సన్‌రైజర్స్‌కు మరో దెబ్బ... ఐపీఎల్‌కు జాక్‌ ఎడ్వర్డ్స్‌ దూరం | Jack Edwards Ruled Out of IPL | Sakshi
Sakshi News home page

సన్‌రైజర్స్‌కు మరో దెబ్బ... ఐపీఎల్‌కు జాక్‌ ఎడ్వర్డ్స్‌ దూరం

Mar 21 2026 3:54 AM | Updated on Mar 21 2026 3:54 AM

Jack Edwards Ruled Out of IPL

హైదరాబాద్‌: ఆరంభానికి ముందే ఐపీఎల్‌ను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) కెపె్టన్‌ కమిన్స్‌ తొలి దశ మ్యాచ్‌లకు దూరం కాగా, తాజాగా మరో సహచరుడు జాక్‌ ఎడ్వర్డ్స్‌ ఏకంగా సీజన్‌ మొత్తానికే అందుబాటులో లేకుండా పోయాడు. ఆ్రస్టేలియాకే చెందిన 25 ఏళ్ల సీమ్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ ఎడ్వర్డ్స్‌ను వేలంలో రూ. 3 కోట్లకు హైదరాబాద్‌ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. 

ఈ సీజన్‌తో ఐపీఎల్‌లో అరంగేట్రం చేయాల్సిన ఈ ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ ఇప్పుడు మరో సీజన్‌ దాకా వేచి ఉండక తప్పదు. అతడు కాలిపాదం గాయంతో సతమతమవుతున్నాడు. బిగ్‌బాష్‌ లీగ్‌లో విశేషంగా రాణించిన జాక్‌ (19 వికెట్లు; 133 పరుగులు) పెర్త్‌ వేదికగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. మొత్తమ్మీద ఆ్రస్టేలియన్‌ బౌలింగ్‌ దళాన్నే గాయాలు పట్టిపీడిస్తున్నాయి. ఎందుకంటే కమిన్స్, హాజల్‌వుడ్, స్టార్క్, ఎలిస్‌లు ఇదివరకే గాయాలతో ఆటకు దూరంగా ఉంటున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement