IPL 2026: వైభవ్‌ తగ్గేదేలే!.. ఎవరికెంత ప్రైజ్‌ మనీ? | IPL 2026: List of Award Winners Prize Money Orange Cap Purple Cap MVP | Sakshi
Sakshi News home page

IPL 2026: వైభవ్‌ తగ్గేదేలే!.. ఎవరికెంత ప్రైజ్‌ మనీ?

Jun 1 2026 10:24 AM | Updated on Jun 1 2026 7:41 PM

IPL 2026: List of Award Winners Prize Money Orange Cap Purple Cap MVP

ఐపీఎల్‌-2026 టోర్నీ ఆదివారంతో ముగిసింది. అహ్మదాబాద్‌ వేదికగా టైటిల్‌ పోరులో గుజరాత్‌ టైటాన్స్‌ను ఓడించిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) విజేతగా అవతరించింది. తద్వారా వరుసగా రెండోసారి ట్రోఫీ సాధించి సంబరాల్లో మునిగిపోయింది. 

తొలి టైటిల్‌ కోసం పద్దెనిమిదేళ్లు ఎదురుచూసిన ఆర్సీబీ గతేడాది ఫైనల్లో.. పంజాబ్‌ కింగ్స్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అదే జోరు కొనసాగిస్తూ తాజా ఎడిషన్‌లోనూ జయభేరి మోగించింది.

ఇక ఐపీఎల్‌ తాజా సీజన్‌లో చాంపియన్‌ ఆర్సీబీ, రన్నరప్‌ గుజరాత్‌ ప్రైజ్‌ మనీలతో పాటు.. ఆరెంజ్‌ క్యాప్‌, పర్పుల్‌ క్యాప్‌, మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌ తదితర అవార్డులు గెలిచిన ప్లేయర్లు, వారికి దక్కిన మొత్తం ఎంతో తెలుసుకుందామా?!

ఆరెంజ్‌ క్యాప్‌ (అత్యధిక పరుగులు) 
వైభవ్‌ సూర్యవంశీ (రాజస్తాన్‌) 
👉మ్యాచ్‌లు: 16; పరుగులు: 776 
👉ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు

పర్పుల్‌ క్యాప్‌ (అత్యధిక వికెట్లు) 
కగిసో రబాడ (గుజరాత్‌) 
👉మ్యాచ్‌లు: 17; వికెట్లు: 29 
👉ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు 

ఎమర్జింగ్‌ ప్లేయర్‌ 
వైభవ్‌ సూర్యవంశీ
👉ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు 

మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌ 
వైభవ్‌ సూర్యవంశీ
👉ప్రైజ్‌మనీ: రూ. 15 లక్షలు 

సూపర్‌ స్ట్రయికర్‌ ఆఫ్‌ ద సీజన్‌’ 
వైభవ్‌ సూర్యవంశీ
👉స్ట్రయిక్‌ రేట్‌: 237.30 
👉ప్రైజ్‌మనీ: టాటా కార్‌ 

‘బెస్ట్‌ క్యాచ్‌’ ఆఫ్‌ ద టోర్నీ 
మనీశ్‌ పాండే (కోల్‌కతా)
👉ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు

‘ఫెయిర్‌ ప్లే’ అవార్డు
పంజాబ్‌ కింగ్స్‌ 

అత్యధిక సిక్స్‌లు
వైభవ్‌  (72 సిక్స్‌లు) 
👉ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు 

అత్యధిక ఫోర్లు
సాయి సుదర్శన్‌ (75 ఫోర్లు)
👉ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు 

‘గ్రీన్‌ డాట్‌బాల్స్‌ ఆఫ్‌ ద సీజన్‌’ 
సిరాజ్‌ (గుజరాత్‌) 
👉మొత్తం 172 డాట్‌ బాల్స్‌ 
👉ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు

టైటిల్‌ విజేతకు ఎంతంటే?
ఐపీఎల్‌ 19వ సీజన్‌ విజేతగా నిలిచిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు రూ. 20 కోట్లు లభించాయి. రన్నరప్‌ గుజరాత్‌ టైటాన్స్‌కు రూ. 12.50 కోట్లు దక్కాయి.

వైభవ్‌దే హవా
రాజస్తాన్‌ రాయల్స్‌ చిచ్చరపిడుగు ఈ సీజన్‌లో మొత్తం దాదాపుగా రూ. 55 లక్షల ప్రైజ్‌మనీ గెలిచాడు. ఓ టాటా కారు కూడా అతడి సొంతమైంది.

చదవండి: రజతాభిషేకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement