టాప్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇక ఇబ్రహీం తకహషి మిడిలార్డర్ బ్యాటర్,. 2025 నుంచి ఇప్పటి వరకు 248 పరుగులు చేయడంతో పాటు.. 20 వికెట్లు కూల్చాడు. మరోవైపు.. చార్లీ హరా హింజే లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా సేవలు అందిస్తున్నాడు. గతేడాది కాలంలో అతడు 21 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఇక పేస్ విభాగంలో రియో సుకురనో-థామస్, డెక్లాన్ సుజుకి కీలకం. చదవండి: నష్రా సంధుకు ఆరు వికెట్లు... సెమీ ఫైనల్లో పాకిస్తాన్


