పాటిదార్‌ మహోగ్రరూపం​.. ఆల్‌టైమ్‌ రికార్డులు బద్దలు కొట్టిన ఆర్సీబీ | IPL 2026 Qualifier 1 RCB VS GT, Patidars Rampage And RCB Shatters All Time Records, Check Out Highest Scores List Inside | Sakshi
Sakshi News home page

పాటిదార్‌ మహోగ్రరూపం​.. ఆల్‌టైమ్‌ రికార్డులు బద్దలు కొట్టిన ఆర్సీబీ

May 26 2026 9:41 PM | Updated on May 27 2026 10:46 AM

IPL 2026 Qualifier 1 RCB VS GT: Patidars Rampage, RCB Shatters All Time Records

ఐపీఎల్‌ 2026 తొలి క్వాలిఫయర్‌లో ఆర్సీబీ-గుజరాత్‌ టైటాన్స్‌ తలపడుతున్నాయి. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసి అతి భారీ స్కోర్‌ చేసింది.

రజత్‌ పాటిదార్‌ (33 బంతుల్లో 93 నాటౌట్‌; 5 ఫోర్లు, 9 సిక్సర్లు) మహోగ్రరూపం​ దాల్చడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో పాటిదార్‌తో పాటు మిగతా ఆటగాళ్లు కూడా చెలరేగారు.

వెంకటేశ్‌ అయ్యర్‌ 7 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 19 పరుగులు, విరాట్‌ కోహ్లి 25 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 43, పడిక్కల్‌ 19 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 30, కృనాల్‌ పాండ్యా 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 43, టిమ్‌ డేవిడ్‌ 5 బంతుల్లో 4, జితేశ్‌ శర్మ 5 బంతుల్లో ఫోర్‌, సిక్సర్‌ సాయంతో 15 పరుగులు (నాటౌట్‌) చేశారు. గుజరాత్‌ బౌలర్లలో​ హోల్డర్‌, రబాడ తలో 2, ప్రసిద్ద్‌‌ కృష్ణ ఓ వికెట్‌ తీశారు.

కాగా, ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఆల్‌టైమ్‌ పలు రికార్డులు బద్దలు కొట్టింది. ఐపీఎల్‌ నాకౌట్స్‌/ప్లే ఆఫ్స్‌లో అత్యధిక స్కోర్‌ చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. అలాగే ఐపీఎల్‌ నాకౌట్స్‌/ప్లే ఆఫ్స్‌లో అత్యధిక బౌండరీలు సాధించిన జట్టుగానూ సరికొత్త రికార్డు నెలకొల్పింది.

ఐపీఎల్‌ నాకౌట్స్‌/ప్లే ఆఫ్స్‌లో అత్యధిక స్కోరు
254/5 RCB vs PBKS ధర్మశాల 2026 *
233/3 GT vs MI అహ్మదాబాద్ 2023
228/5 MI vs GT న్యూ చండీగఢ్ 2025
226/6 PBKS vs CSK వాంఖడే 2014
222/5 CSK vs DC చెన్నై 2012

ఐపీఎల్‌ నాకౌట్స్‌/ప్లే ఆఫ్స్‌లో అత్యధిక బౌండరీలు
38 RCB vs GT ధర్మశాల 2026 *
33 CSK vs DC చెన్నై 2012
32 PBKS vs CSK వాంఖేడే 2014
31 GT vs MI అహ్మదాబాద్ 2023
31 MI vs GT న్యూ చండీగఢ్ 2025

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement