భారత క్రికెట్ జట్టు (PC: BCCI X)
జేమ్స్ ఆండర్సన్.. క్రికెట్ ప్రేమికులకు ఈ పేరు సుపరిచితమే. ఇంగ్లండ్ తరఫున మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా టెస్టుల్లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్‌గా పేరొందిన ఘనుడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో 188 టెస్టులు ఆడిన ఆండర్సన్ ఏకంగా 704 వికెట్లు కూల్చాడు. తద్వారా టెస్టుల్లో అత్యధిక వికెట్ల పేసర్‌గా కొనసాగుతున్నాడు.
సచిన్‌ను కాదని..
తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన జేమ్స్ ఆండర్సన్ వివిధ దేశాల నుంచి తన అభిమానల క్రికెటర్ల పేర్లను ఎంచుకున్నాడు. అయితే, భారత్ నుంచి టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్‌ను కాకుండా.. మరో లెజెండ్‌ను ఆండర్సన్ ఎంచుకోవడం విశేషం. అతడు మరెవరో కాదు.. వన్డే రారాజు విరాట్ కోహ్లి.
జాబితాలో బాబర్ ఆజం కూడా
ఇక ఆస్ట్రేలియా నుంచి షేన్ వార్న్, ఇంగ్లండ్ నుంచి జో రూట్, పాకిస్తాన్ నుంచి బాబర్ ఆజం, న్యూజిలాండ్ నుంచి టిమ్ సౌతీ, సౌతాఫ్రికా నుంచి ఏబీ డివిలియర్స్, శ్రీలంక నుంచి సనత్ జయసూర్య తన ఫేవరెట్ క్రికెటర్లు అని జేమ్స్ ఆండర్సన్ గతంలో టీఎన్‌టీ స్పోర్ట్స్ వీడియోలో పేర్కొన్నాడు. ఇపుడు ఈ వీడియో మరోసారి తెరమీదకు రాగా వైరల్‌గా మారింది.
టెండుల్కర్ వర్సెస్ కోహ్లి: ఇద్దరిలో ఆండర్సన్‌ను ఇబ్బందిపెట్టింది ఎవరు?
సచిన్‌ను కాదని ఆండర్సన్ కోహ్లిని ఎంచుకోవడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే, టెస్టుల్లో సచిన్‌ను ఆండర్సన్ తొమ్మిదిసార్లు అవుట్ చేయగా.. ఆండర్సన్ బౌలింగ్‌లో టెస్టుల్లో కేవలం ఏడుసార్లే అవుటయ్యాడు.
ఇక ఆండర్సన్‌తో సచిన్ 23 ఇన్నింగ్స్‌లో ముఖాముఖి తలపడి.. 350 బంతులు ఎదుర్కొని 208 పరుగులు చేశాడు. మరోవైపు కోహ్లి 36 ఇన్నింగ్స్‌లో ఆండర్సన్ బౌలింగ్‌లో 710 బంతులు ఎదుర్కొని 305 పరుగులు సాధించాడు.
ఇదీ చదవండి: IND vs NZ: నాలుగో వన్డేకు భారత తుదిజట్టు ఇదే!.. ఓపెనర్లుగా వీరే
James Anderson picks Virat Kohli as the favourite Indian Cricketer 🐐 [TNT Sports] https://t.co/jJfDHqncrF
— Johns. (@CricCrazyJohns) November 12, 2026


