న్యూజిలాండ్ గడ్డపై భారత్ అరుదైన రికార్డు | Only 2nd Time In 58 Years, KL, Jaiswal, Padikkal Script Historic Feat For India In New Zealand | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్ గడ్డపై భారత్ అరుదైన రికార్డు

Nov 21 2026 8:25 AM | Updated on Nov 21 2026 8:32 AM

Only 2nd Time In 58 Years, KL, Jaiswal, Padikkal Script Historic Feat For India In New Zealand

source: X

వెల్లింగ్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత టాపార్డర్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్ అద్భుతంగా రాణించారు. రాహుల్‌ కెరీర్‌లో 13 సెంచరీతో అదరగొట్టగా.. జైస్వాల్‌ (85), పడిక్కల్‌ (80) సెంచరీలకు చేరువలో ఔటయ్యారు. మూడో రోజు రెండో సెషన్‌ సమయానికి భారత్‌ స్కోర్‌ 344-2గా ఉంది. రాహుల్‌ (124), శుభ్‌మన్‌ గిల్‌ (36) క్రీజ్‌లో ఉన్నారు. న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు భారత్‌ ఇంకా 24 పరుగులు వెనుకపడి ఉంది.

అంతకుముందు న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. హెన్రీ నికోల్స్‌ (175 నాటౌట్‌), గ్లెన్‌ ఫిలిప్స్‌ (118) సెంచరీలతో అదరగొట్టారు. భారత బౌలర్లలో బుమ్రా 4, ఆకాశ్‌దీప్‌ 3, అన్షుల్‌ కంబోజ్‌ 2, ప్రసిద్ద్‌ కృష్ణ ఓ వికెట్‌ పడగొట్టారు.

58 ఏళ్లలో రెండోసారి మాత్రమే..!
ఈ మ్యాచ్‌లో భారత టాపార్డర్‌ బ్యాటర్లు ఓ అరుదైన ఘనత సాధించారు. న్యూజిలాండ్ గడ్డపై ఒకే టెస్టు ఇన్నింగ్స్‌లో టాపార్డర్‌లోని ముగ్గురు బ్యాటర్లు 50కి పైగా పరుగులు సాధించడం 58 ఏళ్లలో ఇది రెండోసారి మాత్రమే. చివరిసారిగా 1981 మార్చిలో క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన టెస్టులో ఈ ఘనత నమోదైంది.

ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సునీల్ గవాస్కర్ (53), చేతన్ చౌహాన్ (78), దిలీప్ వెంగ్‌సర్కార్ (61) అర్ధ సెంచరీలు సాధించారు. 1968లో భారత్ తొలిసారిగా న్యూజిలాండ్‌లో పర్యటించగా.. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ అరుదైన ఘనత రెండుసార్లు మాత్రమే నమోదైంది.

1994 తర్వాత తొలి సెంచరీ భాగస్వామ్యం
ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ తొలి వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. న్యూజిలాండ్ గడ్డపై భారత ఓపెనర్లు టెస్టుల్లో 100కు పైగా పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం 1994 తర్వాత ఇదే తొలిసారి.

జైస్వాల్‌ ఔటయ్యాక రాహుల్‌ పడిక్కల్‌తో కూడా శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ జోడీ రెండో వికెట్‌కు 165 పరుగులు జోడించింది.

ఒకే ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీ భాగస్వామ్యాలు
న్యూజిలాండ్ గడ్డపై ఒకే టెస్ట్‌ ఇన్నింగ్స్‌లో తొలి రెండు వికెట్లకు సెంచరీ భాగస్వామ్యాలు నమోదవడం గతంలో రెండుసార్లు మాత్రమే జరిగింది. జైస్వాల్‌-రాహుల్‌, రాహుల్‌-పడిక్కల్‌ జోడీలు ఈ సందర్భాన్ని మూడోసారి రిపీట్‌ చేశాయి. 

1. దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ - క్రైస్ట్‌చర్చ్, 1999.
2. న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ - క్రైస్ట్‌చర్చ్, 2022.
3. భారత్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌ - వెల్లింగ్టన్‌, 2026.

ఇదీ చదవండి: సూపర్‌ సెంచరీ.. చరిత్ర సృష్టించిన కేఎల్‌ రాహుల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement