భీకర ఫామ్‌కు బ్రేక్‌.. నిరాశపరిచిన భారత కెప్టెన్‌ | Devdutt padikkal out for just 3 runs in India A vs Australia A 1st Unofficial Test | Sakshi
Sakshi News home page

భీకర ఫామ్‌కు బ్రేక్‌.. నిరాశపరిచిన భారత కెప్టెన్‌

Sep 22 2026 11:10 AM | Updated on Sep 22 2026 11:10 AM

Devdutt padikkal out for just 3 runs in India A vs Australia A 1st Unofficial Test

source: BCCI X

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ దేవదత్‌ పడిక్కల్‌ భీకర ఫామ్‌కు బ్రేక్‌ పడింది. ఆస్ట్రేలియా-ఏతో ఇవాళ మొదలైన తొలి అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లో (తొలి ఇన్నింగ్స్‌) అతడు కేవలం 3 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. ఈ సిరీస్‌లో పడిక్కల్‌ భారత-ఏ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. 

ఈ మ్యాచ్‌లో భారత్‌-ఏ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్‌ అమన్‌ మోఖడే (6) తర్వాత ఔటయ్యాక బరిలోకి దిగిన పడిక్కల్‌ 14 బంతులు ఆడి ఒక్క చెప్పుకోదగ్గ షాట్‌ కూడా ఆడకుండానే నిష్క్రమించాడు. ఇటీవలికాలంలో పడిక్కల్‌ నుంచి ఇలాంటి ప్రదర్శన చూడలేదు.

ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో అతడు అర్ద సెంచరీతో (62) రాణించాడు. దానికి ముందు జరిగిన శ్రీలంకతో జరిగిన రెండు టెస్ట్‌ల్లో వరుస సెంచరీలతో (167, 117) చెలరేగాడు. ఆ సిరీస్‌కు ముందు శ్రీలంక ఎలెవెన్‌తో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లోనూ అజేయ సెంచరీతో (142) కదంతొక్కాడు.

అంతకుముందు ఐపీఎల్‌ 2026లోనూ పడిక్కల్‌ నిలకడైన ప్రదర్శనలతో అకట్టుకున్నాడు. ఆ సీజన్‌లో 168.73 స్ట్రయిక్‌రేట్‌తో 464 పరుగులు సాధించి, ఆర్సీబీ వరుసగా రెండో ఎడిషన్‌లో టైటిల్‌ కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించాడు.

మొత్తంగా ఆసీస్‌-ఏపై తాజా ప్రదర్శన మినహా పడిక్కల్‌ ఇటీవలికాలంలో అద్భుతమైన ప్రదర్శనలు చేశాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. రెండు అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లు, మూడు అనధికారిక వన్డేల కోసం ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా పుదుచ్చేరి వేదికగా ఇవాళ తొలి టెస్ట్‌ మొదలైంది. 

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేస్తున్న భారత్‌ 20 ఓవర్ల తర్వాత 2 వికెట్ల నష్టానికి 57 పరుగులు స్కోర్‌ చేసింది. అమన్‌ మోఖడే, పడిక్కల్‌ ఔట్‌ కాగా.. సాయి సుదర్శన్‌ (30), షేక్‌ రషీద్‌ (10) క్రీజ్‌లో ఉన్నారు. 

ఇదీ చదవండి: Asian Games 2026: క్రికెట్‌లో పాక్‌కు కాంస్య పతకం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement