పాకిస్తాన్‌తో ఫైన‌ల్.. ఆర్య‌వీర్ సెహ్వాగ్ సూప‌ర్ హాఫ్ సెంచ‌రీ | U19 Asia Cup 2026 Final: Aaryavir Sehwag Shines with 58 as India Chase 338 Against Pakistan | Sakshi
Sakshi News home page

IND vs PAK: పాకిస్తాన్‌తో ఫైన‌ల్.. ఆర్య‌వీర్ సెహ్వాగ్ సూప‌ర్ హాఫ్ సెంచ‌రీ

Nov 14 2026 4:09 PM | Updated on Nov 14 2026 4:22 PM

U19 Asia Cup 2026 Final: Aaryavir Sehwag Shines with 58 as India Chase 338 Against Pakistan

అండ‌ర్‌-19 ఆసియాక‌ప్ 2026లో వీరేంద్ర సెహ్వాగ్ త‌న‌యుడు, భార‌త యువ ఓపెన‌ర్ ఆర్య‌వీర్ సెహ్వాగ్ మ‌రోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ టోర్నీలో భాగంగా అల్ అమెరాత్ క్రికెట్ గ్రౌండ్ వేదిక‌గా పాకిస్తాన్‌తో జ‌రుగుతున్న ఫైన‌ల్‌లో సెహ్వాగ్ హాఫ్ సెంచ‌రీతో మెరిశాడు.

338 పరుగుల భారీ లక్ష్య చేధనలో భారత్‌కు ఆర్యవీర్‌ ఘనమైన ఆరంభాన్ని ఇచ్చాడు. 61 బంతులు ఎదుర్కొన్న ఆర్యవీర్.. 9 ఫోర్ల సాయంతో 58 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇది అతడికి ఈ టోర్నీలో నాలుగో హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. ఈ ఈవెంట్‌లో మొత్తంగా ఐదు మ్యాచ్‌లు ఆడిన జానియర్ సెహ్వాగ్.. 361 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో అఫ్గాన్‌పై సాధించిన భారీ సెంచరీ కూడా ఉంది.

ఇక ఈ ఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే.. పాక్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి ఏకంగా 337 పరుగులు సాధించింది. పాక్ బ్యాటర్లలో ఉస్మాన్‌ ఖాన్‌(107 ) సెంచరీతో కదం తొక్కగా.. అబ్దుల్‌ ఖాదిర్‌ (54 బంతుల్లో 80; 3 ఫోర్లు, 8 సిక్సర్లు), ఫర్హాన్‌ యూసఫ్ (60 బంతుల్లో 63) హాఫ్ సెంచరీలతో రాణించారు. 

ఇక భారత బౌలర్లలో కావ్యా పటేల్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. చిగురుపాటి వెంకట మూడు, అర్జున్‌ రాజ్‌పుత్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement