గుజరాత్‌పై ఘన విజయం.. ఫైనల్లో ఆర్సీబీ
255 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ 19.3 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటై 92 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ గెలుపుతో ఆర్సీబీ నేరుగా ఫైనల్‌కు చేరుకుంది.
ఆరో వికెట్ కోల్పోయిన గుజరాత్
8.2వ ఓవర్- 65 పరుగుల వద్ద గుజరాత్ ఆరో వికెట్ కోల్పోయింది. డఫీ బౌలింగ్‌లో హాజిల్‌వుడ్‌కు క్యాచ్ ఇచ్చి వాషింగ్టన్ సుందర్ (8) ఔటయ్యాడు.
51 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన గుజరాత్
5.4వ ఓవర్- 51 పరుగుల వద్ద గుజరాత్ ఐదో వికెట్ కోల్పోయింది. రసిక్ సలాం దార్ బౌలింగ్‌లో హాజిల్‌వుడ్‌కు క్యాచ్ ఇచ్చి జేసన్ హోల్డర్ డకౌటయ్యాడు.
పీకల్లోతు కష్టాల్లో గుజరాత్
255 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 51 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతోంది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో బట్లర్ (29) మూడో వికెట్‌గా, రసిక్ సలాం దార్ బౌలింగ్‌లో నిషాంత్ సింధు (5) నాలుగో వికెట్‌గా వెనుదిరిగారు.
రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్
3.1వ ఓవర్- 27 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ (2) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
సాయి సుదర్శన్ హిట్ వికెట్
2.3వ ఓవర్- 17 పరుగుల వద్ద గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. గుజరాత్‌ను దరిద్రం వెంటాడంతో సాయి సుదర్శన్ (14) హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. డఫీ బౌలింగ్‌లో బంతి బౌండరీకి వెళ్లినా సుదర్శన్ బ్యాట్ చేజారి వికెట్లకు తాకింది.
పాటిదార్ ఊచకోత.. ఆర్సీబీ భారీ స్కోర్
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ భారీ స్కోర్ చేసింది. రజత్ పాటిదార్ (33 బంతుల్లో 93 నాటౌట్; 5 ఫోర్లు, 9 సిక్సర్లు) ఉగ్రరూపం దాల్చడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో పాటిదార్‌తో పాటు మిగతా ఆటగాళ్లు కూడా చెలరేగారు.
వెంకటేశ్ అయ్యర్ 7 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 19 పరుగులు, విరాట్ కోహ్లి 25 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 43, పడిక్కల్ 19 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 30, కృనాల్ పాండ్యా 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 43, టిమ్ డేవిడ్ 5 బంతుల్లో 4, జితేశ్ శర్మ 5 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 15 పరుగులు (నాటౌట్) చేశారు.
18 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పాటిదార్ క్యాచ్‌ను రబాడ మిస్ చేయడంతో గుజరాత్ మూల్యం చెల్లించుకుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఫీల్డర్లు చాలా తప్పిదాలు చేశారు. క్యాచ్‌లు, రనౌట్లు మిస్ చేయడంతో పాటు లేని పరుగులను సమర్పించుకున్నారు.
బౌలర్లు ఓ మోస్తరుగా బౌలింగ్ చేసినా ఫీల్డర్ల పొరపాట్ల కారణంగా గుజరాత్ భారీ మూల్యం చెల్లించుకుంది. గుజరాత్ బౌలర్లలో హోల్డర్, రబాడ తలో 2, ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ తీశారు.
ఐదో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
17.6వ ఓవర్- 214 పరుగుల వద్ద ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్ (4) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఆర్సీబీ నాలుగో వికెట్ డౌన్
ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. 43 పరుగులు చేసిన కృనాల్ పాండ్యా.. రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 17 ఓవర్లు ఆర్సీబీ స్కోర్: 204/4
భారీ స్కోర్ దిశగా ఆర్సీబీ
ఆర్సీబీ భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. 16 ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు మూడు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. క్రీజులో కృనాల్ పాండ్యా(43), పాటిదార్(49) ఉన్నారు.
మూడు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ
9వ ఓవర్లో ఆర్సీబీ మూడు బంతుల వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. రెండో బంతికి జేసన్ హోల్డర్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లి (43) క్లీన్ బౌల్డ్ కాగా.. నాలుగో బంతికి వికెట్ కీపర్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి పడిక్కల్ (30) పెవిలియన్‌కు చేరాడు.
పవర్ ప్లేలో దుమ్మురేపిన ఆర్సీబీ
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ పవర్ ప్లేలో దుమ్మురేపింది. సుడిగాలి ఇన్నింగ్స్ తర్వాత వెంకటేశ్ అయ్యర్ (19) ఔటైనా, విరాట్ కోహ్లి (34 నాటౌట్), దేవదత్ పడిక్కల్ (23 నాటౌట్) మెరుపులు కొనసాగించారు. 6 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 76-1గా ఉంది.
తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
1.6వ ఓవర్- 21 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో గిల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో వెంకటేశ్ అయ్యర్ (19) ఔటయ్యాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మే 26) జరుగుతున్న తొలి క్వాలిఫయర్ పోటీలో ఆర్సీబీ-గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
తుది జట్లు..
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభమన్ గిల్(సి), జోస్ బట్లర్(w), వాషింగ్టన్ సుందర్, నిశాంత్ సింధు, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, కుల్వంత్ ఖేజ్రోలియా, కగిసో రబడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(సి), జితేష్ శర్మ(w), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, జోష్ హాజిల్‌వుడ్, రసిఖ్ సలాం దార్


