RCB vs GT
-
‘నువ్వు కూర్చో.. అతడినే వన్‌డౌన్‌లో పంపుతాం అన్నాడు’
గత రెండేళ్లుగా గుజరాత్ టైటాన్స్ టాపార్డర్ అద్భుతంగా రాణిస్తోంది. ఐపీఎల్-2025లో గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ 15 మ్యాచ్‌లు ఆడి 759 పరుగులు సాధించాడు. తద్వారా అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.పరుగుల వీరులుఇక మరో ఓపెనర్, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) కూడా 15 మ్యాచ్‌లలో కలిపి 650 పరుగులు రాబట్టి సత్తా చాటాడు. వీరికి తోడుగా వన్‌డౌన్ బ్యాటర్ జోస్ బట్లర్ 14 మ్యాచ్‌లు ఆడి 538 పరుగులు సాధించాడు. ఐపీఎల్-2026లోనూ ఈ ముగ్గురూ రాణించారు.గిల్ 732, సాయి సుదర్శన్ 722 పరుగులతో మరోసారి సత్తా చాటగా.. బట్లర్ 526 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో ఫైనల్లో గుజరాత్ యాజమాన్యం బట్లర్‌ను వన్‌డౌన్‌లో కాకుండా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపింది.అనూహ్య నిర్ణయంమూడో స్థానంలో అన్క్యాప్డ్ ప్లేయర్ నిశాంత్ సింధు (20)ను పంపగా.. అతడు విఫలమయ్యాడు. ఇక నాలుగో స్థానంలో వెళ్లిన బట్లర్ సైతం 19 పరుగులే చేసి నిష్క్రమించాడు. ఇక గిల్, సాయి వరుసగా 10, 12 పరుగులే చేశారు. ఫలితంగా 155 పరుగులే చేసిన గుజరాత్.. ఐదు వికెట్ల తేడాతో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.కాగా బట్లర్‌ను వన్‌డౌన్‌లో కాకుండా నాలుగో నంబర్ బ్యాటర్‌గా పంపడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఈ విషయంలో గుజరాత్ నాయకత్వ బృందాన్ని తీవ్రంగా తప్పుబట్టాడు. ఈ విషయంపై బట్లర్ తాజాగా స్పందించాడు.నువ్వు ఇక్కడే కూర్చో.. తనను నాలుగో స్థానంలో ఆడించాలన్న ఆలోచన హెడ్‌కోచ్ ఆశిష్ నెహ్రాదేనని బట్లర్ స్పష్టం చేశాడు. ‘ఫర్ ది లవ్ ఆఫ్ క్రికెట్’తో మాట్లాడుతూ.. ‘‘తొలి వికెట్ (గిల్) పడగానే.. బ్యాటింగ్‌కు వెళ్లేందుకు హెల్మెట్ పెట్టుకుని సిద్ధమయ్యాను.ఇంతలో ఆశిష్ నెహ్రా.. ‘నువ్వు ఇక్కడే కూర్చో.. వన్‌డౌన్‌లో మేము నిశాంత్‌ను పంపాలని నిర్ణయించుకున్నాము’ అని చెప్పాడు. మ్యాచ్ తర్వాత ఈ విషయం గురించి నేను నెహ్రాను అడిగాను.అప్పుడు నిశాంత్‌ను పంపితే బాగుంటుందని.. టాపార్డర్‌లో ఆడేందుకు అతడికి ఇదే మంచి అవకాశం అని నెహ్రా నాతో అన్నాడు.వర్కౌట్ కాలేదుఅతడిని ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపలేము కదా.. అందుకే ఫైనల్లో ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారు. కోల్‌కతా మ్యాచ్‌లో కూడా అతడు నాకంటే ముందే బ్యాటింగ్‌కు వెళ్లాడు. అది తప్పో.. ఒప్పో తెలియదు. ఫైనల్లో మాత్రం ఆ నిర్ణయం మాకు వర్కౌట్ కాలేదు’’ అని బట్లర్ పేర్కొన్నాడు.చదవండి: శ్రేయస్ అయ్యర్ విఫలం.. ఘోర పరాజయం -
నేనేమీ లక్కీ చార్మ్ కాదు.. కానీ నేనొచ్చాకే ఆర్సీబీకి ట్రోఫీలు!
పద్దెమినిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. గతేడాది తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ). డిఫెండింగ్ చాంపియన్‌గా భారీ అంచనాలతో ఐపీఎల్-2026లో బరిలోకి దిగి.. మరోసారి టైటిల్ సాధించి సత్తా చాటింది.అహ్మదాబాద్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి ఆర్సీబీ జయకేతనం ఎగురవేసింది. తద్వారా రజత్ పాటిదార్ సారథ్యంలో వరుసగా రెండోసారి టైటిల్ గెలిచి.. అభిమానులను సగర్వంగా తలెత్తుకునేలా చేసింది.ఈ నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పూసర్ల వెంకట సింధు (PV Sindhu) ఆర్సీబీకి శుభాకాంక్షలు చెప్పిన తీరు వైరల్‌గా మారింది. తాను బెంగళూరుకు మకాం మార్చిన తర్వాత.. అకస్మాత్తుగా ఆర్సీబీ ట్రోఫీల మీద ట్రోఫీలు గెలుస్తోందని సరదాగా ఆమె కామెంట్ చేశారు.నేనొచ్చాకే ఆర్సీబీకి ట్రోఫీలు!‘‘ఆర్సీబీ అభిమానులారా!... నేనేమీ మీ లక్కీ చార్మ్ అని చెప్పడం లేదు. కానీ.. మీరొకటి గమనించారా.. నేను బెంగళూరుకు మకాం మార్చినప్పటి నుంచి అకస్మాత్తుగా మీరు వరుసగా ట్రోఫీలు సాధిస్తున్నారు. అవునో.. కాదో మీరే లెక్కలు కట్టేయండి.ఏదేమైనా ఆర్సీబీ ఒక అసామాన్యమైన జట్టు. ఆటగాళ్లు, సహాయ సిబ్బంది.. అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా జట్టును తమ సొంతంగా భావించే అభిమానులకు కంగ్రాట్స్. ఈ ఫ్రాంఛైజీ భావోద్వేగాలకు నిలయం.అత్యంత ప్రత్యేకంఆర్సీబీ అంటే ఫ్యాన్స్‌కు ఒక రకంగా పిచ్చి. ఎన్నో ఏళ్లుగా ట్రోఫీ గెలుస్తామనే నమ్మకంతో వారు జట్టుకు అండగా నిలిచారు. ఇప్పుడిలా వరుసగా రెండుసార్లు చాంపియన్‌గా నిలవడం నిజంగా అత్యంత ప్రత్యేకం’’ అని పీవీ సింధు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆర్సీబీకి శుభాకాంక్షలు తెలిపారు.అయితే, ఫైనల్లో చాలా మంది మాదిరే తానూ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ పోరును చూడాలనుకున్నానన్న సింధు.. బెంగళూరు ఈ విజయానికి వందశాతం అర్హమైందని పేర్కొన్నారు. కాగా ఐపీఎల్లో వరుసగా రెండుసార్లు టైటిల్ సాధించిన కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోని (చెన్నై సూపర్ కింగ్స్), రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్) సరసన రజత్ పాటిదార్ నిలిచాడు. ఈ నేపథ్యంలో అతడిపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.చదవండి: అతడేమీ రోబో కాదు.. బీసీసీఐ తప్పు చేస్తోందా? -
అతడిని వన్‌డౌన్‌లో ఆడిస్తారా?: ఇంగ్లండ్ దిగ్గజం ఫైర్
ఐపీఎల్-2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ అనుసరించిన వ్యూహాలపై ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ మండిపడ్డాడు. అసలు గుజరాత్ నాయకత్వ బృందం ఆలోచన ఏమిటో తనకు అర్థం కాలేదన్నాడు.జోస్ బట్లర్‌ను కాదని నిశాంత్ సింధును వన్‌డౌన్‌లో ఎలా ఆడిస్తారని బ్రాడ్ ప్రశ్నించాడు. అహ్మదాబాద్‌లో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో గుజరాత్ ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.ఈ క్రమంలో బెంగళూరు వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడగా.. గుజరాత్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. కాగా ఆర్సీబీతో ఫైనల్ సందర్భంగా గుజరాత్ తమ టాపార్డర్‌ను మార్చిన సంగతి తెలిసిందే.ఆదిలోనే షాక్ఓపెనర్లుగా సాయి సుదర్శన్, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కొనసాగగా.. వన్‌డౌన్‌లో మాత్రం బట్లర్‌ను కాదని నిశాంత్ సింధును ఆడించారు. అయితే, సీజన్ ఆసాంతం ఆకట్టుకున్న సాయి ఫైనల్లో 12, గిల్ 10 పరుగులే చేయడంతో గుజరాత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది.ఇలాంటి తరుణంలో అన్క్యాప్డ్ నిశాంత్ సింధు మూడో స్థానంలో వచ్చి 18 బంతుల్లో 20 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ నాలుగో నంబర్ బ్యాటర్‌గా బరిలోకి దిగి 23 బంతుల్లో 19 పరుగులే చేసి నిష్క్రమించాడు.ఈ నేపథ్యంలో స్టువర్ట్ బ్రాడ్ గుజరాత్ జట్టు యాజమాన్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ.. ‘‘ఈ టోర్నీ ఆసాంత బట్లర్ మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు. కానీ ఫైనల్లో అనూహ్య రీతిలో అతడిని నాలుగో స్థానానికి మార్చారు.నాకైతే అర్థం కావడం లేదుఅసలు ఫైనల్లో.. అది కూడా ముందుగా బ్యాటింగ్ చేస్తూ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఏబీ డివిలియర్స్ సైతం దీనిని ఆత్మరక్షణ ధోరణిగానే అభివర్ణించాడు.ఇక ఈ సీజన్లో ఓపెనర్లు గిల్, సాయి చెరో 700కు పైగా పరుగులు సాధించారు. ఓపెనర్లు ఇంత నిలకడగా రాణించడం మంచిదే. అదే సమయంలో ఇలాంటి ప్రదర్శనల వల్ల మిడిలార్డర్‌ను పరీక్షించేందుకు వీలుకాదు. ఇద్దరు ఓపెనర్లు విఫలం కాగానే..ఒత్తిడిలో వారు ఎలా రాణిస్తారో తెలియదు. టైటిల్ పోరులో ఇద్దరు ఓపెనర్లు విఫలం కాగానే.. మిగతా వాళ్లు కూడా పెవిలియన్‌కు క్యూ కట్టేశారు’’ అని స్టువర్ట్ బ్రాడ్ విమర్శించాడు.బహుశా అందుకేనేమో!ఇక ఇదే షోలో ఇంగ్లండ్ మరో మాజీ ఆటగాడు స్టీవెన్ ఫిన్‌స్పందిస్తూ.. ‘‘ఇంగ్లండ్ తరఫున చాలా ఏళ్ల పాటు ఓపెనర్‌గా ఆడిన అనుభవం బట్లర్‌కు ఉంది. అలాంటిది అతడిని డిమోట్ చేయడం ఆశ్చర్యకరంగా అనిపించింది.అయితే, పాత బడుతున్న కొద్దీ వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని గుజరాత్ నాయకత్వ బృందం భావించి ఉంటుంది. కాసేపు నిశాంత్ స్టాండింగ్ ఇస్తే బట్లర్ కుదురుకోగలడని అంచనా వేసి ఉంటుంది. కానీ అదేమీ జరుగలేదు’’ అని పేర్కొన్నాడు.కాగా గుజరాత్ టాపార్డర్ కుదేలు కాగా.. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ అజేయ అర్ధ శతకం (50)తో రాణించాడు. ఫలితంగా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయగలిగింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఆర్సీబీ 18 ఓవర్లలో పూర్తి చేసి టైటిల్ విజేతగా నిలిచింది.చదవండి: ఈ ఐదుగురు తమ చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడేశారు?! -
‘కడుపున పుట్టిన పిల్లల్లాగే.. అప్పుడే సగం గెలిచేశాము’
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కడుపున పుట్టిన సంతానంలో ఎవరు ప్రత్యేకమో చెప్పడం కష్టమని.. ఐపీఎల్ ట్రోఫీల విషయంలోనూ తాను ఇదే మాట చెబుతానన్నాడు. ఈ ట్రోఫీలు కూడా తన సొంత పిల్లల్లాంటివే అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు.కాగా గతేడాది ఆర్సీబీ తరఫున 109 పరుగులు చేసిన కృనాల్ పాండ్యా.. 17 వికెట్లతో సత్తా చాటాడు. తద్వారా ఆర్సీబీ తొలి టైటిల్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక ఐపీఎల్-2026లోనూ కృనాల్ అదరగొట్టాడు.ఐదుసార్లుఈసారి 226 పరుగులు చేసిన కృనాల్.. 14 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఆర్సీబీ వరుసగా రెండోసారి ట్రోఫీ గెలవడంలో కీలకంగా మారాడు. ఈ క్రమంలో ఐదుసార్లు ఐపీఎల్ నెగ్గిన జట్టులో సభ్యుడిగా కృనాల్ నిలిచాడు. ముంబై ఇండియన్స్ తరఫున 2017, 2019, 2020లలో టైటిల్ గెలిచిన ఈ బరోడా ఆల్‌రౌండర్... ప్రస్తుతం ఆర్సీబీతో ప్రయాణం కొనసాగిస్తూ.. 2025, 2026లలో విజేతగా నిలిచిన జట్లలో సభ్యుడిగా ఉన్నాడు.కడుపున పుట్టిన పిల్లల్లాంటివే..ఈ నేపథ్యంలో ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌పై విజయానంతరం కృనాల్ పాండ్యా మాట్లాడుతూ.. ‘‘ప్రతీ ఐపీఎల్ ట్రోఫీ దేనికదే ప్రత్యేకం. ఇది కూడా పిల్లల్ని కలిగి ఉండటం లాంటిదే. కడుపున పుట్టిన పిల్లల్లో ఎవరు ప్రత్యేకమో చెప్పలేము.అలాగే ఈ ట్రోఫీల విషయంలోనూ నేనేమీ చెప్పలేను. ఎంతో కష్టపడితే గానీ ట్రోఫీని ముద్దాడలేము. పదకొండేళ్ల వ్యవధిలో ఐదు ట్రోఫీలు గెలవడం నిజంగా నాకెంతో ప్రత్యేకం’’ అని తెలిపాడు.వేలం సమయంలోనే సగం గెలిచేశాముఇక తొలి టైటిల్ కోసం పద్దెనిమిదేళ్లు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన ఆర్సీబీ.. వరుసగా రెండోసారి విజేతగా నిలవడం పట్ల కృనాల్ స్పందించాడు. ‘‘నిజానికి గతేడాది వేలానికి ముందే మేము ఎంతగానో చర్చించాము.సమతుల్యమైన జట్టును తయారు చేసుకున్నాము. వేలం సమయంలోనే మేము సగం టోర్నీ గెలిచేశామని చెప్పవచ్చు. పద్దెనిమిదేళ్ల ఎదురుచూపుల తర్వాత ఇలా వరుసగా ట్రోఫీలు సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఆర్సీబీ అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. మ్యాచ్ ఎక్కడైనా సరే.. అక్కడ మాకు అభిమానులు ఉంటారు. ఇదొక అద్వితీయమైన అనుభూతి’’ అని కృనాల్ పాండ్యా చెప్పుకొచ్చాడు.Celebration rukenge nahi ft. Krunal Pandya. 🕺🤭😂 pic.twitter.com/s6RgvHdxaR— Royal Challengers Bengaluru (@RCBTweets) May 31, 2026కృనాల్‌తో పాటు వీళ్లు కూడాఆర్సీబీ వరుస రెండు టైటిల్ విజయాల్లో 13 మంది భాగంగా ఉన్నారు. కెప్టెన్ రజత్ పాటీదార్, దిగ్గజ ఓపెనర్ విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, స్వప్నిల్, కృనాల్ పాండ్యా, రొమారియో షెఫర్డ్, జోష్ హాజల్‌వుడ్, రసిఖ్ సలామ్, భువనేశ్వర్ కుమార్, సుయాశ్ శర్మ, అభినందన్‌కి ఇది రెండో ట్రోఫీ. మరో 10 మంది దేవ్‌దత్ పడిక్కల్, కాక్స్, బెతెల్, వెంకటేశ్, సాత్విక్, మంగేశ్, విక్కీ ఒస్వాల్, విహాన్ మల్హోత్రా, కనిష్క్ చౌహాన్, డఫీలకు తొలిసారి గెలుపు ఆనందం దక్కింది. చదవండి: IPL 2026: వైభవ్ తగ్గేదేలే.. ఎవరికెంత ప్రైజ్‌మనీ? -
రెండో టైటిల్.. ఆర్సీబీ సాధించిన రికార్డులు ఇవే
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీ నెగ్గింది. ఐపీఎల్-2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. అహ్మదాబాద్‌లో ఆదివారం టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.టాపార్డర్‌ను కుదేలు చేసి ఆదిలోనే ప్రత్యర్థిని దెబ్బకొట్టిన ఆర్సీబీ.. గుజరాత్‌ను 155 పరుగులకే పరిమితం చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగి రెండు ఓవర్లు మిగిలి ఉండగానే పనిపూర్తి చేసింది. తద్వారా ఏకపక్ష విజయం సాధించి.. తమ స్థాయి ఏమిటో మరోసారి నిరూపించుకుంది. ఈ క్రమంలో ఆర్సీబీ తమ పేరిట పలు రికార్డులు లిఖించుకుంది. అవేమిటంటే..ఆర్సీబీ సాధించిన రికార్డులు ఇవే👉ఐపీఎల్ టోర్నీ టైటిల్‌ను వరుసగా రెండేళ్లు గెల్చుకున్న మూడో జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ (2010, 2011లో), ముంబై ఇండియన్స్ (2019, 2020లో) మాత్రమే ఈ ఘనత సాధించాయి.👉ఐపీఎల్లో 2011లో ‘ప్లే ఆఫ్స్’ ఫార్మాట్ మొదలయ్యాక ఇప్పటి వరకు ‘ప్లే ఆఫ్స్’లోని క్వాలిఫయర్–1 మ్యాచ్‌లో గెలిచిన జట్టే విజేతగా నిలువడం ఇది 13వసారి కావడం విశేషం. చెన్నై (2011, 2018, 2021, 2023లో), కోల్‌కతా (2012, 2014, 2024లో), ముంబై (2015, 2019, 2020లో), బెంగళూరు (2025, 2026), గుజరాత్ టైటాన్స్ (2022లో) జట్లు ఈ ఘనత సాధించాయి. 👉చెన్నై (5 సార్లు), ముంబై (5 సార్లు), కోల్‌కతా (3 సార్లు) జట్ల తర్వాత ఐపీఎల్ టోర్నీ టైటిల్‌ను రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు గెలిచిన నాలుగో జట్టుగా బెంగళూరు నిలిచింది.దిగ్గజాల సరసన రజత్ పాటీదార్👉ఐపీఎల్ టైటిల్‌ను రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు గెలిచిన నాలుగో కెప్టెన్ రజత్ పాటీదార్. గతేడాది (2025) పాటీదార్ సారథ్యంలోనే బెంగళూరు తొలిసారి ఐపీఎల్ టైటిల్ నెగ్గింది. ఈ జాబితాలో ధోని, రోహిత్ శర్మ (5 సార్లు చొప్పున), గౌతమ్ గంభీర్ (2 సార్లు) ఉన్నారు.👉ఒకే వేదికపై రెండుసార్లు ఐపీఎల్ టైటిల్ సాధించిన మూడో జట్టు బెంగళూరు. 2025లోనూ అహ్మదాబాద్‌లోనే బెంగళూరు టైటిల్ నెగ్గింది. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ (కోల్‌కతా, ఈడెన్‌గార్డెన్స్; 2013, 2015లో; హైదరాబాద్, ఉప్పల్ స్టేడియం; 2017, 2019లో), కోల్‌కతా నైట్‌రైడర్స్ (చెన్నై, ఎంఎ చిదంబరం స్టేడియం; 2012, 2024లో) ఉన్నాయి.చదవండి: వైభవ్ గురించి కోహ్లి ఏమన్నాడంటే!Moments that became memories. Memories that became history. 🏆🎥 Reliving the defining moments of @RCBTweets going back-2️⃣-back in Ahmedabad ❤️#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/mHL9U36rB1— IndianPremierLeague (@IPL) June 1, 2026 -
అప్పుడు బీసీసీఐ నిషేధం!.. ఇప్పుడీ కుర్రాడికి ‘సలామ్’ కొట్టాల్సిందే!
‘ఈ సాలా కప్ నమ్దూ’ అంటూ పద్దెనిమిదేళ్లుగా ఎదురుచూసిన అభిమానుల కలను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గతేడాది నిజం చేసింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. అయితే, అంతటితో ఆర్సీబీ ఆకలి తీరలేదు.ఆత్మ విశ్వాసంతో ఐపీఎల్-2026లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి అద్భుత ప్రదర్శనతో మరోసారి టైటిల్ విజేతగా అవతరించింది. అహ్మదాబాద్‌లో ఆదివారం నాటి ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి వరుసగా రెండోసారి ట్రోఫీ గెలిచి.. ‘ఈ సాలనూ కప్ నమ్దూ’ (ఈసారీ కప్పు మనదే) అంటూ విజిల్స్ వేయించింది.చివరి నిమిషంలో సువర్ణావకాశంనిజానికి ఆర్సీబీ అ‘ద్వితీయ’విజయంలో పేస్ బౌలింగ్ దళానిదే కీలక పాత్ర. టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (28 వికెట్లు), ఆస్ట్రేలియా స్టార్ జోష్ హాజిల్‌వుడ్ (15 వికెట్లు) ముందుండి నడిపించగా... మరో భారత కుర్రాడి పాత్ర కూడా మరువలేనిది. గతేడాది సత్తా చాటినా.. వివాదం కారణంగా చివరి నిమిషంలో యశ్ దయాళ్ దూరం కావడంతో మూడో పేసర్‌గా సత్తా చాటాల్సిన స్థితిలో తనకు లభించిన అవకాశాన్ని అతడు సమర్థంగా వినియోగించుకున్నాడు.అతడు మరెవరో కాదు జమ్ము కశ్మీర్‌కు చెందిన 26 ఏళ్ల రసిఖ్ సలామ్. ఈ సీజన్లో 19 వికెట్లతో రాణించి.. తన కెరీర్లోనే చిరస్మరణీయ విజయంలో భాగమయ్యాడు. అనూహ్య మలుపులతో సాగిన కెరీర్లో అతడు ఇక్కడి వరకు రాగలిగాడు.రెండేళ్ల నిషేధం విధించిన బీసీసీఐ!ఐపీఎల్లో 2019లో తొలిసారి ముంబై ఇండియన్స్ తరఫున ఒకే ఒక మ్యాచ్ ఆడి సలామ్ అరంగేట్రం చేశాడు. కొద్ది రోజుల్లోనే ‘తప్పుడు వయసు’ను చూపించిన కారణంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అతడిపై రెండేళ్ల నిషేధం విధించింది. దీంతో 2020 అండర్–19 వరల్డ్ కప్ ఆడే అవకాశం కోల్పోయాడు సలామ.ముంబై అండతో..అయితే ముంబై ఇండియన్స్ అండగా నిలిచి అన్ని సౌకర్యాలతో తమ ప్రైవేట్ క్లబ్లో అతడికి రెండేళ్ల పాటు ప్రాక్టీస్ చేసే అవకాశాన్ని కల్పించింది. ఈ క్రమంలో 2022లో మళ్లీ ఐపీఎల్ అవకాశం దక్కగా కేకేఆర్ 2 మ్యాచ్‌లే ఆడించింది. ఇక 2023లో సలామ్ గాయంతో ఆటకు దూరమయ్యాడు. కారు ప్రమాదం నుంచి కోలుకొని జాతీయ క్రికెట్ అకాడమీలో సాధన చేస్తున్న రిషభ్ పంత్... సలామ్ బౌలింగ్ పదును చూసి ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లో అవకాశం కల్పించాడు.రసిఖ్ అంటే ‘నిలకడ’ అలా 2024లో 8 మ్యాచ్‌లు ఆడే చాన్స్ లభించడంతో సలామ్ ఆకట్టుకున్నాడు. ఇక గతేడాది ఆర్సీబీ రూ.6 కోట్లకు అతడిని తీసుకున్నప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలో రెండు మ్యాచ్‌లలోనే అవకాశం దక్కింది కానీ జట్టు అతడిలో మంచి భవిష్యత్తును చూసింది. దాని ఫలితం ఈ సారి కనిపించింది. కశ్మీరీ భాషలో రసిఖ్ అంటే ‘నిలకడ’ అని అర్థం.ఈసారి 12 మ్యాచ్‌లలో నిలకడగా రాణించిన సలామ్ కీలక సమయాల్లో వికెట్లు తీసి జట్టు నమ్మకాన్ని నిలబెట్టి.. జట్టులో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో ఫైనల్లో సీనియర్లు భువీ, హాజిల్‌వుడ్ కంటే.. సలామ్ మంచి ఎకానమీతో బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 27 పరుగులే ఇచ్చి.. నిశాంత్ సింధు (20), రాహుల్ తెవాటియా (7), రషీద్ ఖాన్ (7) రూపంలో మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. Moments that became memories. Memories that became history. 🏆🎥 Reliving the defining moments of @RCBTweets going back-2️⃣-back in Ahmedabad ❤️#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/mHL9U36rB1— IndianPremierLeague (@IPL) June 1, 2026చదవండి: వైభవ్ తగ్గేదేలే!.. ఎవరికెంత ప్రైజ్ మనీ అంటే?! -
IPL 2026: వైభవ్ తగ్గేదేలే!.. ఎవరికెంత ప్రైజ్ మనీ?
ఐపీఎల్-2026 టోర్నీ ఆదివారంతో ముగిసింది. అహ్మదాబాద్ వేదికగా టైటిల్ పోరులో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజేతగా అవతరించింది. తద్వారా వరుసగా రెండోసారి ట్రోఫీ సాధించి సంబరాల్లో మునిగిపోయింది. తొలి టైటిల్ కోసం పద్దెనిమిదేళ్లు ఎదురుచూసిన ఆర్సీబీ గతేడాది ఫైనల్లో.. పంజాబ్ కింగ్స్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అదే జోరు కొనసాగిస్తూ తాజా ఎడిషన్‌లోనూ జయభేరి మోగించింది.Moments that became memories. Memories that became history. 🏆🎥 Reliving the defining moments of @RCBTweets going back-2️⃣-back in Ahmedabad ❤️#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/mHL9U36rB1— IndianPremierLeague (@IPL) June 1, 2026ఇక ఐపీఎల్ తాజా సీజన్లో చాంపియన్ ఆర్సీబీ, రన్నరప్ గుజరాత్ ప్రైజ్ మనీలతో పాటు.. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ తదితర అవార్డులు గెలిచిన ప్లేయర్లు, వారికి దక్కిన మొత్తం ఎంతో తెలుసుకుందామా?!ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు) వైభవ్ సూర్యవంశీ (రాజస్తాన్) 👉మ్యాచ్‌లు: 16; పరుగులు: 776 👉ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలుపర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు) కగిసో రబాడ (గుజరాత్) 👉మ్యాచ్‌లు: 17; వికెట్లు: 29 👉ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు ఎమర్జింగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ👉ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ👉ప్రైజ్‌మనీ: రూ. 15 లక్షలు సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ద సీజన్’ వైభవ్ సూర్యవంశీ👉స్ట్రయిక్ రేట్: 237.30 👉ప్రైజ్‌మనీ: టాటా కార్ ‘బెస్ట్ క్యాచ్’ ఆఫ్ ద టోర్నీ మనీశ్ పాండే (కోల్‌కతా)👉ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు‘ఫెయిర్ ప్లే’ అవార్డుపంజాబ్ కింగ్స్ అత్యధిక సిక్స్లువైభవ్ (72 సిక్స్‌లు) 👉ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు అత్యధిక ఫోర్లుసాయి సుదర్శన్ (75 ఫోర్లు)👉ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు ‘గ్రీన్ డాట్‌బాల్స్ ఆఫ్ ద సీజన్’ సిరాజ్ (గుజరాత్) 👉మొత్తం 172 డాట్ బాల్స్ 👉ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలుటైటిల్ విజేతకు ఎంతంటే?ఐపీఎల్ 19వ సీజన్ విజేతగా నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు రూ. 20 కోట్లు లభించాయి. రన్నరప్ గుజరాత్ టైటాన్స్‌కు రూ. 12.50 కోట్లు దక్కాయి.వైభవ్‌దే హవారాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు ఈ సీజన్లో మొత్తం దాదాపుగా రూ. 55 లక్షల ప్రైజ్‌మనీ గెలిచాడు. ఓ టాటా కారు కూడా అతడి సొంతమైంది.చదవండి: రజతాభిషేకం -
కలలో కూడా ఊహించలేదు.. రాసి పెట్టి ఉంది: రజత్ పాటిదార్
19 ఎడిషన్ల ఐపీఎల్ చరిత్రలో తొలి 17 ఎడిషన్లు టైటిల్ కోసం ముఖం వాచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ.. ఇప్పుడు వరుసగా రెండో ఎడిషన్‌లో టైటిల్ సాధించి కరువు తీర్చుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిన్న (మే 31) జరిగిన 2026 ఎడిషన్ ఫైనల్లో ఆ జట్టు గుజరాత్ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొంది, టైటిల్‌ను నిలబెట్టుకుంది.ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆర్సీబీకి ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. సీజన్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన ఆ జట్టు టాపార్డర్, బౌలింగ్ విభాగాలు తుది సమరంలో చేతులెత్తేశాయి. తొలుత బ్యాటింగ్‌లో సాధారణ స్కోర్‌కు (155-8) పరిమితమైన గుజరాత్.. ఆతర్వాత దాన్ని కాపాడుకోవడంలో దారుణంగా విఫలమైంది. విరాట్ కోహ్లి (75 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు.ఈ సీజన్ ప్రారంభం నుంచి గుజరాత్ విజయాల్లో ప్రధానపాత్ర పోషించిన బౌలర్లు, ఆఖరి మెట్టుపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. 9వ ఓవర్లో రషీద్ ఖాన్ రెండు వికెట్లు (రజత్, కృనాల్) తీయడం మినహాయించి, ఏ దశలోనూ బౌలర్లు ప్రభావం చూపించలేకపోయారు. కాస్త పొదుపుగా బౌలింగ్ చేయగలిగినా, స్కోర్ మరీ చిన్నది కావడంతో కాపాడుకోలేకపోయారు.ఈ మ్యాచ్ అనంతరం విన్నింగ్ కెప్టెన్ రజత్ పాటిదార్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. వరుసగా రెండో ఏడాది టైటిల్ సాధించడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ట్రోఫీని అందుకున్న తర్వాత మాట్లాడుతూ..ఆర్సీబీకి కెప్టెన్‌గా వ్యవహరించి వరుసగా రెండు టైటిళ్లు గెలిపిస్తానని కలలో కూడా ఊహించలేదన్నాడు. టాస్ గెలిస్తే ఛేజ్ చేయడమే తమ ప్రణాళిక అని, పవర్‌ప్లేలోనే గుజరాత్ టాప్-3 బ్యాటర్లను ఔట్ చేయాలని ముందుగానే వ్యూహం సిద్ధం చేసుకున్నామని తెలిపాడు. ఆ ప్లాన్‌ను బౌలర్లు అద్భుతంగా అమలు చేశారని ప్రశంసించాడు.భువీ, హాజిల్‌వుడ్, రసిక్, కృనాల్, సుయాశ్ సీజన్ మొత్తం అద్భుతంగా రాణించారని కొనియాడాడు. గతేడాది తొలి టైటిల్ గెలవాలనే ఒత్తిడి ఎక్కువగా ఉండేదని, ఈసారి మాత్రం జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిందని చెప్పుకొచ్చాడు. సీజన్ ప్రారంభం నుంచి మంచి క్రికెట్ ఆడటమే తమకు ధైర్యాన్ని ఇచ్చిందన్నాడు.తన బ్యాటింగ్‌లో మెరుగుదల కోసం టోర్నీకి ముందు ప్రత్యేకంగా శ్రమించానని, వేగవంతమైన బౌలర్లపై కొన్ని షాట్లను మెరుగుపర్చుకునేందుకు కృషి చేశానని తెలిపాడు. ఈ క్రమంలో దినేశ్ కార్తీక్, విరాట్ కోహ్లి సహా పలువురు సీనియర్ల నుంచి విలువైన సూచనలు అందాయని చెప్పాడు.కోహ్లీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ.. మైదానంలోనూ, బయటా జట్టు కోసమే ఆలోచిస్తాడు. ముఖ్యంగా కొత్త ఆటగాళ్ల వద్దకు తానే వెళ్లి మాట్లాడతాడు. వారికి ధైర్యం ఇస్తాడు. జట్టుకు అతను గొప్ప బలమని కొనియాడాడు.చివరగా అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ "ఈసారి కూడా కప్ మనదే (Ee Sala Nu Cup Namdu) అంటూ అభిమానులకు ట్రోఫీని అంకితం చేశాడు. -
ఫైనల్లో ఓటమి అనంతరం గిల్ విశ్లేషణ
నిన్న (మే 31) జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్లో ఆర్సీబీ చేతిలో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఆర్సీబీకి ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. తొలుత బ్యాటింగ్‌లో సాధారణ స్కోర్‌కు (155-8) పరిమితమై, ఆతర్వాత దాన్ని కాపాడుకోవడంలో దారుణంగా విఫలమైంది. విరాట్ కోహ్లి (75 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు.సీజన్ ఆధ్యాంతం గుజరాత్ విజయాల్లో ప్రధానపాత్ర పోషించిన బౌలర్లు తుది సమరంలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. 9వ ఓవర్లో రషీద్ ఖాన్ రెండు వికెట్లు (రజత్, కృనాల్) తీయడం మినహా, మిగతా బౌలర్లు చేసిందేమీ లేదు. కాస్త పొదుపుగా బౌలింగ్ చేయగలిగినా, స్కోర్ మరీ చిన్నది కావడంతో కాపాడుకోలేకపోయారు. మ్యాచ్ అనంతరం గుజరాత్ సారధి శుభ్‌మన్ గిల్ విశ్లేషణ ఇలా ఉంది. "180-190 పరుగులు చేసుంటే, మ్యాచ్ మరింత పోటీగా ఉండేది. పిచ్ పూర్తిగా స్లోగా లేదు. ఆరంభ ఓవర్లలో మాత్రం పేసర్లకు కొంత సహకారం లభించింది.ఆదిలోనే వికెట్లు కోల్పోవడం జట్టు మోమెంటంను దెబ్బతీసింది. మధ్య ఓవర్లలో వేగంగా పరుగులు చేయలేకపోవడం కష్టాలను అధికం చేసింది. ఫైనల్ మ్యాచ్ కావడంతో 150-160 పరుగులు చేసినా, పవర్‌ప్లేలో రెండు-మూడు వికెట్లు తీసుంటే పోటీలో ఉండేవాళ్లం.టార్గెట్‌ను కాపాడుకునే క్రమంలో పవర్‌ప్లేలో 15-20 పరుగులు ఎక్కువగా ఇచ్చేశాము. ఆ దశలో ప్రత్యర్థిని 50-55 పరుగులకు కట్టడి చేసి ఉంటే మ్యాచ్ మరోలా ఉండేది.సీజన్ మొత్తాన్ని పరిశీలిస్తే, మా బౌలింగ్ యూనిట్ అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా నిలిచింది. తొలి రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన తర్వాత కూడా జట్టు వెనక్కి తగ్గకుండా, చిన్నచిన్న అంశాల్లో మెరుగుపడుతూ బలంగా తిరిగి వచ్చింది.తుది మెట్టుపై ట్రోఫీ చేజారినా ఈ సీజన్ చాలా సంతృప్తినిచ్చింది. గెలిచినా, ఓడినా మెరుగుపర్చుకోవాల్సిన అంశాలు ఎప్పుడూ ఉంటాయి. జట్టుగా ఇంకా అభివృద్ధి చెందాల్సిన అంశాలపై దృష్టి పెడతాము" -
రాయల్ ఛాలెంజర్స్ రాజసం.. ఫైనల్లో దుమ్మురేపిన బెంగళూరు (ఫొటోలు)
-
‘భారత టీ20 జట్టుకు ఎంపికయ్యే ఆలోచనే లేదు’
ఐపీఎల్ ట్రోఫీ కోసం కళ్లు కాచేలా పద్దెనిమిదేళ్లు ఎదురుచూసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు గతేడాది తమ చిరకాల కోరికను నెరవేర్చుకుంది. టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి సారథ్యంలో సాధ్యం కాని ఈ ఫీట్‌ను.. రజత్ పాటిదార్ కెప్టెన్‌గా అరంగేట్రంలోనే సాధించాడు.ఏమాత్రం అంచనాలు లేకుండాతద్వారా ఆర్సీబీ అభిమానులకు మరింత ఇష్టమైన ఆటగాడిగా మారిపోయాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి ఈ మేరకు అరుదైన విజయం అందుకున్న పాటిదార్.. ఐపీఎల్-2026లోనూ ఆర్సీబీని అద్భుత రీతిలో ముందుకు నడిపించాడు. ఇటు బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా సత్తా చాటి జట్టును ఫైనల్‌కు చేర్చాడు.మెరుపులు మెరిపించిముఖ్యంగా గుజరాత్ టైటాన్స్‌తో ఫైనల్లో ఈ నాలుగో నంబర్ బ్యాటర్ దుమ్ములేపాడు. కేవలం 33 బంతుల్లోనే 5 ఫోర్లు, 9 సిక్సర్లు బాది 93 పరుగులతో అజేయంగా నిలిచాడు. తద్వారా ఈ సీజన్లో తన అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేయడంతో పాటు.. జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.ఇప్పటి వరకు ఈ సీజన్లో పద్నాలుగు మ్యాచ్‌లలో కలిపి పాటిదార్ 486 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో త్వరలోనే అతడు టీమిండియా తరఫున టీ20లలో అరంగేట్రం చేయడం ఖాయమని.. కెప్టెన్ రేసులోనూ ముందుంటాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ విషయంపై రజత్ పాటిదార్ తాజాగా స్పందించాడు. గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం నాటి ఫైనల్‌కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్ను నేనెప్పుడూ టీమిండియా టీ20 కెప్టెన్ కావాలని ఊహించుకోలేదు. అసలు ఇపుడు భారత టీ20 జట్టుకు ఎంపిక కావాలనే ఆలోచనే నా మదిలో లేదు.భారత టీ20 జట్టుకు ఎంపికయ్యే ఆలోచనే లేదునా దృష్టి మొత్తం ఐపీఎల్-2026 సీజన్ మీదే ఉంది. ప్రతి కెప్టెన్ ట్రోఫీ గెలవాలని కోరుకుంటాడు. నేను కూడా అంతే. గతేడాది మేము టైటిల్ సాధించాము. అక్కడితో ఆ ప్రయాణం ముగిసింది.తాజా ఎడిషన్‌లో సరికొత్తగా ముందుకు వచ్చాము. 2025లో ఏం జరిగిందన్న విషయం గురించే మాట్లాడుతూ కూర్చుంటే పనులు ముందుకు సాగవు. ప్రస్తుత సీజన్లో ఒక్కో మ్యాచ్ గెలవడమే లక్ష్యంగా ఇక్కడిదాకా చేరుకున్నాము.అదంతా నాకు అనవసరంగతంలో ఆర్సీబీ కెప్టెన్లు ఏం చేశారో నాకు అనవసరం. భవిష్యత్తులో కెప్టెన్ అయ్యేవారు ఏం చేస్తారన్న అంశంతోనూ నాకు పనిలేదు. సారథిగా నేనేం చేయగలను అన్నదే ముఖ్యం. వ్యక్తిగతంగా నా కెరీర్లో ఎన్నో ఎత్తుపళ్లాలు ఉన్నాయి. అయితే, ఎవరినీ నాకు పోటీగా భావించను. నా పనిని పూర్తి చేయడంపైనే నా దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది. మేము డిఫెండింగ్ చాంపియన్లమనే గర్వం మాకు లేదు. మా జట్టు ఈసారి కూడా ట్రోఫీ కోసం అదే స్థాయిలో కృషి చేస్తోంది. మా ఆకలి తీరలేదు’’ అని రజత్ పాటిదార్ పేర్కొన్నాడు.చదవండి: కెప్టెన్ రేసు.. ముగ్గురిని ఎంపిక చేసిన బీసీసీఐ? -
‘అతడు మూడు ఓవర్లు వేశాడంటే ఆర్సీబీ ఓటమి ఖాయం’
డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఈసారీ కప్పు కొట్టాలని పట్టుదలగా ఉంది. ఐపీఎల్-2026 సీజన్ ఆది నుంచి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న పాటిదార్ సేన.. టేబుల్ టాపర్‌గా, తొలి ఫైనలిస్టుగా నిలిచింది.ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం నాటి టైటిల్ పోరుకూ పూర్తిస్థాయిలో సన్నద్ధమైన ఆర్సీబీ.. ఆఖరి గండాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని ఉవ్విళ్లూరుతోంది. కాగా తాజా ఎడిషన్‌లోనూ ఆర్సీబీ బౌలింగ్ దళం అదరగొడుతున్న సంగతి తెలిసిందే.పటిష్టంగా పేస్ దళంటీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఇప్పటికి 26 వికెట్లతో సత్తా చాటగా.. యువ ఆటగాడు రసిఖ్ దర్ సైతం 16 వికెట్లు కూల్చాడు. మిగిలిన వారిలో కృనాల్ పాండ్యా, జట్టుతో ఆలస్యంగా చేరిన జోష్ హాజిల్‌వుడ్ చెరో 13 వికెట్లతో ఉన్నారు. వీరికి తోడుగా సూయశ్ శర్మ (9), జేకబ్ డఫీ (9) కూడా రాణిస్తున్నారు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ బెంగళూరు జట్టు నాయకత్వ బృందానికి కీలక సూచన చేశాడు. గుజరాత్‌తో ఫైనల్లో రొమారియో షెఫర్డ్ చేతికి మాత్రం బంతిని ఇవ్వొద్దని సూచించాడు. అదే విధంగా ఫిల్ సాల్ట్ తిరిగి వచ్చినా వెంకటేశ్ అయ్యర్‌నే ఓపెనర్‌గా కొనసాగించాలని చిక్కా పేర్కొన్నాడు.అతడినే ఓపెనర్‌గా కొనసాగించాలిఈ మేరకు.. ‘‘ఫిల్ సాల్ట్ పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించాడా? లేదా? అన్న అంశంపై స్పష్టత లేదు. ఒకవేళ అతడు ఫిట్‌గా ఉన్నా వెంకటేశ్ అయ్యర్ బాగా ఆడుతున్నాడు కాబట్టి అతడినే ఓపెనర్‌గా కొనసాగిస్తే మంచిది.అతడు 3 ఓవర్లు వేశాంటే ఆర్సీబీ ఖేల్ ఖతమేఇక బౌలింగ్ విషయానికొస్తే... ఒకవేళ రొమారియో షెఫర్డ్‌తో కనీసం మూడు ఓవర్లు బౌలింగ్ చేయించినా సరే ఆర్సీబీ ఓడిపోవడం లాంఛనమే. అతడు కచ్చితంగా మూడు ఓవర్లు వేశాంటే ఆర్సీబీ ఖేల్ ఖతమే.PC: BCCIషెఫర్డ్ చేతికి అస్సలు బంతిని ఇవ్వకండి. నన్నడిగితే అతడికి తుదిజట్టులో కూడా చోటు ఇవ్వకండి’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. కాగా వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రొమారియో షెఫర్డ్ గతేడాది కప్పు గెలిచిన ఆర్సీబీ జట్టులో సభ్యుడు.పేలవ ప్రదర్శనఈ క్రమంలో తాజా ఎడిషన్‌కు కూడా ఆర్సీబీ షెఫర్డ్‌ను అట్టిపెట్టుకుంది. ఇక ఈ సీజన్లో అతడు.. ఇప్పటికి 14 మ్యాచ్‌లలో కలిపి సగటు 42, ఎకానమీ 12తో చెత్తగా బౌలింగ్ చేసి.. ఏడు వికెట్లు తీయగలిగాడు. ఇక బ్యాటర్‌గా 14 మ్యాచ్‌లలో కలిపి కేవలం 83 పరుగులే రాబట్టాడు. చివరగా గుజరాత్‌తో క్వాలిఫయర్-1లో షెఫర్డ్ ఒక ఓవర్ వేసి 15 పరుగులు ఇచ్చుకున్నాడు.ఐపీఎల్-2026 ఫైనల్.. ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ తుది జట్లు (అంచనా) ఆర్సీబీ: రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్/ వెంకటేశ్ అయ్యర్, దేవ్‌దత్ పడిక్కల్, కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, జితేశ్ శర్మ, రొమారియో షెఫర్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, రసిఖ్ దర్, జేకబ్ డఫీ/ సుయశ్ శర్మ గుజరాత్: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, నిశాంత్ సంధు, జేసన్ హోల్డర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, సాయికిషోర్. చదవండి: కెప్టెన్ రేసు.. ఆ ముగ్గురిని ఎంపిక చేసిన బీసీసీఐ! -
వైభవ్‌కు మరో భారీ జాక్‌పాట్..?
ఐపీఎల్ 2026 సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఫైనల్లో ఆర్సీబీ-గుజరాత్ టైటాన్స్ తలపడుతుండగా, ట్రోఫీతో పాటు భారీ నగదు బహుమతులు కూడా ఆకర్షణగా నిలిచాయి. విజేత జట్టుకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుండగా, రన్నరప్‌కు రూ.13 కోట్లు అందనున్నాయి.ఈ సీజన్లో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే మూడుసార్లు తలపడగా, ఆర్సీబీ 2-1 ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు ఫైనల్లో గెలిచే జట్టు ట్రోఫీతో పాటు భారీ చెక్కును కూడా సొంతం చేసుకోనుంది.ప్లే ఆఫ్స్‌కు చేరిన జట్లకు దక్కే ప్రైజ్ మనీఫైనల్ విజేతకు రూ.20 కోట్లు, రన్నరప్‌కు రూ.13 కోట్లు అందనున్నాయి. ఇక క్వాలిఫయర్-2లో ఓడిన రాజస్థాన్ రాయల్స్‌కు రూ.7 కోట్లు, ఎలిమినేటర్‌లో నిష్క్రమించిన ఎస్ఆర్హెచ్కు రూ.6.5 కోట్లు లభించనున్నాయి.వైభవ్‌కు మరో భారీ జాక్‌పాట్..?ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ పోరు ఆసక్తికరంగా మారింది. 15 ఏళ్ల చిచ్చరపిడుగు, రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 16 ఇన్నింగ్స్‌ల్లో 776 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే గుజరాత్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (722), సాయి సుదర్శన్ (710) కూడా ఇంకా రేసులోనే ఉన్నారు. ఆరెంజ్ క్యాప్ విజేతకు రూ.10 లక్షలు అందుతాయి.పర్పుల్ క్యాప్ కోసం రబడా–భువీ పోటీపర్పుల్ క్యాప్ రేసులో గుజరాత్ పేసర్ రబాడ 28 వికెట్లతో ముందంజలో ఉన్నాడు. ఆర్సీబీ పేసర్ భువనేశ్వ్‌ర్ కుమార్ 26 వికెట్లతో రబాడ వెన్నంటే ఉన్నాడు. పర్పుల్ క్యాప్ గెలిచే బౌలర్‌కు కూడా రూ.10 లక్షల బహుమతి ఉంటుంది.ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డుకు వైభవ్ ఫేవరెట్ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు కోసం వైభవ్ సూర్యవంశీ, ప్రియాంశ్ ఆర్య (పంజాబ్ కింగ్స్)మధ్య పోటీ నెలకొంది. ఈ అవార్డు గెలిచే ఆటగాడికి రూ.20 లక్షలు అందుతాయి.ఎంవీపీగా ఎవరు..?మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ (MVP) అవార్డు కోసం వైభవ్ సూర్యవంశీ (436.5 పాయింట్లు), కగిసో రబడా (408), జోఫ్రా ఆర్చర్ (396.5) మధ్య పోటీ కనిపిస్తోంది. ఎంవీపీ విజేతకు రూ.10 లక్షలు దక్కనున్నాయి.ఫెయిర్‌ప్లే అవార్డుఈ సీజన్లో ఫెయిర్‌ప్లే పట్టికలో పంజాబ్ కింగ్స్ ముందంజలో ఉంది. ఫెయిర్‌ప్లే అవార్డు గెలిచే జట్టుకు రూ.10 లక్షల నగదు బహుమతి అందుతుంది.ఐపీఎల్ ప్రైజ్ మనీ చరిత్ర2008, 2009 సీజన్లలో విజేతలకు కేవలం రూ.4.8 కోట్లు మాత్రమే ఇచ్చేవారు. 2010 నుంచి రూ.10 కోట్లకు పెంచిన బీసీసీఐ, 2014లో రూ.15 కోట్లు చేసింది. 2016 నుంచి విజేతలకు రూ.20 కోట్లు అందిస్తున్నప్పటికీ, కోవిడ్ ప్రభావంతో 2020లో మాత్రమే రూ.15 కోట్లకు తగ్గించింది. 2021 నుంచి మళ్లీ రూ.20 కోట్లే కొనసాగుతున్నాయి.ఈసారి మొత్తం అవార్డుల రూపంలో బీసీసీఐ సుమారు రూ.47.1 కోట్లను పంపిణీ చేయనుంది. ఫైనల్ ఫలితం ఎలా ఉన్నా, ఐపీఎల్ 2026లో ఆటగాళ్లు, జట్లపై కనక వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది. -
మూడు ‘కీలక యుద్ధాలు’ గెలిచిన ఆర్సీబీ.. పదునైన వ్యూహాలు!
ఐపీఎల్-2026లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్థాయికి తగ్గట్లు రాణించింది. తొలి టైటిల్ కోసం కళ్లు కాయలు కాచేలా 18 ఏళ్లు వేచి చూసిన బెంగళూరూ జట్టు.. వరుసగా రెండో ట్రోఫీ వేటలో ఒక్క అడుగు దూరంలో నిలిచింది. లీగ్ దశలో అద్భుత ఆటతో టేబుల్ టాపర్‌గా నిలిచిన ఆర్సీబీ.. మంగళవారం నాటి తొలి క్వాలిఫయర్లోనూ అసాధారణ ప్రదర్శన కనబరిచింది.ధర్మశాల వేదికగా అద్వితీయ ఆట తీరుతో ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆర్సీబీ తొలి టైటిల్ అందించిన కెప్టెన్ రజత్ పాటీదార్ కీలక మ్యాచ్‌లో మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగాడు. తద్వారా ‘ప్లే ఆఫ్స్’లో అత్యధిక స్కోరు (254) నమోదు చేసిన ఆర్సీబీ విజయం లాంఛనంగా మారిపోయింది. ఆపై 255 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 6 ఓవర్లు ముగిసేసరికే 51/5తో నిలిచిన గుజరాత్ టైటాన్స్ పూర్తిగా చేతులెత్తేసింది. ఏకపక్షంగా సాగిన క్వాలిఫయర్–1లో 92 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది.మూడు కీలక ‘యుద్ధాలు’ గెలిచిన ఆర్సీబీఈ మ్యాచ్‌లో ఆర్సీబీ మూడు కీలక ‘యుద్ధాలు’ గెలిచింది. గుజరాత్ నమ్ముకున్న బౌలింగ్ ‘ఆయుధాన్ని’ ధ్వంసం చేసి.. మెరుపులు మెరిపించడంలో సఫలమైంది. ప్రత్యర్థి ఫీల్డింగ్ తప్పిదాలను క్యాష్ చేసుకుంది. ఇక తమ బౌలింగ్ అస్త్రాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడంలో పాటీదార్ పూర్తిగా సఫలమయ్యాడు.అంచనాలు తలకిందులుక్వాలిఫయర్-1కు ముందు భారత మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ ఆర్సీబీకి కీలక సూచన చేశాడు. గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ దళం ఆర్సీబీ కంటే బలంగా ఉంది కాబట్టి.. జాగ్రత్త వహించాలన్నాడు.సెహ్వాగ్ మాటలు అక్షరాలా నిజం. ఐపీఎల్-2026లో క్వాలిఫయర్ ముందు వరకు గుజరాత్ బౌలింగ్ దళం అద్భుతంగా రాణించింది. ప్లే ఆఫ్స్‌నకు ముందు పవర్ ప్లేలో అంటే.. తొలి ఆరు ఓవర్లలో కలిపి గుజరాత్ 30 వికెట్లు కూల్చింది. కగిసో రబాడ సారథ్యంలో సీజన్లోనే అత్యంత ప్రతిభావంతమైన బౌలింగ్ దళంగా నిలిచింది.రబాడ ఒక్కడే పవర్ ప్లేలో 17 వికెట్లు తీయడం విశేషం. అతడికి తోడుగా సిరాజ్ 13 వికెట్లు తీసి సత్తా చాటాడు. కానీ కీలక మ్యాచ్‌లో ఆర్సీబీ గుజరాత్ బౌలింగ్ దళాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంది. కొత్త బంతితో మ్యాజిక్ చేయగలమన్న వారి నమ్మకంపై నీళ్లు చల్లింది.మెరుపు బ్యాటింగ్... బౌలింగ్ ‘వెపన్’ ధ్వంసంటాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పాటీదార్ (33 బంతుల్లో 93 నాటౌట్; 5 ఫోర్లు, 9 సిక్స్‌లు) విధ్వంసక బ్యాటింగ్ ప్రదర్శన చేయగా... విరాట్ కోహ్లి (25 బంతుల్లో 43; 5 ఫోర్లు, 1 సిక్స్), కృనాల్ పాండ్యా (28 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. గుజరాత్ పేసర్ సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే 3 ఫోర్లు కొట్టి జోరు ప్రదర్శించిన వెంకటేశ్ అయ్యర్ (7 బంతుల్లో 19; 3 ఫోర్లు,1 సిక్స్)... రబాడ వేసిన మరుసటి ఓవర్లో ఒక సిక్స్ బాది మరుసటి బంతికే వెనుదిరిగాడు. కోహ్లి తనదైన శైలిలో కొన్ని చక్కటి షాట్లు ఆడగా... రబాడ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లతో పడిక్కల్ ధాటిని చూపించాడు. రబాడ తర్వాతి ఓవర్లో కోహ్లి 2 ఫోర్లు, సిక్స్ బాదడంతో పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు 76 పరుగులు సాధించింది.ఆ తర్వాత హోల్డర్ ఒకే ఓవర్లో కోహ్లి, పడిక్కల్‌లను వెనక్కి పంపించాడు. ఈ దశలో బెంగళూరుపై టైటాన్స్ బౌలర్లు ఒత్తిడి పెంచారు. అయితే కుల్వంత్ వేసిన 15వ ఓవర్‌తో ఆట మారిపోయింది. పాటీదార్ అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగిపోగా, చివరి 6 ఓవర్లలో జట్టు ఏకంగా 114 పరుగులు సాధించడం విశేషం.ప్రయోగం వికటించిందిఇక గత సీజన్లో ఒకే ఒక ఐపీఎల్ మ్యాచ్ ఆడిన తర్వాత ఈ ఏడాది నేరుగా కుల్వంత్‌ను ప్లే ఆఫ్స్‌లో దించి గుజరాత్ సాహసం చేసింది. తన తొలి ఓవర్లో అతడు 3 పరుగులే ఇచ్చి ఆకట్టుకున్నాడు. అయితే అతని రెండో ఓవర్ మ్యాచ్ గతిని మార్చింది. ఈ ఓవర్లో కృనాల్ 2 ఫోర్లు కొట్టగా, పాటీదార్ వరుసగా 4, 6, 4 బాదాడు. దీనికి తోడు అతను 2 నోబాల్, 1 వైడ్ కూడా వేశాడు. చివరకు 9 బంతుల ఈ ఓవర్లో ఏకంగా 28 పరుగులు వచ్చాయి. ఆ క్యాచ్ పట్టి ఉంటే... పాటీదార్‌కు 2 లైఫ్‌లు రాగా అతడు వాటిని అద్భుతంగా వాడుకున్నాడు. పాటీదార్ 14 పరుగుల వద్ద ఉన్నప్పుడు ప్రసిధ్ ఓవర్లో కొట్టిన షాట్‌కు బంతి గాల్లోకి లేచింది. బట్లర్ ఒక వైపునుంచి పరుగెత్తుకు రాగా, మరో వైపు నుంచి కుల్వంత్ వచ్చాడు.చివరకు ఇద్దరూ దానిని అందుకోలేకపోగా బంతి వారి మధ్యలో పడింది. అదే ఓవర్లో స్కోరు 18 పరుగుల వద్ద పాటీదార్ కొట్టిన పుల్ షాట్‌కు నేరుగా చేతుల్లోకి వచ్చిన క్యాచ్‌ను రబాడ వదిలేశాడు. గుజరాత్ టాపార్డర్, మిడిలార్డర్ కుదేలుఆర్సీబీ విధించిన భారీ లక్ష్య ఛేదనలో టైటాన్స్ పూర్తిగా కుప్పకూలింది. ఓపెనర్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (2)ను భువనేశ్వర్ కుమార్ పెవిలియన్‌కు పంపగా.. సాయి సుదర్శన్‌ను జేకబ్ డఫీ అవుట్ చేశాడు.ఇక వన్‌డౌన్‌లో వచ్చిన జోస్ బట్లర్ (29)ను జోష్ హాజిల్‌వుడ్ వెనక్కి పంపాడు. ఇలా టాపార్డర్‌ను కుదేలు చేసిన ఆర్సీబీ బౌలింగ్ దళం.. మిడిలార్డర్‌ను కనీసం ఊపిరి కూడా పీల్చుకోనివ్వలేదు. నిశాంత్ సంధు (5), జేసన్ హోల్డర్ (0)లను రసిఖ్ సలామ దర్ అవుట్ చేయగా.. వాషింగ్టన్ సుందర్ (8)ను డఫీ పెవిలియన్‌కు చేర్చాడు.రాహుల్ తెవాటియా పోరాటంఅయితే, లోయర్ ఆర్డర్లో రాహుల్ తెవాటియా తన అనుభవాన్ని చూపించాడు. మొత్తంగా 43 బంతులు ఎదుర్కొని 68 పరుగులు సాధించి.. గుజరాత్ స్కోరు కనీసం 150 పరుగుల మార్కు దాటేందుకు సహాయపడ్డాడు. అయితే, భువీ తన అద్భుత బౌలింగ్‌తో తెవాటియాను వెనక్కి పంపాడు.మిగిలిన వాళ్లలో రషీద్ ఖాన్ (8) వికెట్‌ను డఫీ దక్కించుకోగా.. కృనాల్ పాండ్యా.. కగిసో రబాడ (9), సిరాజ్ (5) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తానికి జేకబ్ డఫీ, భువనేశ్వర్ కుమార్, హాజల్‌వుడ్ వరుసగా ఒక్కో ఓవర్లో ఒక్కో వికెట్ తీయగా... రసిఖ్ సలామ్ తన తొలి ఓవర్లోనే ఒక్క పరుగూ ఇవ్వకుండా 2 వికెట్లు తీసి టైటాన్స్ ఆశలు ముగించాడు. గుజరాత్ 19.3 ఓవర్లలో 162 పరుగులు చేసి ఆలౌట్ అయింది.మరో అవకాశంఅయితే, ఓడినా గుజరాత్ ఫైనల్ చేరేందుకు మరో అవకాశం మిగిలి ఉంది. ముల్లన్‌పూర్‌లో బుధవారం జరిగే ‘ఎలిమినేటర్’ మ్యాచ్ (సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెన్ రాజస్తాన్ రాయల్స్) విజేతతో శుక్రవారం జరిగే క్వాలిఫయర్–2లో గుజరాత్ జట్టు తలపడుతుంది. మరోవైపు.. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో జోరు మీదున్న బెంగళూరును టైటిల్ పోరులో ఏ జట్టయినా నిలువరించగలదా అనేదే ఇప్పుడు ఆసక్తికరం! చదవండి: ఇప్పట్లో అతడిని టెస్టులకు ఎంపిక చేయొద్దు: గంగూలీ -
పాటిదార్ ఊచకోత.. గుజరాత్ చిత్తు.. ఫైనల్లో ఆర్సీబీ
ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆర్సీబీ హోదాకు తగ్గట్టుగా ఆడుతుంది. లీగ్ దశలో టేబుల్ టాపర్‌గా నిలిచి ప్లే ఆఫ్స్‌కు చేరిన ఈ జట్టు.. ఇవాళ (మే 26) జరిగిన తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తుగా ఓడించి, వరుసగా రెండో ఎడిషన్‌లో ఫైనల్‌కు చేరింది.ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. కెప్టెన్ రజత్ పాటిదార్ మహోగ్రరూపం (33 బంతుల్లో 93 నాటౌట్; 5 ఫోర్లు, 9 సిక్సర్లు) దాల్చాడు. ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది.ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో పాటిదార్‌తో పాటు మిగతా ఆటగాళ్లు కూడా చెలరేగారు. వెంకటేశ్ అయ్యర్ 7 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 19 పరుగులు, విరాట్ కోహ్లి 25 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 43, పడిక్కల్ 19 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 30, కృనాల్ పాండ్యా 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 43, టిమ్ డేవిడ్ 5 బంతుల్లో 4, జితేశ్ శర్మ 5 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 15 పరుగులు (నాటౌట్) చేశారు. గుజరాత్ బౌలర్లలో హోల్డర్, రబాడ తలో 2, ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ తీశారు.అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్.. ఆదిలోనే మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. సాయి సుదర్శన్ (14) దురదృష్టవశాత్తు హిట్ వికెట్‌గా వెనుదిరగడంతో ఈ జట్టు పతనం ప్రారంభమైంది. ఆతర్వాత కొద్ది సేపటికే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (2).. 51 పరుగుల వద్ద బట్లర్ (29), నిషాంత్ సింధు (5), హోల్డర్ (0) ఔట్ కావడంతో పవర్ ప్లేలోనే (5.4 ఓవర్లలో) ఓటమి ఖరారైంది. ఆతర్వాత స్వల్ప వ్యవధిలో సుందర్ (8), రషీద్ ఖాన్ (8), రబాడ (9) కూడా ఔట్ కావడం 100 పరుగులలోపే ఆలౌటయ్యేలా కనిపించింది. అయితే ఆఖర్లో తెవాతియా (68) బ్యాట్ ఝులిపించడంతో జట్టు స్కోర్ 100 పరుగుల మార్కు దాటింది. అంతిమంగా గుజరాత్ 19.3 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటై 92 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఆర్సీబీ బౌలర్లలో డఫీ 3, భువీ, రసిక్, కృనాల్ తలో 2, హాజిల్‌వుడ్ ఓ వికెట్ తీసి గుజరాత్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. -
పాటిదార్ మహోగ్రరూపం.. ఆల్‌టైమ్ రికార్డులు బద్దలు కొట్టిన ఆర్సీబీ
ఐపీఎల్ 2026 తొలి క్వాలిఫయర్‌లో ఆర్సీబీ-గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసి అతి భారీ స్కోర్ చేసింది.రజత్ పాటిదార్ (33 బంతుల్లో 93 నాటౌట్; 5 ఫోర్లు, 9 సిక్సర్లు) మహోగ్రరూపం దాల్చడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో పాటిదార్‌తో పాటు మిగతా ఆటగాళ్లు కూడా చెలరేగారు.వెంకటేశ్ అయ్యర్ 7 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 19 పరుగులు, విరాట్ కోహ్లి 25 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 43, పడిక్కల్ 19 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 30, కృనాల్ పాండ్యా 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 43, టిమ్ డేవిడ్ 5 బంతుల్లో 4, జితేశ్ శర్మ 5 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 15 పరుగులు (నాటౌట్) చేశారు. గుజరాత్ బౌలర్లలో హోల్డర్, రబాడ తలో 2, ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ తీశారు.కాగా, ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఆల్‌టైమ్ పలు రికార్డులు బద్దలు కొట్టింది. ఐపీఎల్ నాకౌట్స్/ప్లే ఆఫ్స్‌లో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. అలాగే ఐపీఎల్ నాకౌట్స్/ప్లే ఆఫ్స్‌లో అత్యధిక బౌండరీలు సాధించిన జట్టుగానూ సరికొత్త రికార్డు నెలకొల్పింది.ఐపీఎల్ నాకౌట్స్/ప్లే ఆఫ్స్‌లో అత్యధిక స్కోరు254/5 RCB vs PBKS ధర్మశాల 2026 *233/3 GT vs MI అహ్మదాబాద్ 2023228/5 MI vs GT న్యూ చండీగఢ్ 2025226/6 PBKS vs CSK వాంఖడే 2014222/5 CSK vs DC చెన్నై 2012ఐపీఎల్ నాకౌట్స్/ప్లే ఆఫ్స్‌లో అత్యధిక బౌండరీలు38 RCB vs GT ధర్మశాల 2026 *33 CSK vs DC చెన్నై 201232 PBKS vs CSK వాంఖేడే 201431 GT vs MI అహ్మదాబాద్ 202331 MI vs GT న్యూ చండీగఢ్ 2025 -
చరిత్ర సృష్టించిన రబాడ
ఆర్సీబీతో జరుగుతున్న ఐపీఎల్ 2026 తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్ టైటాన్స్ పేసర్ కగిసో రబాడ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. రబాడ రెండో ఓవర్ చివరి బంతికి దూకుడు మీద ఉన్న వెంకటేశ్ అయ్యర్‌ను (19) ఔట్ చేశాడు. శుభ్‌మన్ గిల్ అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ పట్టి అయ్యర్‌ను పెవిలియన్‌కు పంపాడు.ఈ వికెట్‌తోనే రబాడ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్లో మొదటి ఆరు ఓవర్లలో అత్యధిక వికెట్లు (18) తీసిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ వికెట్‌కు ముందు రబాడ మహ్మద్ షమీతో (2023 ఎడిషన్) కలిసి ఈ రికార్డును షేర్ చేసుకున్నాడు. ఈ రికార్డుకు సంబంధించి రబాడ, షమీ తర్వాతి స్థానాల్లో మిచెల్ జాన్సన్ (16 వికెట్లు, 2013), ట్రెంట్ బౌల్ట్ (16, 2020) ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. 14 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 140-3గా ఉంది. వెంకటేశ్ అయ్యర్ (19), విరాట్ కోహ్లి (43), దేవదత్ పడిక్కల్ (30) ఔట్ కాగా.. కెప్టెన్ రజత్ పాటిదార్ (21), కృనాల్ పాండ్యా (25) క్రీజ్‌లో ఉన్నారు. గుజరాత్ బౌలర్లలో రబాడ 1, హోల్డర్ 2 వికెట్లు పడగొట్టారు. హోల్డర్ 9వ ఓవర్లో మూడు బంతుల వ్యవధిలో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. రెండో బంతికి విరాట్ కోహ్లి (43) క్లీన్ బౌల్డ్ చేసిన అతడు.. నాలుగో బంతికి పడిక్కల్‌ను పెవిలియన్‌కు పంపాడు. -
గుజరాత్‌పై ఘన విజయం.. ఫైనల్లో ఆర్సీబీ
గుజరాత్‌పై ఘన విజయం.. ఫైనల్లో ఆర్సీబీ255 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ 19.3 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటై 92 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ గెలుపుతో ఆర్సీబీ నేరుగా ఫైనల్‌కు చేరుకుంది.ఆరో వికెట్ కోల్పోయిన గుజరాత్8.2వ ఓవర్- 65 పరుగుల వద్ద గుజరాత్ ఆరో వికెట్ కోల్పోయింది. డఫీ బౌలింగ్‌లో హాజిల్‌వుడ్‌కు క్యాచ్ ఇచ్చి వాషింగ్టన్ సుందర్ (8) ఔటయ్యాడు. 51 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన గుజరాత్5.4వ ఓవర్- 51 పరుగుల వద్ద గుజరాత్ ఐదో వికెట్ కోల్పోయింది. రసిక్ సలాం దార్ బౌలింగ్‌లో హాజిల్‌వుడ్‌కు క్యాచ్ ఇచ్చి జేసన్ హోల్డర్ డకౌటయ్యాడు. పీకల్లోతు కష్టాల్లో గుజరాత్255 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 51 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతోంది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో బట్లర్ (29) మూడో వికెట్‌గా, రసిక్ సలాం దార్ బౌలింగ్‌లో నిషాంత్ సింధు (5) నాలుగో వికెట్‌గా వెనుదిరిగారు. రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్3.1వ ఓవర్- 27 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ (2) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.సాయి సుదర్శన్ హిట్ వికెట్2.3వ ఓవర్- 17 పరుగుల వద్ద గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. గుజరాత్‌ను దరిద్రం వెంటాడంతో సాయి సుదర్శన్ (14) హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. డఫీ బౌలింగ్‌లో బంతి బౌండరీకి వెళ్లినా సుదర్శన్ బ్యాట్ చేజారి వికెట్లకు తాకింది. పాటిదార్ ఊచకోత.. ఆర్సీబీ భారీ స్కోర్‌టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ భారీ స్కోర్ చేసింది. రజత్ పాటిదార్ (33 బంతుల్లో 93 నాటౌట్; 5 ఫోర్లు, 9 సిక్సర్లు) ఉగ్రరూపం దాల్చడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో పాటిదార్‌తో పాటు మిగతా ఆటగాళ్లు కూడా చెలరేగారు. వెంకటేశ్ అయ్యర్ 7 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 19 పరుగులు, విరాట్ కోహ్లి 25 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 43, పడిక్కల్ 19 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 30, కృనాల్ పాండ్యా 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 43, టిమ్ డేవిడ్ 5 బంతుల్లో 4, జితేశ్ శర్మ 5 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 15 పరుగులు (నాటౌట్) చేశారు. 18 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పాటిదార్ క్యాచ్‌ను రబాడ మిస్ చేయడంతో గుజరాత్ మూల్యం చెల్లించుకుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఫీల్డర్లు చాలా తప్పిదాలు చేశారు. క్యాచ్‌లు, రనౌట్లు మిస్ చేయడంతో పాటు లేని పరుగులను సమర్పించుకున్నారు. బౌలర్లు ఓ మోస్తరుగా బౌలింగ్ చేసినా ఫీల్డర్ల పొరపాట్ల కారణంగా గుజరాత్ భారీ మూల్యం చెల్లించుకుంది. గుజరాత్ బౌలర్లలో హోల్డర్, రబాడ తలో 2, ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ తీశారు.ఐదో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ17.6వ ఓవర్- 214 పరుగుల వద్ద ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్ (4) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆర్సీబీ నాలుగో వికెట్ డౌన్ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. 43 పరుగులు చేసిన కృనాల్ పాండ్యా.. రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 17 ఓవర్లు ఆర్సీబీ స్కోర్: 204/4భారీ స్కోర్ దిశగా ఆర్సీబీఆర్సీబీ భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. 16 ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు మూడు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. క్రీజులో కృనాల్ పాండ్యా(43), పాటిదార్(49) ఉన్నారు.మూడు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ9వ ఓవర్లో ఆర్సీబీ మూడు బంతుల వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. రెండో బంతికి జేసన్ హోల్డర్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లి (43) క్లీన్ బౌల్డ్ కాగా.. నాలుగో బంతికి వికెట్ కీపర్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి పడిక్కల్ (30) పెవిలియన్‌కు చేరాడు. పవర్ ప్లేలో దుమ్మురేపిన ఆర్సీబీటాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ పవర్ ప్లేలో దుమ్మురేపింది. సుడిగాలి ఇన్నింగ్స్ తర్వాత వెంకటేశ్ అయ్యర్ (19) ఔటైనా, విరాట్ కోహ్లి (34 నాటౌట్), దేవదత్ పడిక్కల్ (23 నాటౌట్) మెరుపులు కొనసాగించారు. 6 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 76-1గా ఉంది. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ1.6వ ఓవర్- 21 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో గిల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో వెంకటేశ్ అయ్యర్ (19) ఔటయ్యాడు. ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మే 26) జరుగుతున్న తొలి క్వాలిఫయర్ పోటీలో ఆర్సీబీ-గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్లు..గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభమన్ గిల్(సి), జోస్ బట్లర్(w), వాషింగ్టన్ సుందర్, నిశాంత్ సింధు, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, కుల్వంత్ ఖేజ్రోలియా, కగిసో రబడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(సి), జితేష్ శర్మ(w), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, జోష్ హాజిల్‌వుడ్, రసిఖ్ సలాం దార్ -
వాళ్లిద్దరు తేలిపోతే ఆర్సీబీకి కష్టమే: సెహ్వాగ్
ఐపీఎల్-2026 ఫైనల్ తొలి బెర్తు కోసం రాయల్ చాలెంజర్స్ (ఆర్సీబీ)- గుజరాత్ టైటాన్స్ రేసులో నిలిచాయి. ఇరుజట్ల మధ్య మంగళవారం నాటి క్వాలిఫయర్-1 మ్యాచ్‌కు ధర్మశాల వేదిక. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆర్సీబీ- గుజరాత్ అమీతుమీ తేల్చుకుంటాయి.ఆర్సీబీకి కీలక సూచనలుకాగా ఈ మైదానం బౌండరీలు చిన్నగా ఉంటాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ ఆర్సీబీకి కీలక సూచనలు చేశాడు. లీగ్ దశలో చివరి మ్యాచ్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడ్డ ఆర్సీబీ.. ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సి ఉందన్నాడు.ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ కంటే బలంగాప్రస్తుతం గుజరాత్ బౌలింగ్ విభాగం.. ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ కంటే బలంగా కనిపిస్తోందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. అయితే, గత చేదు అనుభవాన్ని మరిచి ఆర్సీబీ బౌలర్లు క్వాలిఫయర్-1పై దృష్టి సారిస్తే విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదన్నాడు.తేలిపోయిన భువీ, హాజిల్వుడ్కాగా ఆర్సీబీ లీగ్ దశలో చివరగా సన్‌రైజర్స్‌తో తలపడి.. 55 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సొంతమైదానం ఉప్పల్‌లో సన్‌రైజర్స్ 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆర్సీబీ ప్రధాన పేసర్లు భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్ ఈ మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.నాలుగు ఓవర్ల కోటాలో భువీ 51, హాజిల్‌వుడ్ 55 పరుగులు ఇచ్చి.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. ఇక రసిఖ్ సలామ్ దర్ 52 పరుగులు ఇచ్చినప్పటికీ రెండు వికెట్లు తీయగలిగాడు. మిగిలిన వారిలో సూయశ్ శర్మ మూడు ఓవర్లలో 36 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీయగా.. కృనాల్ పాండ్యా రెండు ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.ఇక రొమారియో షెఫర్డ్ మూడు ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేదు. అయితే, ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేతిలో ఆర్సీబీ ఓడినప్పటికీ నెట్‌రన్‌రేటు పరంగా మెరుగైన స్థితిలో ఉండటంతో టేబుల్ టాపర్ స్థానాన్ని పదిలం చేసుకుని క్వాలిఫయర్-1లో అడుగుపెట్టింది.ప్లే ఆఫ్స్‌లో కూడా విఫలమైతే..ఈ నేపథ్యంలో సెహ్వాగ్ క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌ను ఆర్సీబీ వీలైనంత త్వరగా మర్చిపోవాలి. భువీ, హాజిల్‌వుడ్ విఫలమయ్యారు. వారికి అదొక దుర్దినం. ఇద్దరిలో ఒక్కరూ సరిగ్గా బౌలింగ్ చేయలేకపోయారు.అయితే, ఆ విషయాన్ని మర్చిపోయి ముందుకు సాగాల్సిన కీలక సమయం ఇది. ఒకవేళ ప్లే ఆఫ్స్‌లో కూడా ఆర్సీబీ బౌలర్లు విఫలమైతే.. గుజరాత్ 255కు పైగా పరుగులు స్కోరు చేయవచ్చు. ఇక్కడ బౌండరీలు చాలా చిన్నవి కాబట్టి ఆ అవకాశం ఉంది.ఆర్సీబీ బౌలింగ్ విభాగం గొప్పగా రాణించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే.. గుజరాత్ బౌలర్లు వీరి కంటే మెరుగైన స్థితిలో ఉన్నారు. కాబట్టి ఆర్సీబీ ఈ విషయంలో తప్పక జాగ్రత్త వహించాలి’’ అని పేర్కొన్నాడు. ఆర్సీబీ బౌలర్లు తేలిపోతే మాత్రం ఈ మ్యాచ్‌లో విజయం కష్టమేనని సెహ్వాగ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా క్వాలిఫయర్-1లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో అడుగుపెట్టనుండగా.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది.చదవండి: మరీ ఇంత కుళ్లు పనికిరాదు! -
Kohli vs Gill: ఏడిపించిన కోహ్లి.. ఇచ్చిపడేసిన గిల్!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు గుజరాత్ టైటాన్స్ షాకిచ్చింది. గత వారం ఎదురైన పరాభవానికి సొంతగడ్డపై బదులు తీర్చుకుంది. ఐపీఎల్-2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గురువారం గుజరాత్- ఆర్సీబీ తలపడ్డాయి.కోహ్లి, గిల్ స్కోర్లు ఎంతంటే?ఇందులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 19.2 ఓవర్లలో 155 పరుగులుకు ఆలౌటైంది. దేవ్‌దత్ పడిక్కల్ (24 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా, విరాట్ కోహ్లి (13 బంతుల్లో 28; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు.అనంతరం గుజరాత్ 15.5 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసి గెలిచింది. శుబ్‌మన్ గిల్ (18 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), జోస్ బట్లర్ (19 బంతుల్లో 39; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. 12 పరుగులు చేయడంతోపాటు, 2 వికెట్లు పడగొట్టి, 3 క్యాచ్‌లు పట్టిన జేసన్ హోల్డర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.పక్కా ప్రత్యర్థిలా వ్యవహరించిన కోహ్లి.. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ సందర్భంగా ఆర్సీబీ దిగ్గజం, కింగ్ కోహ్లి- గుజరాత్ కెప్టెన్, ప్రిన్స్ గిల్ మధ్య చోటు చేసుకున్న సరదా సన్నివేశాలు వైరల్ అవుతున్నాయి. మ్యాచ్ సమయంలో గిల్ పట్ల పక్కా ప్రత్యర్థిలా వ్యవహరించిన కోహ్లి.. ఆ తర్వాత మాత్రం అతడిని టీజ్ చేశాడు. ఇందుకు గిల్ కూడా గట్టిగానే బదులిచ్చాడు.Vintage #ViratKohli energy! 🔥KING catches, PRINCE departs - Absolute cinema! 🙌 🎯#TATAIPL 2026 ➡️ #GTvRCB | LIVE NOW 👉https://t.co/K8vuSzrZ1d pic.twitter.com/jCKi1Qo4zA— Star Sports (@StarSportsIndia) April 30, 2026ఏడిపించిన కోహ్లి.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో గిల్ ఇచ్చిన క్యాచ్ పట్టిన కోహ్లి.. అతడు పెవిలియన్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఆసమయంలో కోహ్లి వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకోగా.. గిల్ నిరాశగా వెనుదిరిగాడు. ఈ క్రమంలో గిల్ డగౌట్లో కూర్చోగా.. ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి.. అతడిని అవుట్ చేసిన విధానాన్ని సైగలతో చూపిస్తూ టీజ్ చేశాడు.Virat Kohli: "Ye le thullu, kaise catch out kiya 😭"Shubman Gill: "Scoreboard dekh lo, kya hi farak padta hai? Hum jeet rahe hain!"Kohli: "Run-out hote-hote bacha tu, kaise bhaag raha tha!"Gill: "Chhodo jaane do, Virat bhai hai ❤️" pic.twitter.com/KCWwV0xDWk— GillTheWill (@GillTheWill77) May 1, 2026ఇచ్చిపడేసిన గిల్!ఇందుకు గిల్.. ‘స్కోరు బోర్డు చూడు భయ్యా.. నేను అవుటైతే ఏంటి? గెలిచేది మేమే’ అన్నట్లుగా తానూ సైగలతోనే కౌంటర్ వేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఆర్సీబీపై నాలుగు వికెట్ల తేడాతో గెలిచిన తర్వాత.. ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకునే సమయంలో గిల్- కోహ్లి ఆలింగనం చేసుకుని నవ్వులు చిందించారు.అయితే, ఆ తర్వాత కూడా గిల్ కోహ్లి, ఆర్సీబీని వదిలిపెట్టలేదు. కోహ్లి, తానూ ఉన్న ఫొటోను పంచుకుంటూ.. ‘జేసన్ హోల్డర్.. ప్లే హోల్డ్ బోల్డ్.. ఈరోజు రాత్రి అత్యద్భుతమైన ప్రదర్శన’ అంటూ ఆర్సీబీ, కోహ్లిని టార్గెట్ చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఇచ్చిన క్యాచ్‌ను హోల్డర్ పట్టాడు.అయితే, ఇది క్లీన్ క్యాచ్ కాదని కోహ్లి వాదించగా.. థర్డ్ అంపైర్ మాత్రం అవుట్‌గా ప్రకటించాడు. దీంతో వివాదం చెలరేగింది. అయితే, ఫలితం మాత్రం గుజరాత్‌కు మేలు చేసింది. మరోవైపు.. ఆర్సీబీ ప్లే బోల్డ్ అన్న నినాదంతో ముందుకు సాగుతుందన్న సంగతి తెలిసిందే. ఈ రెండింటినీ ప్రస్తావిస్తూ గిల్ ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు.చదవండి: కింద పడేసి తొక్కుతా బిడ్డా!.. క్లాసెన్ మాస్ వార్నింగ్! The award for the best senior and junior duo goes to… 😁#TATAIPL #GTvRCB #ShubmanGill #ViratKohli pic.twitter.com/4lccF2wv9u— Star Sports (@StarSportsIndia) April 30, 2026 -
భారత టీ20 జట్టులోకి అతడిని తిరిగి తీసుకోండి: సెహ్వాగ్
భువనేశ్వర్ కుమార్... ఒకప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా ప్రధాన బౌలర్లలో ఒకడిగా వెలుగొందాడు ఈ పేసర్. చివరగా 2022లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన అతడు.. తిరిగి పునరాగమనం చేసేందుకు ఎంతగానో శ్రమిస్తున్నాడు. దేశీ, లీగ్ క్రికెట్లో మరోసారి తనను తాను నిరూపించుకుంటున్నాడు.చోటే లేదు!అయినప్పటికీ సెలక్టర్లు మాత్రం భువీని కనికరించడం లేదు. ఇప్పటికే పేస్ బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా నాయకుడిగా పాతుకుపోగా.. మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, ముకేశ్ కుమార్ తదితరులు కూడా కీలక సభ్యులుగా కొనసాగతున్నారు. దీంతో భువీకి టీమిండియా తలుపులు దాదాపుగా మొత్తానికే మూసుకుపోయాయి.అయితే, భారత మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ మాత్రం భువనేశ్వర్ కుమార్‌కు మరొక్క అవకాశం ఇవ్వాలని అంటున్నాడు. కాగా ఐపీఎల్-2025లో ఆర్సీబీని చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించిన భువీ.. తాజా ఎడిషన్‌లోనూ రాణిస్తున్నాడు. తాజాగా గుజరాత్ టైటాన్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌లోనూ ఈ రైటార్మ్ పేసర్ అదరగొట్టాడు.అత్యధిక వికెట్ల వీరుడిగానాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసిన భువీ.. 28 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు కూల్చాడు. మొత్తంగా 2026 సీజన్లో ఇప్పటికి తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి 17 వికెట్లు పడగొట్టి.. అత్యధిక వికెట్ల వీరుడిగా ప్రస్తుతానికి పర్పుల్ క్యాప్ తన దగ్గర పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో సెహ్వాగ్ భువీపై ప్రశంసలు కురిపించాడు.తిరిగి టీ20 జట్టులోకి తీసుకోండిక్రిక్బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ప్రతి మ్యాచ్‌లోనూ కనీసం రెండు నుంచి మూడు వికెట్లు తీస్తున్నాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లోనూ మూడు వికెట్లు పడగొట్టాడు. ఆర్సీబీ విజయాల్లో అతడు కీలక పాత్ర పోషిస్తున్నాడు.అతడి వయసు 35 లేదంటే 36 ఏళ్లు ఉండొచ్చు. అయితే, ఇదే విధంగా అద్భుతంగా బౌలింగ్ కొనసాగిస్తే.. టీ20 క్రికెట్లో అతడి పునరాగమనం గురించి టీమిండియా సెలక్టర్లు తప్పక ఆలోచించాలి. బుమ్రా- భువీ కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది. వింటేజ్ భువీ జట్టుకు తప్పక ఉపయోగపడతాడు’’ అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.You miss, I hit! 🎯#BhuvneshwarKumar has dismissed #JosButtler for the 9th time in 20 T20 innings! 🤯#TATAIPL 2026 ➡️ #GTvRCB | LIVE NOW 👉https://t.co/K8vuSzrZ1d pic.twitter.com/QnL7Vybkp7— Star Sports (@StarSportsIndia) April 30, 2026చదవండి: IPL 2026: పాటిదార్‌ది అవుటా? నాటౌటా? రూల్స్ ఏమి చెబుతున్నాయి? -
అంపైర్‌ది ముమ్మాటికీ తప్పే! అతడు అవుట్ కానేకాదు!
గుజరాత్ టైటాన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుపై ప్రతీకారం తీర్చుకుంది. ఐపీఎల్-2026లో భాగంగా గత శనివారం బెంగళూరు వేదికపై 205 పరుగులు చేసి కూడా గుజరాత్ టైటాన్స్ ఓటమిని ఎదుర్కొంది. తాజాగా గురువారం నాటి మ్యాచ్‌లో సొంతగడ్డపై ‘రిటర్న్’ మ్యాచ్‌తో ఆర్సీబీని ఓడించింది. నాలుగు వికెట్ల తేడాతో పాటీదార్ సేనపై గెలుపొందింది.రీప్లేలో స్పష్టంగా కనిపించిందిఅయితే, ఆర్సీబీ ఇన్నింగ్స్ సందర్భంగా చోటుచేసుకున్న అనూహ్య ఘటన వివాదానికి దారితీసింది. అర్షద్ బౌలింగ్‌లో ఆర్సీబీ సారథి రజత్ పాటీదార్ (19) పుల్ షాట్ కొట్టగా... డీప్ స్క్వేర్‌లెగ్ నుంచి పరుగెత్తుతూ వచ్చిన జేసన్ హోల్డర్ (Jason Holder) ముందుకు దూకుతూ క్యాచ్ అందుకున్నాడు.అయితే హోల్డర్ క్యాచ్ పట్టిన తర్వాత బంతి నేలకు తాకినట్లు రీప్లేలో స్పష్టంగా కనిపించింది. తన ఎడమ చేతిలో బంతిని ఉంచుకున్న హోల్డర్ తనను తాను నియంత్రించుకునే క్రమంలో బంతిపైనే పూర్తిగా భారం వేసి మరీ పైకి లేచాడు.It’s heating up in Ahmedabad! 🔥#JasonHolder caught #RajatPatidar at the boundary, but the #RCB camp wasn’t convinced with the decision! 👀#TATAIPL 2026 ➡️ #GTvRCB | LIVE NOW 👉https://t.co/K8vuSzrZ1d pic.twitter.com/GwfAoIelDj— Star Sports (@StarSportsIndia) April 30, 2026రిజర్వ్ అంపైర్‌తో కోహ్లి వాగ్వాదంఅయినప్పటికీ.. థర్డ్ అంపైర్ అభిజిత్ భట్టాచార్య మాత్రం బంతిని హోల్డర్ సరిగానే పట్టుకున్నాడని, బంతిని పూర్తి నియంత్రణలో ఉంచుకున్నాడని భావిస్తూ అవుట్‌గా ప్రకటించాడు. దీంతో ఆర్సీబీ దిగ్గజం విరాట్ కోహ్లి, కోచ్ ఆండీ ఫ్లవర్ రిజర్వ్ అంపైర్ పరాశర్ జోషితో గట్టిగా వాదించినా ఫలితం లేకుండా పోయింది.ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. పాటీదార్ అవుట్ విషయంలో థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని అతడు తప్పుబట్టాడు. ‘‘నా దృష్టిలో హోల్డర్ పట్టింది అసలు క్యాచ్ కానేకాదు. క్రికెట్ చట్టంలోని 33.3 నియమం ప్రకారం..అంపైర్‌ది ముమ్మాటికీ తప్పే!బంతి ఒక్కసారి చేతిలోకి వచ్చినపుడు బాల్‌తో పాటు శరీరంపై కూడా ఆటగాడు పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి. అప్పటి వరకు బంతి నేలను అస్సలు తాకకూడదు. ఆ సమయంలో ఆటగాడి చేయి నేలకు తాకినా సరే.. బంతి మాత్రం అస్సలు నేలకు తాకకూడదు.జేసన్ హోల్డర్ క్యాచ్ పట్టిన వెంటనే జారిపడ్డాడు. స్లైడ్ అవుతున్న సమయంలో అతడి శరీరం చలనంలో ఉంది కాబట్టి అతడు తనను తాను పూర్తిగా నియంత్రించుకోలేకోయాడు. అప్పుడే బంతి నేలకు తాకింది. అప్పటికి అది ఇంకా డెడ్‌బాల్ కానేలేదు.కాబట్టి ఆ క్యాచ్ పూర్తికానట్లే లెక్క. నా అభిప్రాయం ప్రకారం అంపైర్ తప్పుచేశాడు. బ్యాటర్(పాటీదార్)ను నాటౌట్‌గా ప్రకటించాల్సింది’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. రూల్ ఇదేకాగా మేరీల్‌బోన్ క్రికెట్ క్లబ్ నియమం 33.2.2.1 ప్రకారం.. ఫీల్డర్ బంతిని అందుకున్నప్పుడు, అతడి చేతి వేళ్ల మధ్య నుంచి బాల్ నేలకు తాకినట్లయితే దాన్ని అవుట్‌గానే పరిగణిస్తారు. ఈ నియమాన్ని అనుసరించే థర్డ్ అంపైర్ పాటీదార్‌ను అవుట్‌గా ప్రకటించినట్లు తెలుస్తోంది.చదవండి: అతడి వల్లే ఈ ఓటమి.. కానీ భువీ మాత్రం అద్భుతం: ఆర్సీబీ కెప్టెన్


