లంకతో తొలి టెస్టు.. పాక్ బ్యాట‌ర్‌ చెత్త రికార్డు | Pakistan Saud Shakeel Equals Babar Azam Unwanted Record In Test Cricket After Missing Century By Just Seven Runs, Check Details Inside | Sakshi
Sakshi News home page

లంకతో తొలి టెస్టు.. పాక్ బ్యాట‌ర్ చెత్త రికార్డు

Nov 10 2026 3:39 PM | Updated on Nov 10 2026 3:51 PM

Pak Batter Saud Shakeel-Equals Babar Azam-Worst Record-Test Cricket

Photo Credit: Twitter

రావల్పిండి వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాటర్ సాద్ షకీల్ చెత్త రికార్డును నమోదు చేశాడు. మ్యాచ్‌లో 93 పరుగులు చేసిన షకీల్ ఏడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. టెస్టుల్లో సాద్ షకీల్ తొంబైల్లో ఔటవ్వడం ఇది మూడోసారి. ఈ నేపథ్యంలో కెప్టెన్ బాబర్ ఆజం రికార్డును సమం చేశాడు. 

బాబ‌ర్ ఆజం కూడా టెస్టుల్లో మూడుసార్లు నెర్వ‌స్ నైంటీస్ కేట‌గిరీలో నిలిచాడు. ఇక పాక్ త‌ర‌ఫున మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హ‌క్ టెస్టుల్లో ఏకంగా 8సార్లు తొంబైల్లో ఔట‌వ్వ‌గా, మ‌రో మాజీ ఆట‌గాడు మిస్బా ఉల్ హ‌క్ ఐదుసార్లు నెర్వ‌స్ నైంటీస్ బారిన ప‌డ్డాడు.

ఇక 2022లో పాకిస్తాన్ త‌ర‌ఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన సాద్ ష‌కీల్ బెస్ట్ బ్యాట‌ర్‌గా నిలిచాడు. 2022 డిసెంబ‌ర్ నుంచి సాద్ ష‌కీల్ 51 ఇన్నింగ్స్‌ల్లో 43.72 స‌గ‌టుతో 2,099 ప‌రుగులు సాధించాడు. అత‌డి ఖాతాలో నాలుగు సెంచ‌రీలున్నాయి. ఆ త‌ర్వాత బాబ‌ర్ ఆజం (1699 ప‌రుగులు), స‌ల్మాన్ అగా (1641 ప‌రుగులు), షాన్ మ‌సూద్ (1548 ప‌రుగులు) ఉన్నారు.

ఇక మ్యాచ్ విష‌యానికొస్తే, పాకిస్తాన్ త‌మ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల న‌ష్టానికి 434 ప‌రుగుల వ‌ద్ద డిక్లేర్ చేసింది. సాద్ ష‌కీల్ స‌హా ఐదుగురు పాక్ బ్యాట‌ర్లు (త‌యాబ్ ఆరిఫ్‌, మొహ‌మ్మ‌ద్ త‌హా, బాబ‌ర్ ఆజం, అరాఫ‌త్ మిన్హాస్‌లు) అర్థ‌శ‌త‌కాల‌తో మెరిశారు. లంక బౌల‌ర్ల‌లో దిల్షాన్ మ‌దుషంక‌, అసితా ఫెర్నాండో చెరో 3 వికెట్లు తీయ‌గా, లాహిరు కుమారా, మిల‌న్ ప్రియాంత్‌, సోనాల్ దినూష త‌లా ఒక వికెట్ ప‌డ‌గొట్టారు.

ఇదీ చదవండి: ధోని రికార్డు బ‌ద్ద‌లుకొట్టిన కోహ్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement