మహబూబ్‌నగర్ : బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు గౌరమ్మ ఉయ్యాలో.. ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మా.. అంటూ విద్యార్థినులు, అధ్యాపకులు ఉత్సాహంగా ఆడిపాడారు.
విద్యార్థినులు నృత్యాలు, పాటలు, కేరింతల మధ్య గురువారం ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.
కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి హాజరై మాట్లాడారు. అంతకు ముందు టీజీఎస్‌జీడీసీఎఫ్‌ఎల్ చైర్మన్ సరిత, మేయర్ మమత బతుకమ్మ ఆడారు.


