ద్రవిడ్ రికార్డు బద్దలు కొట్టిన పడిక్కల్ | Devdutt Padikkal Breaks Rahul Dravid Elite Record Despite Missing Century In Wellington | Sakshi
Sakshi News home page

ద్రవిడ్ రికార్డు బద్దలు కొట్టిన పడిక్కల్

Nov 21 2026 10:12 AM | Updated on Nov 21 2026 10:12 AM

Devdutt Padikkal Breaks Rahul Dravid Elite Record Despite Missing Century In Wellington

source: X

వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. టాపార్డర్‌ మొత్తం భారీగా పరుగులు సాధిస్తున్నారు. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (136) సూపర్‌ సెంచరీతో కదంతొక్కగా.. యశస్వి జైస్వాల్‌ (85), దేవదత్‌ పడిక్కల్‌ (80) సెంచరీలకు చేరువలో ఔటయ్యారు. 

నాలుగో నంబర్‌ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ 78 పరుగులతో ఇన్నింగ్స్‌ కొనసాగిస్తుండగా.. అతడికి జతగా రిషబ్‌ పంత్‌ (7) క్రీజ్‌లో ఉన్నాడు. మూడో రోజు మూడో సెషన్‌ సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌ 414-3గా ఉంది. న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌పై భారత్‌ 46 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. 

అంతకుముందు న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. హెన్రీ నికోల్స్‌ (175 నాటౌట్‌), గ్లెన్‌ ఫిలిప్స్‌ (118) సెంచరీలతో అదరగొట్టారు. భారత బౌలర్లలో బుమ్రా 4, ఆకాశ్‌దీప్‌ 3, అన్షుల్‌ కంబోజ్‌ 2, ప్రసిద్ద్‌ కృష్ణ ఓ వికెట్‌ పడగొట్టారు.

కాగా, ఈ మ్యాచ్‌లో భారత టాపార్డర్‌ బ్యాటర్లు వ్యక్తిగతంగా, జట్టుగా పలు పాత రికార్డులు బద్దలు కొట్టి, కొన్ని కొత్త రికార్డులు సెట్‌ చేశారు. ఈ క్రమంలో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 175 బంతుల్లో 80 పరుగులు చేసిన పడిక్కల్‌ కూడా ఓ రికార్డును బ్రేక​్‌ చేశాడు. సెంచరీకి చేరువగా వచ్చి ఔటైనప్పటికీ.. భారత దిగ్గజం రాహుల్ ద్రవిడ్ పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డును అధిగమించాడు.

వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్ మైదానంలో టెస్టుల్లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన భారత ఆటగాళ్లలో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు సాధించిన జాబితాలో రెండో స్థానానికి చేరాడు. గతంలో ఈ స్థానంలో ఉన్న రాహుల్ ద్రవిడ్‌ను వెనక్కి నెట్టాడు.

బేసిన్ రిజర్వ్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ భారత ఆటగాళ్లు సాధించిన అత్యధిక స్కోర్లు:
1. అజిత్ వాడేకర్ - 143 పరుగులు (1968)
2. దేవదత్ పడిక్కల్ - 80 పరుగులు (175 బంతులు, 2026)
3. రాహుల్ ద్రవిడ్ - 76 పరుగులు (173 బంతులు, 2002)

ఇదీ చదవండి: న్యూజిలాండ్ గడ్డపై భారత్ అరుదైన రికార్డు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement