వైభవ్ సూర్యవంశీ మిత్రుడి విధ్వంసం.. కేవలం 29 బంతుల్లోనే | Khilan Patels Stormy 84 Leads Gujarat to a 21-Run Win Over Odisha in SMAT 2026 | Sakshi
Sakshi News home page

వైభవ్ సూర్యవంశీ మిత్రుడి విధ్వంసం.. కేవలం 29 బంతుల్లోనే

Nov 14 2026 4:54 PM | Updated on Nov 14 2026 5:08 PM

Khilan Patels Stormy 84 Leads Gujarat to a 21-Run Win Over Odisha in SMAT 2026

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2026లో గుజరాత్ శుభారంభం చేసింది. శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఒడిశాతో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో గుజరాత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో  9 వికెట్ల నష్టానికి 250 పరుగులు భారీ స్కోర్ సాధించింది.

గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ ఉర్విల్‌ పటేల్‌(30 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 62) మినహా మిగితా టాపార్డర్‌ బ్యాటర్లంతా విఫలమయ్యారు. అయితే ఆరోస్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన యువ ఆటగాడు ఖిలాన్ పటేల్ విధ్వంసం సృష్టించాడు. ఈడెన్‌ గార్డెన్స​్‌ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు.

ఖిలాన్ కేవలం 29 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 84 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా ఖిలాన్‌ పటేల్‌.. భారత అండర్‌-19 జట్టుకు యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీతో కలిసి ఆడాడు. ఈ ఏడాది అండర్‌-19 వరల్డ్‌కప్‌ను భారత్‌ గెలవడంలో పటేల్‌ది కీలక పాత్ర.

పోరాడి ఓడిన ఒడిశా
అనంతరం 251 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఒడిశా.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 229 రన్స్‌ చేయగల్గింది. ఒడిశా బ్యాటర్లలో సుభ్రాంశు సేనాపతి(89), కార్తీక్ బిస్వాల్(55) హాఫ్‌ సెంచరీలతో రాణించగా.. మిగిలా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. గుజరాత్‌  బౌలర్లలో అర్జాన్ నాగ్వాస్వాళ్ల నాలుగు వికెట్లు పడగొట్టగా.. రవి బిష్ణోయ్‌ రెండు, హర్షల్‌ పటేల్‌, హేమంగ్‌ పటేల్‌ తలా వికెట్‌ సాధించారు.
చదవండి: IND vs PAK: పాకిస్తాన్‌తో ఫైన‌ల్.. ఆర్య‌వీర్ సెహ్వాగ్ సూప‌ర్ హాఫ్ సెంచ‌రీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement