breaking news
Kwena Maphaka
-
ఆసీస్‌తో వన్డేలు: బవుమా రీఎంట్రీ.. యంగ్ పేస్ గన్ వచ్చేశాడు
సౌతాఫ్రికా యువ సంచలనం క్వెనా మఫాకా (Kwena Maphaka) వన్డే జట్టులోకి తిరిగి వచ్చాడు. ఆస్ట్రేలియాతో యాభై ఓవర్ల ఫార్మాట్ సిరీస్ ఆడే ప్రొటిస్ జట్టులో అతడు చోటు దక్కించుకున్నాడు. కాగా సౌతాఫ్రికా క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.టీ20 సిరీస్‌లో ఆసీస్ చేతిలో ఓటమిఆసీస్తో మూడు టీ20, మూడు వన్డేల (AUS vs SA) సిరీస్ ఆడేందుకు ప్రొటిస్ జట్టు అక్కడికి వెళ్లింది. ఈ క్రమంలో తొలుత పొట్టి ఫార్మాట్ సిరీస్ జరుగగా.. ఆతిథ్య ఆసీస్.. సౌతాఫ్రికాను 2-1తో ఓడించింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య మంగళవారం (ఆగష్టు 19) నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది.అదరగొట్టిన మఫాకా, బ్రెవిస్ఈ నేపథ్యంలో తమ జట్టులోకి క్వెనా మఫాకాను చేర్చినట్లు సౌతాఫ్రికా సోమవారం ప్రకటించింది. కాగా 19 ఏళ్ల లెఫ్టార్మ్ పేసర్ అయిన మఫాకా.. గతేడాది అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. సౌతాఫ్రికా తరఫున ఇప్పటి వరకు రెండు టెస్టులు, రెండు వన్డేలు, 11 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో మూడు, వన్డేల్లో ఐదు, టీ20లలో 15 వికెట్లు పడగొట్టాడు.ఇటీవల ఆసీస్‌తో టీ20 సిరీస్‌లో క్వెనా మఫాకా అదరగొట్టాడు. మూడు మ్యాచ్‌లలో కలిపి తొమ్మిది వికెట్లు తీసి.. టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో సెలక్టర్లు అతడిని వన్డే జట్టులోకి తిరిగి పిలిపించారు. కాగా క్వెనా మఫాకా గతేడాది పాకిస్తాన్‌తో చివరగా వన్డే మ్యాచ్ ఆడాడు.మరోవైపు.. బ్యాటింగ్ యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis) ఆస్ట్రేలియాతో సిరీస్ సందర్భంగా వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. కంగారూలతో టీ20 సిరీస్‌లో 22 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 200కు పైగా స్ట్రైక్‌రేటుతో ఏకంగా 180 పరుగులు రాబట్టాడు.బవుమా రీఎంట్రీ.. యంగ్ గన్స్ఈ నేపథ్యంలో క్వెనా మఫాకా, డెవాల్డ్ బ్రెవిస్ గురించి కెప్టెన్ టెంబా బవుమా మాట్లాడుతూ.. ‘‘యువకులు జట్టులో ఉండటం ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటుంది. ముఖ్యంగా బ్రెవిస్.. సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.జట్టు కష్టాల్లో ఉన్న వేళ నేనున్నానంటూ ముందుకు వస్తున్నాడు. వన్డేల్లోనూ అతడు రాణించగలడు’’ అని కొనియాడాడు. కాగా ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో సౌతాఫ్రికాను విజేతగా నిలిపిన తర్వాత బవుమా.. గాయం నుంచి కోలుకునే క్రమంలో విశ్రాంతి తీసుకున్నాడు. ఆసీస్‌తో వన్డే సిరీస్ సందర్భంగా అతడు రీఎంట్రీ ఇస్తున్నాడు.ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టుటెంబా బావుమా (కెప్టెన్), కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రీ బర్గర్, టోనీ డి జోర్జి, ఐడెన్ మార్క్రమ్, క్వెనా మఫాకా, సెనురాన్ ముత్తుసామి, కేశవ్ మహరాజ్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, లువాన్-డ్రే ప్రిటోరియస్, కగిసో రబడ, రియాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, ప్రనెలన్ సబ్రాయన్.సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, అలెక్స్ కారీ, కూపర్ కొన్నోలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, మార్నస్ లబుషేన్, ఆడమ్ జంపా.చదవండి: ఆసియా కప్- 2025: అభిషేక్ శర్మకు జోడీగా.. వైభవ్ సూర్యవంశీ ఉండాలి: మాజీ కెప్టెన్ -
బ్రెవిస్ బీభత్సం
డార్విన్: దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ మెరుపు ప్రదర్శనతో చెలరేగిపోయాడు. ఆ్రస్టేలియాతో జరిగిన రెండో టి20లో అతను ఫోర్లు, సిక్సర్లతో సత్తా చాటి ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. ఈ క్రమంలో బ్రెవిస్ దక్షిణాఫ్రికా తరఫున టి20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 53 పరుగుల తేడాతో ఆ్రస్టేలియాపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఆ్రస్టేలియాపై దక్షిణాఫ్రికాకు టి20ల్లో ఇదే అత్యధిక స్కోరు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డెవాల్డ్ బ్రెవిస్ (56 బంతుల్లో 125 నాటౌట్; 12 ఫోర్లు, 8 సిక్స్‌లు) అజేయ శతకంతో చెలరేగాడు. అనంతరం ఆసీస్ 17.4 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌటైంది. టిమ్ డేవిడ్ (24 బంతుల్లో 50; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా... మిగతావారంతా విఫలమయ్యారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు 1–1తో సమంగా నిలవగా, చివరి టి20 శనివారం జరుగుతుంది. బౌండరీలతోనే 96 పరుగులు... ఐదో ఓవర్లో దక్షిణాఫ్రికా స్కోరు 44/2 వద్ద ఉన్నప్పుడు క్రీజ్‌లోకి వచ్చిన బ్రెవిస్ చివరి వరకు నిలిచాడు. తాను ఎదుర్కొన్న మూడో బంతికి తొలి ఫోర్ కొట్టిన అతను అదే జోరు కొనసాగిస్తూ ఒక దశలో 24 బంతుల్లో 44 పరుగులు చేశాడు. ఆ తర్వాత మ్యాక్స్‌వెల్ ఓవర్లో వరుసగా 6, 6, 4, 6 బాదడం ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. ఈ ఓవర్లో అతను 56 పరుగుల వద్ద ఉన్నప్పుడు లాంగాన్‌లో ఇచ్చిన క్యాచ్‌ను కునెమన్ వదిలేయడం కూడా కలిసొచ్చింది. 25 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసున్న బ్రెవిస్‌కు శతకం చేసుకునేందుకు మరో 16 బంతులు మాత్రమే సరిపోయాయి. హాజల్‌వుడ్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాదిన తర్వాత డ్వార్షుయిస్ ఓవర్లో కొట్టిన మూడో ఫోర్‌తో 41 బంతుల్లోనే బ్రెవిస్ శతకం పూర్తయింది. ఛేదనలో డేవిడ్‌కు ఇతర ఆసీస్ బ్యాటర్లెవరూ సహకారం అందించలేదు. ఒకదశలో 9.3 ఓవర్లలో 106/3తో ఉన్నా...ఆ తర్వాత జట్టు తడబడింది. 125 టి20ల్లో దక్షిణాఫ్రికా తరఫున బ్రెవిస్ స్కోరు (125) అత్యధికం. డుప్లెసిస్ (119)ను అతను అధిగమించాడు.2 దక్షిణాఫ్రికా తరఫున ఇది రెండో ఫాస్టెస్ట్ (41 బంతుల్లో) సెంచరీ. ప్రస్తుతం డేవిడ్ మిల్లర్ (35 బంతుల్లో) పేరిట ఈ రికార్డు ఉంది.1 అతి పిన్న వయసులో అంతర్జాతీయ టి20 శతకం బాదిన దక్షిణాఫ్రికా బ్యాటర్‌గా (22 ఏళ్ళ 105 రోజులు) నిలిచిన బ్రెవిస్... రిచర్డ్ లెవీ (24 ఏళ్ల 36 రోజులు) రికార్డును సవరించాడు.చదవండి: AUS vs SA: చరిత్ర సృష్టించిన బ్రెవిస్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా రికార్డు -
సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా.. చరిత్రలో తొలిసారి ఇలా..!
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా నిన్న (ఆగస్ట్ 10) జరిగిన తొలి టీ20లో సౌతాఫ్రికా 17 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవరల్లో 178 పరుగులకు ఆలౌటైంది. పొట్టి క్రికెట్లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను ఆలౌట్ చేయడం ఇదే తొలిసారి (26 టీ20ల్లో).ఈ మ్యాచ్‌లో మరిన్ని రికార్డులు కూడా నమోదయ్యాయి. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా రికార్డు స్థాయిలో వరుసగా 9 టీ20 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. గతంలో ఆసీస్ వరుసగా ఇన్ని టీ20 మ్యాచ్‌ల్లో ఎప్పుడూ గెలవలేదు. ఈ సిరీస్‌కు ముందు ఆసీస్ వెస్టిండీస్‌ను వారి సొంతగడ్డపై 5-0 తేడాతో ఓడించింది.ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు 13 సిక్సర్లు బాదారు. టీ20ల్లో సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా (ఓ మ్యాచ్‌లో) బాదిన అత్యధిక సిక్సర్లు ఇవే. 2023లో డర్బన్‌లో జరిగిన టీ20లోనూ ఇన్నే సిక్సర్లు నమోదయ్యాయి.ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా యువ పేసర్ క్వేనా మపాకా ఓ ఆల్‌టైమ్ రికార్డును నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 20 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన మపాకా టెస్ట్ హోదా కలిగిన దేశాల్లో నాలుగు వికెట్ల ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా (19 ఏళ్ల 318 రోజులు) రికార్డు సాధించాడు. అలాగే పొట్టి ఫార్మాట్లో ఆస్ట్రేలియాపై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన సౌతాఫ్రికా బౌలర్‌గా నిలిచాడు.మ్యాచ్ విషయానికొస్తే.. మపాకా (4-0-20-4), రబాడ (4-0-29-2) అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఆస్ట్రేలియా 178 పరుగులకు ఆలౌటైంది. వాస్తవానికి ఆసీస్ ఈ స్కోర్ కూడా సాధించలేకపోయేది. 75 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశలో టిమ్ డేవిడ్ మెరుపు ఇన్నింగ్స్ (52 బంతుల్లో 83; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆడి ఆసీస్‌కు ఈ స్కోర్ అందించాడు. గ్రీన్ ఓ మోస్తరు ప్రదర్శన (13 బంతుల్లో 35; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశాడు. వీరు మినహా ఆసీస్ ఇన్నింగ్స్‌లో అంతా విఫలమయ్యారు. మిచెల్ మార్ష్ 13, ట్రవిస్ హెడ్ 2, జోస్ ఇంగ్లిస్ 0, మిచెల్ ఓవెన్ 2, మ్యాక్స్‌వెల్ 1, డ్వార్షుయిస్ 17, ఎల్లిస్ 12, జంపా ఒక్క పరుగు చేశారు. ప్రొటీస్ బౌలర్లలో మపాకా, రబాడతో పాటు ఎంగిడి, లిండే, ముత్తాసామి వికెట్లు తీశారు (తలో వికెట్).అనంతరం సౌతాఫ్రికా లక్ష్య ఛేదనలో తడబడింది. హాజిల్‌వుడ్ (4-0-27-3), డ్వార్షుయిస్ (4-0-26-3), జంపా (4-0-33-2), మ్యాక్స్‌వెల్ (4-0-29-1) అద్భుతంగా బౌలింగ్ చేసి సౌతాఫ్రికాను 161 పరుగులకే కట్టడి చేశారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఓపెనర్ రికెల్టన్ (55 బంతుల్లో 71; 7 ఫోర్లు, సిక్స్) ఒక్కడే రాణించాడు. ట్రిస్టన్ స్టబ్స్ (27 బంతుల్లో 37) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. మిగతా బ్యాటర్లలో మార్క్రమ్ 12, ప్రిటోరియస్ 14, బ్రెవిస్ 2, లిండే 0, బాష్ 2, ముత్తుసామి 0, రబాడ 10, మపాకా 3 (నాటౌట్) పరుగులు చేశారు. ఈ సిరీస్‌లో రెండో టీ20 ఆగస్ట్ 12న జరుగనుంది. -
19 ఏళ్ల వయస్సులో సంచలనం.. సౌతాఫ్రికా ప్లేయర్ వరల్డ్ రికార్డు
డార్విన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో సౌతాఫ్రికా యువ పేసర్ క్వేనా మఫాకా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. 19 ఏళ్ల మఫాకా తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను బెంబెలెత్తించాడు. టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, బెన్ డ్వార్షుయిస్, జంపాలను యువ సంచలనం పెవిలియన్‌కు పంపాడు.మఫాకా మొత్తంగా తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 20 పరుగులు మాత్రమే 4 వికెట్లను పడగొట్టాడు. ఈ క్రమంలో సఫారీ స్పీడ్ స్టార్ ఓ వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.తొలి ప్లేయర్‌గా.. అంతర్జాతీయ టీ20ల్లో పూర్తి సభ్య దేశాల(టెస్టు హోదా కలిగిన జట్లు) నుంచి నాలుగు వికెట్ల హాల్ సాధించిన అతి పిన్న వయస్కుడిగా మఫాకా చరిత్ర సృష్టించాడు. మఫాకా కేవలం 19 సంవత్సరాల 124 రోజుల వయస్సులో ఈ ఫీట్ సాధించాడు.ఇంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా మాజీ బౌలర్ వేన్ పార్నెల్ పేరిట ఉండేది. పార్నెల్ 2009లో వెస్టిండీస్‌పై 19 సంవత్సరాల 318 రోజుల వయస్సులో ఫోర్ వికెట్ల హాల్ సాధించాడు. తాజా మ్యాచ్‌తో పార్నెల్ ఆల్‌టైమ్ రికార్డును మఫాకా బ్రేక్ చేశాడు.అదేవిధంగా టీ20ల్లో ఆస్ట్రేలియాపై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన సఫారీ బౌలర్‌గా కూడా మఫాకా నిలిచాడు. ఇంతకుముందు రికార్డు కైల్ అబాట్, తహీర్, వైస్ పేరిట ఉండేది. వీరిముగ్గురూ కూడా ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచ్‌లో 21 పరుగులిచ్చి 3 వికెట్లు తీశారు. తాజా మ్యాచ్‌తో ఈ త్రయాన్ని మఫాకా అధిగమించాడు. కాగా తొలి టీ20లో ఆస్ట్రేలియా చేతిలో 17 పరుగుల తేడాతో సౌతాఫ్రికా ఓటమిపాలైంది.చదవండి: ఆసియాకప్ గెలిచేది ఆ జట్టే: సౌరవ్ గంగూలీ -
CT 2025: సౌతాఫ్రికాకు భారీ షాక్!.. స్టార్ పేసర్ అవుట్
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చాంపియన్స్ ట్రోఫీ(ICC Chapions Trophy)లో పాల్గొనే దక్షిణాఫ్రికా జట్టులో కార్బిన్ బాష్(Corbin Bosch) చోటు దక్కించుకున్నాడు. పేసర్ అన్రిచ్ నోర్జే(Anrich Nortje) గాయంతో ఈ టోర్నీకి దూరం కావడంతో... అతడి స్థానంలో క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) బాష్‌ను ఎంపిక చేసింది. వెన్ను నొప్పితో బాధపడుతున్న నోర్జే 2023లో భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్ బరిలోకి కూడా దిగలేదన్న విషయం తెలిసిందే.ఇక నోర్జే స్థానంలో చాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి వచ్చిన 30 ఏళ్ల బాష్ గతేడాది డిసెంబర్లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. పాకిస్తాన్‌తో మూడో వన్డేలో బరిలోకి దిగి ఒక వికెట్ తీసిన ఈ రైటార్మ్ పేసర్.. లక్ష్య ఛేదనలో నలభై పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇలా.. ఒక్క మ్యాచ్ అనుభవంతోనే అతడు ఏంగా ఐసీసీ టోర్నీకి ఎంపికకావడం విశేషం. ఒకే ఒక్క మ్యాచ్ ఆడి జట్టులోకి వచ్చేశాడు! ఇక కార్బిన్ బాష్‌ను ప్రధాన జట్టుకు ఎంపిక చేయడంతో పాటు యంగ్ పేసర్ క్వెనా మఫాకాను ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఎంపిక చేసినట్లు సీఎస్ఏ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు పాకిస్తాన్లో ముక్కోణపు టోర్నీ ఆడుతుండగా... తొలి మ్యాచ్ అనంతరం బాష్, మఫాకాతో పాటు టోనీ డీ జోర్జీ సఫారీ జట్టుతో కలవనున్నట్లు సీఎస్ఏ వెల్లడించింది. ఎనిమిది జట్లుకాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్- దుబాయ్ వేదికలుగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. ఈ ఐసీసీ టోర్నీలో ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ నేరుగా అడుగుపెట్టగా.. వన్డే ప్రపంచకప్-2023లో ప్రదర్శన ఆధారంగా విజేత ఆస్ట్రేలియా, రన్నరప్ టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ అర్హత సాధించాయి.షెడ్యూల్ ఇదేఇక ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించి ఇప్పటికే ఎనిమిది బోర్డులు తమ ప్రాథమిక జట్లను ప్రకటించగా.. టీమ్‌లలో మార్పులు చేసుకునేందుకు ఫిబ్రవరి 12 వరకు సమయం ఉంది. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-‘ఎ’లో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఉండగా.. గ్రూప్-‘బి’ నుంచి అఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా పోటీ పడుతున్నాయి.ఈ ఐసీసీ టోర్నీలో భాగంగా సౌతాఫ్రికా ఫిబ్రవరి 21నతమ తొలి మ్యాచ్ ఆడనుంది. కరాచీ వేదికగా అఫ్గనిస్తాన్‌తో తలపడనుంది. అనంతరం రావల్పిండిలో ఫిబ్రవరి 25న ఆస్ట్రేలియాతో రెండో మ్యాచ్ పూర్తి చేసుకుని.. మళ్లీ కరాచీ వేదికగానే లీగ్ దశలో తమ చివరి మ్యాచ్ ఆడనుంది. మార్చి 1న ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే సౌతాఫ్రికా జట్టుతెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్దర్, లుంగి ఎన్గిడి, కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, తబ్రేజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్, రాస్సీ వాన్ డసెన్, కార్బిన్ బాష్.ట్రావెలింగ్ రిజర్వ్: క్వెనా మఫాకా.చదవండి: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ టెండుల్కర్‌ను దాటేసి.. -
పాక్‌తో వన్డే సిరీస్.. సౌతాఫ్రికా విధ్వంసకర వీరుల రీఎంట్రీ
పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు క్రికెట్ సౌతాఫ్రికా తమ జట్టును ప్రకటించింది. తెంబా బవుమా సారథ్యంలోని ఈ జట్టులో క్వెనా మఫాకాకు తొలిసారి చోటు ఇచ్చినట్లు తెలిపింది. ఇక ఈ సిరీస్‌తో కగిసో రబడ, ట్రిస్టన్ స్టబ్స్, కేశవ్ మహరాజ్ పునరాగమనం చేయనుండగా.. టీ20 వీరులు డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్ సైతం తిరిగి వన్డే జట్టులో స్థానం సంపాదించారు.డిసెంబరు 17 నుంచి వన్డే సిరీస్ కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ సౌతాఫ్రికా పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య డిసెంబరు 10న తొలి టీ20 జరుగగా.. ఆతిథ్య జట్టు 11 పరుగుల తేడాతో పాక్‌పై గెలిచింది. ఇక డిసెంబరు 13న రెండో, డిసెంబరు 14న మూడో టీ20 జరుగునుండగా.. డిసెంబరు 17 నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది.‘అన్క్యాప్డ్’ ప్లేయర్‌కు చోటుఈ నేపథ్యంలో సౌతాఫ్రికా గురువారం తమ వన్డే జట్టును ప్రకటించింది. ఇక ఈ సిరీస్‌తో పద్దెమినిదేళ్ల లెఫ్టార్మ్ పేసర్ క్వెనా మఫాకా వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఇటీవల వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన క్వెనా మఫాకా.. పాక్‌తో తొలి టీ20లో అదరగొట్టాడు. తన అద్భుత బౌలింగ్‌తో బాబర్ ఆజంను అవుట్ చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తిచేసి 39 పరుగులిచ్చి రెండు వికెట్లు కూల్చాడు.గాయాల బెడదమరోవైపు.. స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జే కాలి గాయం కారణంగా.. మిగిలిన రెండు టీ20లు, వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఇక వేలు విరిగిన కారణంగా వియాన్ ముల్దర్, తుంటినొప్పి వల్ల లుంగి ఎంగిడి, గజ్జల్లో గాయం కారణంగా గెరాల్డ్ కోయెట్జి, వెన్నునొప్పితో బాధపడుతున్న నండ్రీ బర్గర్ సెలక్షన్‌కు అందుబాటులో లేకుండా పోయారు.వారికి పునఃస్వాగతంఇదిలా ఉంటే.. పాక్‌తో టీ20 సిరీస్‌లో విశ్రాంతి తీసుకున్న రబడ, స్టబ్స్, కేశవ్ మహరాజ్ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా కోచ్ రాబ్ వాల్టర్ మాట్లాడుతూ.. తాము తమ వన్డే జట్టు పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నట్లు తెలిపాడు. క్వెనా మఫాకాకు కొత్త పాఠాలు నేర్చుకునే అవకాశం దొరుకుతుందని.. క్లాసెన్, మిల్లర్లకు వన్డే జట్టులోకి తిరిగి స్వాగతం పలుకుతున్నట్లు పేర్కొన్నాడు.పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు సౌతాఫ్రికా క్రికెట్ జట్టుతెంబా బవుమా (కెప్టెన్), ఒట్ట్నీల్ బార్ట్‌మన్, టోనీ డి జోర్జీ, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), కేశవ్ మహరాజ్, క్వెనా మఫాకా, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, ఆండిల్ ఫెహ్లుక్వాయో, కగిసో రబాడ, ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, తబ్రేజ్ షంసీ, రాస్సీ వాన్ డెర్ డస్సెన్.సౌతాఫ్రికా వర్సెస్ పాకిస్తాన్ వన్డే సిరీస్ షెడ్యూల్తొలి వన్డే- డిసెంబరు 17- పర్ల్- బోలాండ్ పార్క్రెండో వన్డే- డిసెంబరు 19- సెంచూరియన్- సూపర్‌స్పోర్ట్ పార్క్మూడో వన్డే- డిసెంబరు 22- జొహన్నస్‌బర్గ్- ది వాండరర్స్ స్టేడియం.చదవండి: భారత్‌తో మూడో టెస్టు... ఆసీస్ స్టార్ క్రికెటర్‌పై వేటు! -
'మళ్లీ స్కూల్‌కు వెళ్తా.. విండీస్ టూర్లో కూడా చదువుకున్నా'
క్వేనా మఫాకా.. దక్షిణాఫ్రికా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అంత్యంత పిన్న వయస్కుడు. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో 18 ఏళ్ల మఫాకా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. తద్వారా ఈ ఘనతను మఫాకా తన పేరిట లిఖించుకున్నాడు.ఈ ఏడాది జరిగిన అండర్-19 క్రికెట్ వరల్డ్‌కప్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో మఫాకాకు సీనియర్ ప్రోటీస్ జట్టులో చోటు దక్కింది. అయితే తనకు వచ్చిన అవకాశాన్ని ఈ యువ సంచలనం అందిపుచ్చుకోలేకపోయాడు. విండీస్ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన అతడు 54 పరుగులిచ్చి కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. అంతర్జాతీయ అరంగేట్రానికి ముందు ఐపీఎల్లో కూడా మఫాకా ఆడాడు.ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ తరపున క్యాచ్‌రిచ్ లీగ్‌లోకి అడగుపెట్టాడు. కానీ అక్కడ కూడా ఈ ప్రోటీస్ యువ పేసర్ తన మార్క్ చూపించలేకపోయాడు. ఐపీఎల్లో 2 మ్యాచ్‌లు ఆడిన మఫాక ఏకంగా 89 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్ సాధించాడు. దీంతో మిగితా మ్యాచ్‌లకు ముంబై ఫ్రాంచైజీ అతడిని పక్కన పెట్టింది. అయితే మఫాకా వికెట్లు సాధించకపోయినప్పటకి 150 పైగా వేగంతో బౌలింగ్ చేసి అందరని ఆకట్టుకున్నాడు.చదవును కొనసాగిస్తున్నా?ఇక వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ అనంతరం ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మఫాక పలు అసక్తికర విషయాలను వెల్లడించాడు. ఓ వైపు క్రికెట్‌ను, మరో వైపు తన చదువును ఎలా బ్యాలెన్స్ చేశాడో అతడు చెప్పుకొచ్చాడు."నేను తిరిగి ఇంటికి వెళ్లాక ప్రిలిమ్స్(స్కూల్ ఎడ్యూకేషన్) కోసం సిద్దమవుతాను. మళ్లీ నా స్కూల్‌కు వెళ్తాను. విండీస్ టార్ సమయంలో కూడా నా చదువును కొనసాగించాను. ఓ వైపు కొంచెం కొంచెం చదవుతూ నా ఆటపై దృష్టి పెట్టాను. ప్రిలిమ్స్ తర్వాత నాకు ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ పరీక్షలతో నా పాఠశాల విద్య పూర్తి అవుతోంది. దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఇది ఎప్పటికీ నాకు గుర్తుండిపోతుంది. అదే విధంగా ప్రోటీస్‌కు అత్యున్నత స్ధాయిలో ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రతీ ఒక్క ఆటగాడి చిరకాల స్వప్నం. క్రికెట్ అంటే నాకు చిన్నతనం నుంచే మక్కువ ఎక్కువ. ఆరు, ఏడేళ్ల వయస్సు నుంచే దక్షిణాఫ్రికా తరపున ఆడాలని కలలు కన్నాను అని ఐవోఎల్.కామ్( iol.com.za)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మఫాకా పేర్కొన్నాడు.