source: X
ఏషియన్ గేమ్స్ 2026 మహిళల క్రికెట్‌లో పాకిస్తాన్‌కు కాంస్య పతకం లభించింది. ఇవాళ జరిగిన ఈ పతక పోరులో పాక్ బంగ్లాదేశ్‌ను 31 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ లక్ష్యానికి 32 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
పాక్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ ఫాతిమా సనా (45) రాణించగా.. షవాల్ జుల్ఫికర్ (17), గుల్ ఫెరోజా (31), ఆలియా రియాజ్ (25) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. బంగ్లా బౌలర్లలో నహిద అక్తర్, షోర్నా అక్తర్, రితూ మోనీ తలో 2 వికెట్లు తీయగా.. సంజిద అక్తర్ ఓ వికెట్ దక్కించుకుంది.
అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ చతికిలపడింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 114 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టు తరఫున వారి కెప్టెన్ షర్మిన్ అక్తర్ (46 నాటౌట్) ఒంటరిపోరాటం చేసినా, ప్రయోజనం లేకుండా పోయింది. పాక్ బౌలర్లలో ఉమ్-ఏ-హనీ (4-1-10-3) బంగ్లాదేశ్‌ను భారీ దెబ్బ తీసింది. ఫాతిమా సనా, తస్మియ రుబాబ్, నష్రా సంధు, అయేషా జాఫర్ కూడా తలో చేయి వేసి బంగ్లా పతనంలో తమవంతు పాత్ర పోషించారు.
ఈ క్రీడల్లో ఇవాళే స్వర్ణ పతకం మ్యాచ్ కూడా జరుగనుంది. ఆ పోరులో భారత్, శ్రీలంక తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు స్వర్ణం కైవసం చేసుకుంటే, ఓడిన జట్టు రజతంతో సరిపెట్టుకుంటుంది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుంది.
ఇదీ చదవండి: ఇంగ్లండ్ హెడ్ కోచ్‌గా జొనాథన్ ట్రాట్


