ఆర్సీబీతో జరుగుతున్న ఐపీఎల్ 2026 తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్ టైటాన్స్ పేసర్ కగిసో రబాడ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. రబాడ రెండో ఓవర్ చివరి బంతికి దూకుడు మీద ఉన్న వెంకటేశ్ అయ్యర్‌ను (19) ఔట్ చేశాడు. శుభ్‌మన్ గిల్ అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ పట్టి అయ్యర్‌ను పెవిలియన్‌కు పంపాడు.
ఈ వికెట్‌తోనే రబాడ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో మొదటి ఆరు ఓవర్లలో అత్యధిక వికెట్లు (18) తీసిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ వికెట్‌కు ముందు రబాడ మహ్మద్ షమీతో (2023 ఎడిషన్) కలిసి ఈ రికార్డును షేర్ చేసుకున్నాడు. ఈ రికార్డుకు సంబంధించి రబాడ, షమీ తర్వాతి స్థానాల్లో మిచెల్ జాన్సన్ (16 వికెట్లు, 2013), ట్రెంట్ బౌల్ట్ (16, 2020) ఉన్నారు.
మ్యాచ్ విషయానికొస్తే.. 14 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 140-3గా ఉంది. వెంకటేశ్ అయ్యర్ (19), విరాట్ కోహ్లి (43), దేవదత్ పడిక్కల్ (30) ఔట్ కాగా.. కెప్టెన్ రజత్ పాటిదార్ (21), కృనాల్ పాండ్యా (25) క్రీజ్‌లో ఉన్నారు. గుజరాత్ బౌలర్లలో రబాడ 1, హోల్డర్ 2 వికెట్లు పడగొట్టారు. హోల్డర్ 9వ ఓవర్లో మూడు బంతుల వ్యవధిలో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. రెండో బంతికి విరాట్ కోహ్లి (43) క్లీన్ బౌల్డ్ చేసిన అతడు.. నాలుగో బంతికి పడిక్కల్‌ను పెవిలియన్‌కు పంపాడు.


