‘అతడు మూడు ఓవర్లు వేశాడంటే ఆర్సీబీ ఓటమి ఖాయం’ | Kris Srikkanth Strong Warning To RCB Ahead Of IPL 2026 Final Vs GT, Says RCB Are Finished If He Bowls 3 Overs | Sakshi
Sakshi News home page

RCB Vs GT: ‘అతడు మూడు ఓవర్లు వేశాడంటే ఆర్సీబీ ఓటమి ఖాయం’

May 31 2026 2:33 PM | Updated on May 31 2026 4:26 PM

If he bowls 3 overs In Final RCB are gone: Kris Srikkanth Slams This star

ఆర్సీబీ (PC: RCB/BCCI)

డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) ఈసారీ కప్పు కొట్టాలని పట్టుదలగా ఉంది. ఐపీఎల్‌-2026 సీజన్‌ ఆది నుంచి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న పాటిదార్‌ సేన.. టేబుల్‌ టాపర్‌గా, తొలి ఫైనలిస్టుగా నిలిచింది.

ఈ క్రమంలో గుజరాత్‌ టైటాన్స్‌తో ఆదివారం నాటి టైటిల్‌ పోరుకూ పూర్తిస్థాయిలో సన్నద్ధమైన ఆర్సీబీ.. ఆఖరి గండాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని ఉవ్విళ్లూరుతోంది. కాగా తాజా ఎడిషన్‌లోనూ ఆర్సీబీ బౌలింగ్‌ దళం అదరగొడుతున్న సంగతి తెలిసిందే.

పటిష్టంగా పేస్‌ దళం
టీమిండియా వెటరన్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ఇప్పటికి 26 వికెట్లతో సత్తా చాటగా.. యువ ఆటగాడు రసిఖ్‌ దర్‌ సైతం 16 వికెట్లు కూల్చాడు. మిగిలిన వారిలో కృనాల్‌ పాండ్యా, జట్టుతో ఆలస్యంగా చేరిన జోష్‌ హాజిల్‌వుడ్‌ చెరో 13 వికెట్లతో ఉన్నారు. వీరికి తోడుగా సూయశ్‌ శర్మ (9), జేకబ్‌ డఫీ (9) కూడా రాణిస్తున్నారు.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ బెంగళూరు జట్టు నాయకత్వ బృందానికి కీలక సూచన చేశాడు. గుజరాత్‌తో ఫైనల్లో రొమారియో షెఫర్డ్‌ చేతికి మాత్రం బంతిని ఇవ్వొద్దని సూచించాడు. అదే విధంగా ఫిల్‌ సాల్ట్‌ తిరిగి వచ్చినా వెంకటేశ్‌ అయ్యర్‌నే ఓపెనర్‌గా కొనసాగించాలని చిక్కా పేర్కొన్నాడు.

అతడినే ఓపెనర్‌గా కొనసాగించాలి
ఈ మేరకు.. ‘‘ఫిల్‌ సాల్ట్‌ పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్‌ సాధించాడా? లేదా? అన్న అంశంపై స్పష్టత లేదు. ఒకవేళ అతడు ఫిట్‌గా ఉన్నా వెంకటేశ్‌ అయ్యర్‌ బాగా ఆడుతున్నాడు కాబట్టి అతడినే ఓపెనర్‌గా కొనసాగిస్తే మంచిది.

అతడు 3 ఓవర్లు వేశాంటే ఆర్సీబీ ఖేల్‌ ఖతమే
ఇక బౌలింగ్‌ విషయానికొస్తే... ఒకవేళ రొమారియో షెఫర్డ్‌తో కనీసం మూడు ఓవర్లు బౌలింగ్‌ చేయించినా సరే ఆర్సీబీ ఓడిపోవడం లాంఛనమే. అతడు కచ్చితంగా మూడు ఓవర్లు వేశాంటే ఆర్సీబీ ఖేల్‌ ఖతమే.

PC: BCCI

షెఫర్డ్‌ చేతికి అస్సలు బంతిని ఇవ్వకండి. నన్నడిగితే అతడికి తుదిజట్టులో కూడా చోటు ఇవ్వకండి’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ చెప్పుకొచ్చాడు. కాగా వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ రొమారియో షెఫర్డ్‌ గతేడాది కప్పు గెలిచిన ఆర్సీబీ జట్టులో సభ్యుడు.

పేలవ ప్రదర్శన
ఈ క్రమంలో తాజా ఎడిషన్‌కు కూడా ఆర్సీబీ షెఫర్డ్‌ను అట్టిపెట్టుకుంది. ఇక ఈ సీజన్‌లో అతడు.. ఇప్పటికి 14 మ్యాచ్‌లలో కలిపి సగటు 42, ఎకానమీ 12తో చెత్తగా బౌలింగ్‌ చేసి.. ఏడు వికెట్లు తీయగలిగాడు. ఇక బ్యాటర్‌గా 14 మ్యాచ్‌లలో కలిపి కేవలం 83 పరుగులే రాబట్టాడు. చివరగా గుజరాత్‌తో క్వాలిఫయర్‌-1లో షెఫర్డ్‌ ఒక ఓవర్‌ వేసి 15 పరుగులు ఇచ్చుకున్నాడు.

ఐపీఎల్‌-2026 ఫైనల్‌.. ఆర్సీబీ వర్సెస్‌ గుజరాత్‌ ​తుది జట్లు (అంచనా) 
ఆర్సీబీ: 
రజత్‌ పాటిదార్‌ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, ఫిల్‌ సాల్ట్‌/ వెంకటేశ్ అయ్యర్‌, దేవ్‌దత్‌ పడిక్కల్, కృనాల్ పాండ్యా, టిమ్‌ డేవిడ్, జితేశ్ శర్మ, రొమారియో షెఫర్డ్, భువనేశ్వర్ కుమార్‌, జోష్‌ హాజిల్‌వుడ్, రసిఖ్‌ దర్‌, జేకబ్‌ డఫీ/ సుయశ్‌ శర్మ‌ 

గుజరాత్‌:  
శుబ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), సాయి సుదర్శన్, జోస్‌ బట్లర్, వాషింగ్టన్‌ సుందర్, నిశాంత్ సంధు, జేసన్‌ హోల్డర్, రాహుల్‌ తెవాటియా, రషీద్ ఖాన్‌, కగిసో రబాడ, మహ్మద్‌ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, సాయికిషోర్‌.   

చదవండి: కెప్టెన్‌ రేసు.. ఆ ముగ్గురిని ఎంపిక చేసిన బీసీసీఐ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement