హైదరాబాద్: ఆర్చరీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ ను కాకతీయ నైట్స్ జట్టు విజయంతో మొదలు పెట్టింది. నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో గురువారం రాత్రి ఈ పోటీలు ప్రారంభమయ్యాయి.
తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి టోర్నీని ఘనంగా ప్రారంభించారు.
తొలి మ్యాచ్లో కాకతీయ నైట్స్ 'టైబ్రే కర్'లో మైటీ మరాఠాస్ ను ఓడించింది.
భారతీయ సంస్కృతిలో విలువిద్యకు ప్రత్యేక స్థానం ఉందని, ఇప్పుడు మన ఆర్చర్లు అంతర్జా తీయ స్థాయిలో ప్రతిష్టాత్మక పోటీల్లో రాణిస్తుం డటం గర్వకారణమని ఆయన అన్నారు.
టోర్నీ డైరె క్టర్ అనిల్ కామినేని, భారత ఆర్చరీ సంఘం అధ్య క్షుడు అర్జున్ ముండా తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
ఇటీవల ఆసియా క్రీడల్లో పత కాలు సాధించిన భారత ఆర్చర్లతో పాటు వరల్డ్ చాంపియన్షిప్ లో కూడా విజయాలు అందుకున్న ఆర్చర్లను ఈ సందర్భంగా సన్మానించారు.


