PC: BCCI X
ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియా కప్-2026 వన్డే టోర్నమెంట్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు సాధించింది. అల్ ఎమిరెట్ వేదికగా ఈ టోర్నీలో గ్రూప్-‘ఎ’ నుంచి తొలుత నేపాల్‌తో తలపడ్డ భారత్ భారీ విజయం సాధించింది. అనంతరం దాయాది పాకిస్తాన్ చేతిలో అనూహ్య రీతిలో ఓటమిపాలైంది.
తాజాగా మంగళవారం నాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో మాత్రం భారత బ్యాటర్లు సత్తా చాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లలో కెప్టెన్ లక్ష్య రాయ్‌చందాని (32 బంతుల్లో 17) నిరాశపరిచాడు.
ఆర్యవీర్ సెహ్వాగ్ భారీ శతకం
అయితే, మరో ఓపెనర్ ఆర్యవీర్ సెహ్వాగ్, వన్‌డౌన్ బ్యాటర్ వీకే వినీత్ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. ఈ క్రమంలో జూనియర్ సెహ్వాగ్ 131 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 168 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ పదిహేడు ఫోర్లు, ఏడు సిక్సర్లు బాది ఏకంగా 160 పరుగులు సాధించాడు.
Aaryavir Sehwag celebrates his landmark 150 with a towering six. 🥵 Watch #INDvUAE in the DP World Men's U19 Asia Cup, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV https://t.co/kkBShecWuh
— Sony Sports Network (@SonySportsNetwk) November 10, 2026
వినీత్ హాఫ్ సెంచరీ
అయితే, నసీం ఖాన్ బౌలింగ్‌లో ఉద్దీశ్ సూరికి క్యాచ్ ఇవ్వడంతో ఆర్యవీర్ భారీ ఇన్నింగ్స్ ముగిసిపోయింది. ఇక వీకే వినీత్ అర్ధ శతకం (69 బంతుల్లో 67; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో రాణించాడు. ఆర్యవీర్‌తో కలిసి రెండో వికెట్‌కు 193 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు.
VK Vineeth knows how to make a statement! 💥 Watch #INDvUAE in the DP World Men's U19 Asia Cup, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV https://t.co/PpDKMmzgQV
— Sony Sports Network (@SonySportsNetwk) November 10, 2026
వీరిద్దరు అవుటైన తర్వాత భారత్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. పాక్‌తో మ్యాచ్‌లో శతక్కొట్టిన అర్జున్ రాజ్‌పుత్ (4) పూర్తిగా విఫలం కాగా.. యశ్‌వర్దన్ చౌహాన్ 17, వికెట్ కీపర్ బ్యాటర్ అన్వయ్ ద్రవిడ్ 12 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించారు. లోయర్ ఆర్డర్‌లో మనాల్ చౌహాన్ (1) తేలిపోగా.. మోహిత్ ఉల్వా 7, ఆర్యర్ సస్వాని 2 పరుగులతో అజేయంగా నిలిచారు.
నసీం ఖాన్‌కు 4 వికెట్లు
ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో భారత్ ఏడు వికెట్ల నష్టానికి 309 పరుగులు సాధించింది. యూఏఈ బౌలర్లలో నసీం ఖాన్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. హదాయతుల్లా ఖాన్, నూరుల్లా అయోబి, కెప్టెన్ అయాన్ మిస్బా తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.
ఇదీ చదవండి: జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా పృథ్వీ షా!.. మరి రుతురాజ్?


