రెండో టైటిల్‌.. ఆర్సీబీ సాధించిన రికార్డులు ఇవే | IPL 2026: RCB Beat GT Historic Title Defence Check All Records | Sakshi
Sakshi News home page

రెండో టైటిల్‌.. ఆర్సీబీ సాధించిన రికార్డులు ఇవే

Jun 1 2026 12:58 PM | Updated on Jun 1 2026 1:05 PM

IPL 2026: RCB Beat GT Historic Title Defence Check All Records

టైటిల్‌ విజేత ఆర్సీబీ (PC: BCCI)

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండోసారి ఐపీఎల్‌ ట్రోఫీ నెగ్గింది. ఐపీఎల్‌-2026 ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. అహ్మదాబాద్‌లో ఆదివారం టాస్‌ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

టాపార్డర్‌ను కుదేలు చేసి ఆదిలోనే ప్రత్యర్థిని దెబ్బకొట్టిన ఆర్సీబీ..  గుజరాత్‌ను 155 పరుగులకే పరిమితం చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగి రెండు ఓవర్లు మిగిలి ఉండగానే పనిపూర్తి చేసింది. 

తద్వారా ఏకపక్ష విజయం సాధించి.. తమ స్థాయి ఏమిటో మరోసారి నిరూపించుకుంది. ఈ క్రమంలో ఆర్సీబీ తమ పేరిట పలు రికార్డులు లిఖించుకుంది. అవేమిటంటే..

ఆర్సీబీ సాధించిన రికార్డులు ఇవే
👉ఐపీఎల్‌ టోర్నీ టైటిల్‌ను వరుసగా రెండేళ్లు గెల్చుకున్న మూడో జట్టు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు. గతంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (2010, 2011లో), ముంబై ఇండియన్స్‌ (2019, 2020లో) మాత్రమే ఈ ఘనత సాధించాయి.

👉ఐపీఎల్‌లో 2011లో ‘ప్లే ఆఫ్స్‌’ ఫార్మాట్‌ మొదలయ్యాక ఇప్పటి వరకు ‘ప్లే ఆఫ్స్‌’లోని క్వాలిఫయర్‌–1 మ్యాచ్‌లో గెలిచిన జట్టే విజేతగా నిలువడం ఇది 13వసారి కావడం విశేషం. చెన్నై (2011, 2018, 2021, 2023లో), కోల్‌కతా (2012, 2014, 2024లో), ముంబై (2015, 2019, 2020లో), బెంగళూరు (2025, 2026), గుజరాత్‌ టైటాన్స్‌ (2022లో) జట్లు ఈ ఘనత సాధించాయి.  

👉చెన్నై (5 సార్లు), ముంబై (5 సార్లు), కోల్‌కతా (3 సార్లు) జట్ల తర్వాత ఐపీఎల్‌ టోర్నీ టైటిల్‌ను రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు గెలిచిన నాలుగో జట్టుగా బెంగళూరు నిలిచింది.

దిగ్గజాల సరసన రజత్‌ పాటీదార్‌
👉ఐపీఎల్‌ టైటిల్‌ను రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు గెలిచిన నాలుగో కెప్టెన్‌ రజత్‌ పాటీదార్‌. గతేడాది (2025) పాటీదార్‌ సారథ్యంలోనే బెంగళూరు తొలిసారి ఐపీఎల్‌ టైటిల్‌ నెగ్గింది. ఈ జాబితాలో ధోని, రోహిత్‌ శర్మ (5 సార్లు చొప్పున), గౌతమ్‌ గంభీర్‌ (2 సార్లు) ఉన్నారు.

👉ఒకే వేదికపై రెండుసార్లు ఐపీఎల్‌ టైటిల్‌ సాధించిన మూడో జట్టు బెంగళూరు. 2025లోనూ అహ్మదాబాద్‌లోనే బెంగళూరు టైటిల్‌ నెగ్గింది. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్‌ (కోల్‌కతా, ఈడెన్‌గార్డెన్స్‌; 2013, 2015లో; హైదరాబాద్, ఉప్పల్‌ స్టేడియం; 2017, 2019లో), కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (చెన్నై, ఎంఎ చిదంబరం స్టేడియం; 2012, 2024లో) ఉన్నాయి.

చదవండి: వైభవ్‌ గురించి కోహ్లి ఏమన్నాడంటే!

Advertisement
 
Advertisement
Advertisement